Sapta Sagaralu Dhaati Side A Review హృదయాన్ని కదిలించే ప్రేమ కథ.. రక్షిత్ శెట్టి ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?
నటీనటులు: రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్, పవిత్ర లోకేష్, అచ్యుత్ కుమార్, అవినాష్ తదితరులు
దర్శకత్వం: హేమంత్ ఎం రావు
రచన: గుండూ శెట్టి, హేమంత్ ఎం రావు
నిర్మాత: రక్షిత్ శెట్టి
సినిమాటోగ్రఫి: అద్వైత గురుమూర్తి
ఎడిటింగ్: సునీల్ ఎస్ భరద్వాజ్, హేమంత్ ఎం రావు
మ్యూజిక్: చరణ్ రాజ్
బ్యానర్: పరమ్‌వా స్టూడియోస్
డిస్ట్రిబ్యూషన్: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
రిలీజ్ డేట్: 2023-09-22
సప్త సాగరాలు దాటి కథ: కారు డ్రైవర్‌గా పనిచేసే మను (రక్షిత్ శెట్టి), గాయనిగా పేరు తెచ్చుకోవాలనుకొనే ప్రియ (రుక్మిణి వసంత్) ప్రేమికులు. జీవితంలో త్వరగా స్థిరపడి పెళ్లి చేసుకోవడమే కాకుండా ఓ సొంత ఇంటిని సాకారం చేసుకోవాలనే కోరికతో తమ ప్రేమయాత్రను కొనసాగిస్తుంటారు. సముద్ర తీరంలో ఇల్లు కట్టుకోవాలనే ప్రియ కోరికకు మను అండగా ఉంటారు. ఈ క్రమంలో అనుకొని పరిస్థితిలో తన యజమాని కుటుంబాన్ని ఓ సమస్య నుంచి రక్షించేందుకు మను జైలుకు వెళ్తాడు.

సప్త సగరాలు దాటి మూవీలో ట్విస్టులు: పెళ్లికి ముందు మను ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది? జైలుకు వెళ్లిన తర్వాత మను జీవితంలో చోటు చేసుకొన్న సంఘటనలు ఏమిటి? ఆపద నుంచి తన యజమానిని గట్టెక్కించేందుకు ప్రయత్నించిన మనుకు జైలులో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? జైలుకు వెళ్లిన మను కోసం ప్రియ ఎలాంటి త్యాగాలను చేసింది? జైలు నుంచి బయటకు రప్పించడానికి ప్రియ చేసిన ప్రయత్నాలు ఫలించాయా? ప్రియ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొంటే మను రియాక్షన్ ఏమిటి? జైలు నుంచి వచ్చిన తర్వాత మనుకు ఎదురైన సంఘటనలు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే సప్త సగరాలు దాటి సైడ్ ఏ సినిమా కథ.
దర్శకుడు హేమంత్ ప్రతిభ గురించి: సప్త సగరాలు దాటి సినిమా కథను రాసుకొన్న విధానానికి దర్శకుడు హేమంత్‌కు ముందుగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. కథను హడావిడిగా కాకుండా సన్నివేశాలను చాలా నెమ్మదిగా కథ చెప్పాలనే తీరు సినిమాకు హైలెట్‌గా మారిందని చెప్పవచ్చు. ప్రతీ సన్నివేశంలో ఎమోషన్స్ దట్టించిన తీరు కథను భావోద్వేగా మార్చింది. ప్రేమ కథను జైలు బ్యాక్ డ్రాప్‌లో నడిపించిన తీరు దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది. సినిమా సైడ్ బీ (రెండో పార్టు)ను దృష్టిలో పెట్టుకొని క్యారెక్టర్లు ఎస్టాబ్లిష్ చేయడం వల్ల స్టోరీ స్లోగా సాగుతున్నదనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఎమోషన్స్ ఫుల్లుగా వర్కవుట్ కావడం వల్ల హృదయాన్ని భారంగా మార్చిన ఫీల్‌గుడ్ మూవీ చూశామనే అనుభూతి కలుగుతుంది.

రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ గురించి: రక్షిత్ శెట్టి ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. రెండు, మూడు వేరియేషన్స్ ఉన్న రోల్‌లో అద్బుతంగా ఒదిగిపోయాడు. కారు డ్రైవర్‌గా, జైలులో ఖైదీగా, ప్రేమికుడిగా, యజమాని కోసం త్యాగానికి సిద్దపడిన యువకుడిగా పలు రకాల ఎమోషన్స్‌ను పలికించాడు.సింపుల్‌గా తన క్యారెక్టర్‌ను ఎలివేట్ చేసిన విధానం.. ప్రేక్షకుల నుంచి సానుభూతిని పొందేలా నటించిన తీరు ఆకట్టుకొంటుంది. ఇక రుక్మిణి వసంత్ నేచురల్‌గా అద్బుతమైన అభినయంతో ఆకట్టుకొన్నది. భావోద్వేగాలను బాగా పండించింది. మను, ప్రియల మధ్య ఉండే కెమిస్ట్రీని ఇద్దరు బాగా వర్కవుట్ చేశారు. అచ్యుత్, పవిత్రా లోకేష్ తదితరులు తమ పాత్రలతో హుందాగా కనిపించారు.
రిచ్‌గా, క్వాలిటీగా టెక్నికల్ అంశాలు: సప్త సగరాలు దాటి సైడ్ ఏ సినిమాకు అత్యంత బలంగా నిలిచిన సాంకేతిక అంశాల్లో ముందుగా స్క్రిప్టు గురించి చెప్పుకోవాలి. క్యారెక్టర్లను డిజైన్ చేసిన విధానం.. స్క్రిప్టును తెరపైన ఆవిష్కరించిన విధానంగా గొప్పగా అనిపిస్తుంది. ఇక సౌండ్ డిజైనింగ్, మ్యూజిక్ అత్యంత బలమైన అంశాలుగా ఈ సినిమాకు కనిపిస్తాయి. సినిమాటోగ్రఫితోపాటు ప్రతీ సాంకేతిక విభాగం సినిమాను క్వాలిటీగా, రిచ్‌గా తెరమీద కనిపించేలా చేశాయి. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా రక్షిత్ శెట్టి మెప్పించాడు. సినిమా అంటే తపన, అభిరుచిని నిర్మాతగా మరోసారి రుజువు చేసుకొన్నారు.

ఫైనల్‌గా సప్త సాగరాలు దాటి: సప్త సగరాలు దాటి సైడ్ ఏ మూవీ విషయానికి వస్తే.. లవ్, రొమాన్స్, ఎమోషన్స్, నటీనటుల అద్బుతమైన ఫెర్ఫార్మెన్స్ మేలవించి రూపొందించిన భావోద్వేగమైన చిత్రం. టెక్నికల్ అంశాలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. ఒక సింపుల్ పాయింట్‌ను హృదయానికి హత్తుకొనేలా.. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు భారమైన మనసుతో వచ్చేలా చేస్తుంది. ఎలాంటి అంచనాలు పెట్టుకొని వెళ్లినా.. మంచి అనుభూతితో ఫీల్‌గుడ్ సినిమా చూశామనే తృప్తిని ఇస్తుంది. సప్త సగరాలు దాటి సైడ్ ఏ లాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి సినిమాను థియేటర్ ఎక్స్‌పీరియెన్స్‌తో ఎంజాయ చేయాలి. కాబట్టి డోంట్ మిస్ ఇట్.


Click it and Unblock the Notifications











