Sankranthiki Vasthunam First Review: సంక్రాంతికి వస్తున్నాం ఫస్ట్ రివ్యూ.. వెంకటేష్ మూవీ హిట్టా? ఫట్టా?
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. గతంలో F2, F3 సినిమాలతో భారీ విజయాలు అందుకొన్నారు. వారిద్దరి మూడో చిత్రాన్ని మళ్లీ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిందారు. దిల్ రాజు, శిరీష్ ద్వయం ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. జనవరి 14న ఈ చిత్రం సంక్రాంతి కానుకగగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..
అనిల్ రావిపూడి తనకు సేఫ్ గేమ్‌గా మారిన కామెడీతోనే మరోసారి ప్రయత్నం చేశారు. కాకపోతే ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే డిఫరెంట్ జోనర్‌ను అటెంప్ట్ చేశారు. అయితే ఫ్యామిలీ డ్రామాతోపాటు క్రైమ్ ఎలిమెంట్స్ ఈ సినిమాకు ప్రధాన అస్త్రంగా మార్చారనే విషయాన్ని ఇటీవల వెంకటేశ్ వెల్లడించారు. ఈ సినిమా కథను అనిల్ చెప్పినప్పుడే బ్లాక్ బస్టర్ అవుతుందనే ఫీలింగ్ కలిగింది. అందుకే మేము పలు మార్లు కథపై చర్చలు జరుపుకొని పక్కాగా స్క్రిప్టును డ్రైవ్ చేసినట్టు తెలిపారు.

ఇక వెంకటేష్ ఈ చిత్రంలో సస్పెన్షన్‌కు గురైన పోలీస్ ఆఫీసర‌్‌గా నటిస్తున్నారు. పోలీస్ ఆఫీసర్‌గా పనిచేసే సమయంలో ఎస్సై (మీనాక్షి చౌదరీ)తో అఫైర్ కొనసాగడం.. ఆ తర్వాత ఆమెను కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకోకపోవడమనేది ఈ సినిమాను డ్రైవ్ చేసే మరో మెయిన్ పాయింట్ అని చెప్పుకొంటున్నారు. ఈ పాయింట్ చుట్టే కథను, ఫ్యామిలీ డ్రామాను నడిపించారట.
పోలీసులకు సవాల్‌గా మారిన ఓ క్రైమ్ కారణంగా వెంకటేష్‌పై పడిన సస్పెన్షన్‌ను ఎత్తి వేసి.. నేరస్థులను అప్పగించే బాధ్యతను ఆయనపై పెడుతారు. ఆయన సహకరించేందుకు ఎస్పై మీనాక్షిని తోడుగా పంపాలని నిర్ణయించుకొంటారు. అయితే ఆ విషయం తెలిసిన భార్య భాగ్యం (ఐశ్వర్య రాజేశ్)కు అనుమానాలు వస్తాయి. తన కాపురంలోకి మళ్లీ ఆయన మాజీ ప్రేయసి వస్తుందా? అని భయంతో కేసు విచారణకు తాను కూడా వస్తానని మొండికేస్తుంది. దాంతో ఇద్దరు ఆడవాళ్ల మధ్య నలిగే ఆఫీసర్‌గా ఫన్‌ను పూర్తి స్థాయిలో జనరేట్ చేశారని చెబుతున్నారు.

ఇక కేసు విచారణతోపాటు మాజీ ప్రేయసి, భార్య మధ్య సెటైరికల్ డ్రామా పీక్స్‌లో ఉంటుంది. అలాగే నలుగురు పిల్లలతో హెల్తీ కామెడీ చక్కగా పండిందనే విశ్వాసాన్ని చిత్ర యూనిట్ వ్యక్తం చేస్తున్నది. అయితే ఈ డ్రామాకు తోడుగా పాటలు కూడా ప్రేక్షకుల్లోకి వెళ్లిపోవడంతో అంచనాలు పెరిగిపోయాయి. అంచనాలకు తగినట్టుగానే ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉందనే అడ్వాన్స్ బుకింగ్‌కు ఉన్న క్రేజ్ తెలియజెబుతున్నది.
పూర్తి వినోదంగా సాగే ఈ సినిమాను సెన్సార్ చేసిన అధికారులు కూడా మంచి ప్రశంసలు గుప్పించారని చిత్ర యూనిట్ వెల్లడించింది. దాంతో ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందనే అభిప్రాయం మరింత బలపడింది. అయితే ఇద్దరు మహిళల మధ్య వెంకీ మరోసారి ఎలా నలిగాడు? ఈ కథను మలుపు తిప్పే క్రైమ్ పాయింట్ ఏమిటనే తెరపైనే చూసి ఎంజాయ్ చేయాలంటున్నారు వెంకటేష్.


Click it and Unblock the Notifications











