Sankranthiki Vasthunam Review: సంక్రాంతికి వస్తున్నాం మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరీ, ఐశ్వర్య రాజేశ్, వీకే నరేష్, వీటీ గణేష్, సాయి కుమార్, పమ్మి సాయి, సర్వదమన్ బెనర్జీ తదితరులు
దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాత: దిల్ రాజు
సినిమాటోగ్రఫి: సమీర్ రెడ్డి
ఎడిటర్: తమ్మిరాజు
మ్యూజిక్: భీమ్స్ సిసిరిలియో
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
రిలీజ్ డేట్: 2025-01-14

అనాథగా పెరిగిన యాదగిరి దామోదర రాజు ( విక్టరీ వెంకటేష్) పోలీస్ ఉద్యోగంలో చేరి ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా మారుతాడు. తన సహ ఉద్యోగి డీసీపీ మీనాక్షితో ప్రేమ వ్యవహారం కొసాగించినప్పటికీ.. వారి బంధం పెళ్లితో ముడిపడలేకపోతుంది. దాంతో భాగ్యలక్ష్మీ అలియాస్ భాగ్యం (ఐశ్వర్య రాజేశ్)ను పెళ్లి చేసుకొంటాడు. ఇదిలా ఉండగా.. కేంద్ర ప్రభుత్వ ఆహ్వనం మేరకు అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన ఎన్నారై ఆకెళ్ల సత్యం (అవసరాల శ్రీనివాస్)‌ను బీజూ పాండే గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. అయితే అప్పటికే సస్పెండ్ అయిన రాజుకు, డీసీపీ మీనాక్షికి సత్యంను విడిపించే బాధ్యతను అప్పగిస్తారు.

Sankranthiki Vasthunam Movie Review in Telugu  Venkatesh  Anil Ravipudi shows their Hilarious Mark

ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు దామోదర రాజు ఎందుకు సస్పెండ్ అయ్యాడు? సత్యంను పాండే గ్యాంగ్ ఎందుకు కిడ్నాప్ చేస్తారు? మీనాక్షితో రాజు బ్రేకప్ ఎందుకు జరుగుతుంది? ఏ పరిస్థితుల్లో భాగ్యలక్ష్మీని రాజు పెళ్లి చేసుకొంటాడు? సత్యంను కిడ్నాప్ నుంచి విడిపించేందుకు చేపట్టిన ఆపరేషన్‌లో భాగ్యం కూడా ఎందుకు భాగస్వామ్యమైంది? భాగ్యానికి మీనాక్షి రూపంలో సవతిపోరు ఎలాంటి సమస్యలు తెచ్చింది? మాజీ ప్రేయసి, భార్య మధ్య రాజు నలిగాడు? తన పెంపుడు తండ్రి (సర్వదమన్ బెనర్జీ) కోసం ఎంత వరకు వెళ్లాడు? చివరకు సత్యం కిడ్నాప్ డ్రామా ఎలా సుఖాంతమైంది అనే ప్రశ్నలకు సమాధానమే సంక్రాంతికి వస్తున్నాం సినిమా కథ.

సినిమా కథ విషయానికి వస్తే.. పాత కథనే కొత్త సీసాలో పోసిన రెగ్యులర్, రొటీన్ కమర్షియల్ పాయింట్. కాకపోతే తనదైన శైలిలో హస్యాన్ని జోడించడంలో దిట్ట అయిన అనిల్ రావిపూడి అదే ట్రీట్‌‌‌‌మెంట్‌తో చెలరేగిపోయాడు. కొన్నిసార్లు జంధ్యాల మార్కు కామెడీ కనిపిస్తే.. మరికొన్ని సార్లు పక్కా జబర్దస్త్ సీన్లను గుర్తు చేస్తుంది. అయితే వెంకీ మామ ఇమేజ్.. ఆయనకు ఉన్న ఫ్యామిలీ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఓ మీటర్‌లో రాసుకొన్న సన్నివేశాలు హిలేరియస్ హాస్యాన్ని పండించాయి. ఎంటర్‌టైన్‌‌మెంట్‌తోపాటు యాక్షన్ జోడించి సంక్రాంతి పండుగ సంబరాన్ని సినీ అభిమానులకు పంచాడనే చెప్పాలి.

Sankranthiki Vasthunam Movie Review in Telugu  Venkatesh  Anil Ravipudi shows their Hilarious Mark

నటీనటుల విషయానికి వస్తే.. వెంకటేష్‌కు రాజు క్యారెక్టర్ టైలర్ మేడ్ రోల్. అనాథగా, ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా, మాజీ ప్రియుడిగా, బాధ్యాతయుతమైన భర్త, తండ్రి, కొడుకుగా ఇలా రకరకాల షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. తనదైన మేనరిజం, బాడీ లాంగ్వేజ్‌లో మరోసారి ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఎంటర్‌టైన్‌మెంట్ రూపంలో ఫుల్ మీల్స్ అందించాడు. ఇక ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి తమ పాత్రలతో చెలరేగిపోయారు. తమ క్యారెక్టర్లలో లీనమై నటించారు. పమ్మీ సాయి, వీటీ గణేష్, వీకే నరేష్ తదితరులు హాస్యంతో ఆకట్టుకొన్నారు. గోదావరి యాసలో పమ్మిసాయి.. కథను మలుపు తిప్పే పాత్రలో గణేష్ నవ్వుల్లో ముంచెత్తుతారు. వెంకటేష్ కొడుకుగా నటించిన అబ్బాయి ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. మిగితా క్యారెక్టర్లలో నటించిన ప్రతీ ఒక్కరు తన మార్కును చూపించుకొన్నారు.

సాంకేతిక నిపుణుల పనితీరు విషయానికి వస్తే.. బీజీఎం, సాంగ్స్‌తో భీమ్స్ ఫుల్ మార్కులు కొట్టేశాడు. సినిమా రిలీజ్‌కు హిట్ వైబ్ అందించిన ఆయన తెరపైన పాటలను, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో మరో రేంజ్‌కు తీసుకెళ్లాడని చెప్పాలి.ఇక సమీర్ రెడ్డి ప్రతీ సీన్‌ను అందంగా చెక్కారు. గోదావరి అందాలను చక్కగా కెమెరాలో బంధించారు. తమ్మిరాజు సినిమాను పరుగులు పెట్టించారు. దిల్ రాజు ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. మరోసారి సంక్రాంతికి కుటుంబం అంతా వినోదించే ఫ్యామిలీ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అందించిందనే చెప్పాలి.

ఫన్, ఫాదర్ సెంటిమెంట్, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ లాంటి అంశాలను కలబోసి రూపొందించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఫస్టాఫ్ సినిమా క్రేజీగా సాగిపోతే.. సెకండాఫ్ కొంత సాగదీసినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో ఎక్కువ అంచనా వేసుకొంటే కొంత డిజాపాయింట్ అవుతారు. కాకపోతే పూర్తి క్లీన్ ఎంటర్‌టైన్‌మెంట్ చూశామని తృప్తితో ప్రేక్షకుడు బయటకు వచ్చేలా సినిమా ఉంటుంది. ఈ సంక్రాంతికి ఫ్యామిలీ అంతా కలిసి చూసే జంధ్యాల మార్కు కామెడీ సినిమా. థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ కోసం సినిమా హాళ్లలోనే చూస్తే మంచి అనుభూతి కలుగుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X