మరీ అంత సంతోషం కాదు!

By Staff

Santosham
- జలపతి
చిత్రం: సంతోషం
నటీనటులు: నాగార్జున, శ్రియ, గ్రేసిసింగ్‌,
ప్రభుదేవా, కె.విశ్వనాథ్‌, చంద్రమోహన్‌ తదితరులు..
సంగీతం: ఆర్పీ పట్నాయక్‌
నిర్మాత: కె.ఎల్‌.నారయణ
కథ, మాటలు, దర్శకత్వం: దశరథ్‌

సంగీతభరిత చిత్రాలంటే...పెళ్ళి ఆల్బమ్‌ లని కొంతమంది దర్శకులకు ఒక అభిప్రాయం ఉంది. సూరజ్‌ భరజాత్య(హమ్‌ ఆప్‌ కే హై కౌన్‌) ప్రవేశపెట్టిన ఈ ట్రెండ్‌ ను కరన్‌ జోహర్‌, ఆదిత్యా చోప్రాలు మరింత పటిష్టం చేశారు. దాన్ని మన తెలుగు దర్శకులకు ఇప్పటికీ ఫాలో అవుతూనే ఉన్నారు. 'పెళ్ళి ఫంక్షన్ల' చుట్టూ కథలను, ప్రేమకథలను అల్లుకోవడం చేస్తూనే ఉన్నారు. నాగార్జున నటించిన సంతోషం కూడా ఇదే కోవలోకి వస్తుంది. కాకపోతే, కథ కాస్తా కొత్తగా ఉంది. కథనం మాత్రం పాతదే. ఈ సినిమా చూస్తున్నంత సేపు పెద్దగా బోర్‌ అయితే కొట్టదు కానీ, అన్ని సన్నివేశాలు ఇదివరకే చూసిన భావన కలిగిస్తాయి. అందువల్ల పెద్దగా ఆకట్టుకోదు కూడా. నటీనటుల నటన, 'గ్రాండ్‌' దృశ్యాల వల్ల సినిమా ఫర్వాలేదనిపిస్తుంది. ఒక్కముక్కలో చెప్పాలంటే- వినోదం ఉన్నా, కొత్తదనం లేని సాధారణ చిత్రం.

నాగార్జున ఎల్‌ అండ్‌ టి కంపెనీలో ఆర్కిటెక్ట్‌. ఒక ఐటి సెమినార్‌ కు ఊటి వస్తాడు. ఆర్కిటెక్ట్‌ కు, ఐటి సెమినార్‌ కు సంబంధం ఏమిటి అని అడగకండి. తెలుగు సినిమాల్లో అంతే. అక్కడే ఐటి కోర్స్‌ చేస్తోన్న గ్రేసిసింగ్‌ ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఆమె వెంట పడి ఎలాగోలా ఒప్పిస్తాడు. కానీ వాళ్ళ తల్లితండ్రులు వేరే సంబంధం చూసి పెళ్ళి చేసేందుకు సిద్దపడుతారు. చెల్లెలు శ్రియ బలవంతం మీద ఇంట్లో నుంచి పారిపోయి నాగార్జునను చేసుకుంటుంది. వాళ్ళిద్దరూ కలిసి న్యూజిలాండ్‌ వెళ్లి సెటిల్‌ అవుతారు. ఒక బాబు పుడుతాడు.

రెండేళ్ళ తర్వాత గ్రేసిసింగ్‌ యాక్సిడెంట్‌ లో చనిపోతుంది. మరో ఏడాది తర్వాత ...గ్రేసిసింగ్‌ బాబాయి కూతురు పెళ్ళికి నాగార్జున ఇండియా వెళుతాడు. గ్రేసిసింగ్‌ తండ్రి(కె.విశ్వనాథ్‌) మాత్రం నాగార్జునను క్షమించడు. నాగార్జున అక్కడికి వెళ్లాక, తన ప్రవర్తనతో..అందరిని ఆకట్టుకుంటాడు. ఇక శ్రియ నాగార్జునను ప్రేమించడం మొదలుపెడుతుంది. మరోవైపు ప్రభుదేవా శ్రియను ప్రేమిస్తుంటాడు. శ్రియతో పెళ్లి జరిగేలా చేస్తానని ప్రభుదేవాకు నాగార్జున మాట ఇస్తాడు. కానీ అప్పటికే శ్రియ నాగార్జునపై విపరీతంగా ప్రేమ పెంచుకుంటుంది. నాగార్జునకు ప్రొపోజ్‌ కూడా చేస్తుంది. నాగార్జున అందుకు ఒప్పుకోడు. చివరికి వీరి ఇద్దరిని ప్రభుదేవా ఎలా కలుపుతాడనేది క్లైమాక్స్‌.

నాగార్జున నటన మెచ్చుర్డ్‌ గా ఉంది. గ్రేసిసింగ్‌ పాత్ర స్వల్పం. నటన కూడా మామూలే. అందరికన్నా శ్రియ ఆకట్టుకున్నది. ఆమె అందం ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తుంది. చిన్న పాత్రైనా ప్రభుదేవా సమర్ధంగా పోషించాడు. ఆర్పీ పట్నాయక్‌ సంగీతమే ఈ చిత్రానికి పెద్ద ఎస్సెట్‌. తేజ వద్ద అసిస్టెంగ్‌ గా పనిచేసి, చిత్రం, శుభవేళ, నువ్వు-నేనుకు చిత్రాలకు రచయితగా కూడా పనిచేసిన దశరథ్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా మారాడు. దర్శకుడిగా తనకంటూ మార్క్‌ లేకుండా తీశాడు. మాటలు కూడా పేలవమే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X