twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లరి నరేష్ ‘సంఘర్షణ’ మూవీ రివ్యూ..

    By Bojja Kumar
    |

    నటీనటులు : అల్లరి నరేష్, కలర్స్ స్వాతి, శశి కుమార్, వసుంధర, నివేదిత తదితరులు
    దర్శకత్వం : పి. సముద్రఖని
    నిర్మాత : దామోదర ప్రసాద్
    సంగీతం : సుందర్ సి. బాబు

    ఆ మధ్య వచ్చిన 'శంభో శివ శంభో" సినిమాకు దర్శకత్వం వహించి సముద్రఖని...తమిళంలో రూపొందించిన 'పోరాలి" సినిమా తెలుగులో 'సంఘర్షణ" పేరుతో అనువాదమై రిలీజైంది. ఇప్పటి వరకు కామెడీ కార్యరెక్టర్లతో అలరించిన అల్లరి నరేష్ ఈ సినిమాలో విభిన్నమైన పాత్రలో కనిపించాడు.

    ''జంతువులు తమ స్వభావాన్ని బట్టి ఒక్కో రకంగా శబ్దం చేస్తాయి. కానీ మనిషి అన్ని రకాల శబ్దాలు చేయగలడు. అంటే జంతు స్వభావాన్ని కలిగి ఉంటాడు. అలాంటి జంతువుల్లాంటి క్రూరమైన మనుషుల మధ్య అమాయకు మనుషులు కూడా జీవించ వలసి వస్తుంది. అప్పుడే అమాయక మనుషులలో 'సంఘర్షణ" మొదలువుతుంది"" అనే కథాంశంతో ఈసినిమాను రూపొందించారు.

    కథలోకి వెళితే..
    విక్రమ్(అల్లరి నరేష్), కుమార్(శశి కుమార్) ఏదో ఒక పని చేసి సెటిల్ అవుదామని హైదరాబాద్ వస్తారు. ఇక్రడే పులిరాజు అనే వ్యక్తి ఇంట్లో ఉంటారు. కుమార్ చుట్టు పక్కల వారితో స్నేహంగా ఉంటూ మంచి వాడిగా పేరు తెచ్చుకుంటాడు. చిన్న చిన్న పనులు చేస్తూ వచ్చిన కుమార్ కొన్ని రోజుల తర్వాత సొంతగా ఓ వ్యపారం మొదలు పెట్టి చుట్టు పక్కల వారికి కూడా మంచి చేస్తుంటాడు. కుమార్ మంచితనం చూసి భారతి(స్వాతి) అతన్ని ప్రేమిస్తుంది. విక్రమ్ కూడా తనతో పాటు పని చేసే బాల సరస్వతితో ప్రేమలో పడతాడు. అంతా సజావుగా సాగిపోతుందన్న సమయంలో అనుకోని మలుపు తిరుగుతుంది సినిమా.

    కొంత మంది వ్యక్తుల వచ్చి విక్రమ్, కుమార్లను చితకబాదుతారు. ఎందుకు కొడుతున్నారని చుట్టు పక్కల వారు దాడిచేసిన వారిని నిలదీస్తే ఆ ఇద్దరు మానసిక రోగులని, పిచ్చాసుపత్రి నుంచి పారి పోయి వచ్చారని చెబుతారు. మరి దాడి చేసిన వారు ఎవరు? మాసనిక రోగులైన విక్రమ్, కుమార్ లు ఇంత కాలం మామూలు మనుషుల మధ్య ఎలా ఉండ గలిగారు? చివరకు ఏమైంది? అనేది తెరపై చూడాల్సిందే.

    విశ్లేషణ..
    దర్శకుడు సముద్రఖని... ఈ సినిమా ద్వారా మనుషుల్లోని క్రూరజంతు స్వభావాన్ని ఫోకస్ చేసే ప్రయత్నం చేశాడు. మనుషులు మానసికంగా డిస్టర్బ్ కావడానికి వారి చుట్టూ ఉన్న పరిస్థితులే...వారి కి ప్రేమ పంచితే ఎలాంటి మానసిక రోగులైనా మామూలు మనుషులు అవుతారు అనే కోణాన్ని సముద్రఖని ఫోకస్ చేసే ప్రయత్నం చేశాడు. ఇలాంటి కథలను సినిమా రూపంలోకి తేవాలంటే కొన్ని కమర్షియల్ అంశాలు అడ్డంకిగా ఉంటాయి. వాటిని రంగరించి తొలి సగభాగం ఆసక్తిగానే తెరకెక్కించిన దర్శకుడు....రెండో భాగంలో మాత్రం మెలోడ్రామా డోసు పెంచి ప్రేక్షకులకు బోరెత్తించాడు. అయితే అలాంటి కథలు అలానే తీయాలి. కానీ వినోదం కరువైంది కాబట్టి ప్రేక్షకులకు నచ్చక పోవచ్చు. మొత్తానికి సముద్రఖని దర్శత్వం, నటల ఎంపిక పర్ ఫెక్టుగా ఉంది.

    సినిమా టేకింగ్ బాగుంది. సుందర సి.బాబు అందించిన పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. ఖాదిర్ సినిమాటోగ్రఫీ బ్రిలియంట్ గా ఉంది, సుబ్రహ్మణ్యం ఫైట్స్ నేచురల్ గా ఉన్నాయి. నిర్మాణాత్మక విలువలు ఫర్వాలేదు.

    పెర్ఫార్మెన్స్...
    శశికుమార్ నటన బాగుంది. తన పాత్రకు తగిన విధంగా డీసెంట్ నటించాడు. అల్లరి నరేష్ టెర్రిఫిక్ నటనతో తన టాలెంట్ చూపించాడు. అయితే రెండో భాగంలో పరిమితమైన పాత్ర కవడంతో తెలుగు ప్రేక్షకులు డిస్సప్పాయింట్ అవక తప్పదు. స్వాతి క్యూట్ గా, మెచ్యూర్ గా నటించింది. ఇతర నటీనటులు వారి వారి పాత్రల మేరకు రాణించారు.

    చివరగా...
    ఎంటర్ టైన్మెంట్ కోణంలో ఈ సినిమాను చూడటానికి వెళితే కాస్త నిరాశ తప్పదు. సబ్జెక్టు పరంగా సినిమా ఓకే. కానీ ఓవర్ మెలోడ్రామాను భరించడం మాత్రం అందరి ప్రేక్షకుల వల్ల కాకపోవచ్చు.

    English summary
    Director Samuthirakani who made Shambo Shiva Sambho in Telugu roped in Allari Naresh for his latest film Porali, which has Sasi Kumar playing the main lead. This was dubbed in Telugu as Sangarshana.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X