Sankranthiki Vasthunam Twitter Review: సంక్రాంతికి వస్తున్నాం ట్విట్టర్ రివ్యూ.. వెంకీ మామ ర్యాంపేజ్!

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. గతంలో F2, F3 సినిమాలతో భారీ విజయాలు అందుకొన్నారు. వారిద్దరి మూడో చిత్రాన్ని మళ్లీ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిందారు. దిల్ రాజు, శిరీష్ ద్వయం ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించారు.

మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. జనవరి 14న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రిలీజైంది. ఈ సినిమా గురించి ప్రేక్షకులు, క్రిటిక్స్,అభిమానులు సోషల్ మీడియాలో వెల్లడించిన రివ్యూ వివరాల్లోకి వెళితే..

sankranthiki vasthunam Movie Twitter Review in Telugu  Is Venkatesh  Anil Ravipudi Combo hits bulls eye

సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫస్టాఫ్ టెర్రిఫిక్‌గా ఉంది. సాంగ్స్ సినిమాలో లీనమయ్యేలా చేస్తాయి. కామెడీ విషయంలో వెంకీ మామ ఇరుగదీశాడు. కొన్ని జోక్స్ అడల్డ్ జోక్స్ మాదిరిగా ఉంటాయి. కానీ అంతగా ఇబ్బంది పెట్టవు. ఓవరాల్‌గా ఈ సినిమా ఫన్ రైడ్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.


సంక్రాంతి పండుగ సీజన్‌కు తగినట్టుగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా టైంపాస్ మూవీ. కేవలం వినోదం కోసం మాత్రమే తీసిన సినిమా. గతంలో అనిల్ రావిపూడి తీసిన ఎఫ్2 మాదిరిగానే ఉంది. కామెడీ కొన్ని చోట్ల బాగా నవ్విస్తుంది. కానీ కొన్ని చోట్ల చీప్‌గా ఉంటుంది. ప్రొడక్షన్ క్వాలిటీస్ అంతంత మాత్రంగానే ఉంటాయి. ఈ సినిమాలో కథ లేదు. మ్యూజిక్ బాగుంది. వెంకటేశ్ తనదైన శైలిలో వినోదాన్ని పంచాడు అని ఓ క్రిటిక్ రివ్యూ రాశాడు.

ఈ సినిమాను నేను ఇప్పుడే చూశాను. యూకే ఆడియెన్స్ ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. వెంకటేష్ గారు.. మీలాగా ఎవరూ ఎంజాయ్ చేయరు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ఈ సంక్రాంతి సీజన్‌లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా మరో హిట్ సినిమా. వెంకీ, ఐశ్వర్య, మీనాక్షి అంతా బాగా నటించారు. అనిల్ రావిపూడి బాగా తీశాడు. డాకు మహారాజ్ కమర్షియల్ హిట్ అయితే.. ఇది హాస్యంతో కూడిన సూపర్ హిట్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.


వెంకీ మామ ర్యాంపేజ్.. బ్లాక్ బస్టర్ లోడింగ్.. అడ్వాన్స్ బుకింగ్ షేక్ చేస్తున్నాయి. సినిమా రేంజ్ ఏమిటో రిలీజ్ తర్వాత తెలుస్తుంది. ఎంటర్‌టైన్మెంట్‌తో కుమ్ముడే అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్‌లో విక్టరీ వెంకటేశ్ గారి ఎనర్జీ సూపర్బ్‌గా ఉంది. వెంకీ సార్, అనిల్ రావిపూడి గారికి, చిత్ర యూనిట్‌కు గ్రాండ్ ఫెస్టివ్ బ్లాక్‌బస్టర్ లభించాలి. ఈ సంక్రాంతికి నిజమైన విజయం లభిస్తుందని ఆశిస్తున్నా అని హీరో శ్రీ విష్ణు ట్వీట్ చేశారు.


సినిమా షూటింగ్ సమయంలో ఫుల్లుగా ఫన్, ఎంజాయ్ చేశాం. బిగ్ స్క్రీన్ మీద సినిమా చూస్తున్నప్పుడు అంతకంటే ఎక్కువగా ఎంజాయ్ చేశాం. మీరు కూడా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా థియేటర్‌లో రిలీజైంది అని వెంకటేశ్ ట్వీట్ చేశారు.

అనిల్ రావిపూడి.. మా ఇంట్లో కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు తప్పా వేరే ఏ సినిమాకు వెళ్లవద్దని అంటున్నారు. ఒకవేళ హిట్ పడిందంటే ఈ సినిమా క్వీన్ స్వీప్ చేస్తుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌లో క్రేజ్ మాములుగా లేదు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X