Santhana Prapthirasthu Movie Review: సంతాన ప్రాప్తిరస్తు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: విక్రాంత్, చాందినీ చౌదరీ, వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, మురళీధర్ గౌడ్ తదితరులు
దర్శకత్వం: సంజీవ్ రెడ్డి
నిర్మాతలు: మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి
మ్యూజిక్: సునీల్ కశ్యప్
సినిమాటోగ్రాఫర్: మహి రెడ్డి పండుగుల
ఎడిటర్: సాయికృష్ణ గనాల
రిలీజ్ డేట్: 2025-11-14

లేడీస్‌తో మాట్లాడటానికి సిగ్గుపడే చైతన్య (విక్రాంత్) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అలాంటి యువకుడైన కళ్యాణి (చాందినీ చౌదరీ)ని తొలి చూపులోనే ప్రేమించేస్తాడు. వారి మధ్య ప్రేమ వ్యవహారం గాఢంగా మారి పెళ్లి చేసుకోవాలని అనుకొంటారు. కానీ కళ్యాణి తండ్రి (మురళీధర్ గౌడ్) అభ్యంతరం చెబుతాడు. ఈ క్రమంలో జాక్ రెడ్డి (తరుణ్ భాస్కర్) సహాయంతో తండ్రి మాటను ఎదిరించి చైతన్యను కళ్యాణి వివాహం చేసుకొంటుంది. వారి కాపురం సవ్యంగా సాగుతున్న సమయంలో చైతన్య సంతానానికి యోగ్యుడు కాదని తెలుస్తుంది. చైతన్య ఇలాంటి సమస్యతో బాధపడుతుండగా.. కళ్యాణి తండ్రి తన కూతురు కాపురాన్ని కలతలు రేపి.. వేరే పెళ్లి చేయాలని ప్లాన్ వేస్తాడు.

Santhana Prapthirasthu  Movie Review and Rating in Telugu

ఆడవాళ్లతో మాట్లాడానికి సిగ్గుపడే చైతన్య.. కళ్యాణితో ఎలా ప్రేమలోపడ్డాడు. వారి లవ్ ట్రాక్ ఎలా సాగింది? జాక్ రెడ్డికి చైతన్యకు ఎలాంటి బంధం ఉంది? కల్యాణి పెళ్లికి తండ్రి ఎందుకు అభ్యంతరం చెప్పాడు? తండ్రి మనోభావాలకు వ్యతిరేకంగా చైతన్యను పెళ్లి చేసుకోవాలని నిర్ణయం ఎలా డిసైడ్ అయింది? చైతన్యకు సంతానపరమైన సమస్యలు తలెత్తినప్పుడు ఆయన ఏం చేశాడు? కల్యాణి, చైతన్యను తండ్రి విడగొట్టాలని ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? కల్యాణి తండ్రి కుట్రలు, ప్రయత్నాలు ఫలించాయా? చైతన్య సంతాన యోగ్యుడయ్యాడా? అనే ప్రశ్నలకు సమాధానమే సంతాన ప్రాప్తిరస్తు సినిమా కథ.

దర్శకుడు సంజీవ్ రెడ్డి రాసుకొన్న స్టోరీ పాయింట్.. నేటి తరం యువతీ, యువకులను వేధిస్తున్న సమస్య. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో ఎక్కువగా బాధపడుతున్న ఫెర్టిలిటి అనే సమస్య చుట్టూ అల్లుకొన్న సన్నివేశాలు, వాటిలో జొప్పించిన ఫన్ ఎలిమెంట్స్ నేచురల్‌గా, ఆర్గానిక్‌గా ఉన్నాయి. తాను రాసుకొన్న సీన్లలో డైలాగ్స్ వినోదాన్నిపండించాయి. వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, తరుణ్ భాస్కర్ చాలా సహజంగా నటించడమే కాకుండా పంచ్ డైలాగ్స్‌తో మెప్పించారు. ఇక ఈ సినిమాలో కూతురు కాపురంలో చిచ్చు పెట్టాలనే తండ్రి పాయింట్.. ఈ సినిమా రొటీన్ అంశంగా కనిపిస్తుంది. మురళీధర్ గౌడ్ కోసం రాసిన ట్రాక్‌ చాలా రెగ్యులర్‌గా ఉంటుంది. కాకపోతే ఫెర్టిలిటీ పాయింట్‌తో రాసుకొన్న సన్నివేశాలు బాగా పండాయి. సమాజం చర్చించుకొలేని పాయింట్‌ను చాలా క్లీన్‌గా దర్శకుడు చెప్పిన తీరును అభినందించాల్సిందే.

చైతన్యగా విక్రాంత్, కల్యాణిగా చాందినీ చౌదరీ అంచనాలకు మించి యాక్టింగ్, పెర్ఫార్మ్ చేశారు. తమ పాత్రల్లో ఓదిగిపోయి నటించారు. హీరో, హీరోయిన్ల పాత్రల మధ్య కెమిస్ట్రీ బాగా సెట్ అయింది. ఇక జాక్ రెడ్డిగా తరుణ్ భాస్కర్ మరోసారి హిలేరియస్ కామెడీని అందించారు. అభినవ్ గోమటం, వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్ తమ కామెడీ టైమింగ్‌తో మరోసారి ఆకట్టుకొన్నారు. ఈ చిత్రంలో నటించిన వారాంతా ఫర్వాలేదనిపించారు.

సాంకేతిక అంశాల వివరాల్లోకి వెళితే.. సునీల్ కశ్యప్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు ఇంకా బెటర్‌గా ఉంటే.. ఆర్గానిక్ కామెడీ మూవీకి మరింత ప్లస్ అయి ఉండేదనిపిస్తుంది. మహిరెడ్డి పండుగుల వరంగల్ వాతావరణాన్ని చక్కగా కెమెరాల బంధించాడు. సాయికృష్ణ ఎడిటింగ్ కూడా సినిమాను పరుగులు పెట్టించింది. మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి అనుసరించిన నిర్మాణ విలువలు, పాత్రల కోసం నటీనటులు ఎంపిక బాగుంది.

సంతాన వైఫల్యం, అంగస్థంభన లాంటి అంశాలను పాయింట్లుగా చేసుకొని రూపొందించిన యూత్‌ఫుల్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సంతాన ప్రాప్తిరస్తు. తండ్రి కూతురు మధ్య డ్రామా, క్యూట్ లవ్ స్టోరి, ఆర్గానిక్ కామెడీ అంశాలు ఈ సినిమాకు ప్లస్‌గా మారాయి. ఇక కథలో మురళీధర్ గౌడ్ ట్రాక్ చాలా రొటీన్, రెగ్యులర్‌గా ఉంటుంది. ఇక వెన్నెల కిషోర్, అభినవ్, తరుణ్ భాస్కర్‌ కామెడీ హాయిగా నవ్వుకొనేలా ఉంటుంది. అంచనాలు లేకుండా వెళ్తే రెండు గంటలపాటు హాయిగా నవ్వుకొని వచ్చేలా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X