Sapta Sagaralu Dhaati Side B Review స్లోగా సాగే లవ్, రివేంజ్ డ్రామా.. సప్తసాగరాలు దాటి సైడ్ బీ రివ్యూ

Rating 2.75/5

నటీనటులు: రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్, చైత్ర జే ఆచార్, అచ్యుత్ కుమార్, పవిత్రా లోకేష్, శరత్ లోహితాస్వ తదితరులు
దర్శకత్వం: హేమంత్ ఎం రావు
రచన: గుండు శెట్టి, హేమంత్ ఎం రావు
నిర్మాత: రక్షిత్ శెట్టి
సినిమాటోగ్రఫి: అద్వైత గురుమూర్తి
ఎడిటింగ్: సునీల్ ఎస్ భరద్వాజ్
మ్యూజిక్: చరణ్ రాజ్
బ్యానర్: పరమ్‌వాహ్ స్టూడియోస్
డిస్ట్రిబ్యూషన్: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
రిలీజ్ డేట్: 2023-11-17

జైలు నుంచి విడుదలైన తర్వాత మను (రక్షిత్ శెట్టి) తన స్నేహితుడు ప్రకాశ్‌తో కలిసి తన ప్రేయసి ప్రియ (రుక్మిణి వసంత్) కోసం వెతుకుతుంటాడు. చివరకు దీపక్ అనే వ్యక్తిని ప్రియ పెళ్లి చేసుకొని ఒక బాబుతో కాపురం చేస్తుందని తెలుసుకొంటాడు. కానీ ప్రియ కోరుకొన్న జీవితానికి, ఆశలకు దూరంగా కటిక పేదరికంలో బతకడం జీర్ణించుకోలేకపోతాడు. ప్రియ, దీపక్ జీవితాలను మెరుగు పరుచేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో సురభి (చిత్ర జై ఆచార్)‌ మనసుకు చేరువ అవుతాడు. ఇలా తన జీవితం చుట్టూ చోటు చేసుకొన్న సమస్యలను పరిష్కరించే నేపథ్యంలో జైలులో శత్రువుగా మారిన సోము (రమేష్ ఇందిర) ఎదురు పడుతాడు.

గొప్పగా ఊహించుకొన్న ప్రియ జీవితం అధ్వాన్నంగా మారింది? ప్రియ భర్త దీపక్ అప్పుల్లో ఎందుకు కూరుకుపోయాడు? ప్రియ, దీపక్ ఎదురైన కష్టాలను మను ఎలా చక్క బెట్టాడు? సురభీతో మను భావోద్వేగమైన బంధం ఎలా సాగింది. సోముతో వైరాన్ని మను ఎలా ఎదుర్కొన్నాడు? సింగర్ కావాలనుకొన్న ప్రియ జీవితాశం నెరవేరిందా? తనకు తీరని మోసం చేసి తన జీవితాన్ని నాశనం చేసిన ప్రభు (అచ్యుత్ కుమార్)కు మను ఎలాంటి శిక్ష విధించాడు? అనే ప్రశ్నలకు సమాధానమే సప్తసాగరాలు దాటి సైడ్ బీ సినిమా కథ.

Sapta Sagaralu Dhaati Side B Review and Rating: Rakshit Shettys love and Revenage drama

ప్రియ గురించి మను వెతికే ప్రాసెస్‌లో వేశ్య సురభితో కనెక్ట్ కావడంతో సినిమా ఎమోషనల్‌గా, ఫన్‌గా కథ సాగుతుంది. అయితే కథలో డీటైలియిటీ ఎక్కువ కావడంతో సినిమా మరీ సాగదీసినట్టు అనిపిస్తుంది. సన్నివేశాలను దర్శకుడు హేమంత్ రావు బాగా రాసుకొన్నప్పటికీ.. కథను వేగంగా చెప్పలేకపోవడం మూవీకి ప్రతికూలంగా మారిందనే విషయం స్పష్టమవుతుంది. అలాగే ప్రియ జీవితాన్ని బాగు చేయాలన్న ఒక సింగిల్ పాయింట్‌తో సినిమా మొత్తాన్ని రన్ చేయడం కొన్ని చోట్ల సహనానికి పరీక్ష పెట్టినట్టు అవుతుంది. ఫస్టాఫ్ అంతా క్యారెక్టర్ల ఎస్టాబ్లిష్‌మెంట్, పాత్రల చుట్టూ వాతావరణం క్రియేట్ చేయడానికే ఎక్కువ సమయం తీసుకొన్నారనిపిస్తుంది.

ఇక సెకండాఫ్‌లో ప్రియ జీవితాన్ని చక్క బెట్టడమే లక్ష్యంగా సాగుతుంది. అలా సింగిల్ పాయింట్ సాగదీస్తూ.. మధ్యలో సోము, ప్రభు క్యారెక్టర్లను తీసుకొచ్చి రివేంజ్ డ్రామాను నడిపించే ప్రయత్నం చేయడం కొంత బెటర్‌గా యాక్షన్ మోడ్‌లోకి వెళ్తుంది. సెకండాఫ్‌లో కొన్ని ఎమోషనల్ మూమెంట్స్, హై మూమెంట్స్ ఉన్నప్పటికీ.. స్లో నరేషన్ కారణంగా ఫీల్‌గుడ్ మూమెంట్స్ తగ్గిపోయాయనే భావన కలుగుతుంది. ఎమోషనల్ పాయింట్ రెండో పార్ట్‌ను ముగించిన తీరు బాగుంది.

Sapta Sagaralu Dhaati Side B Review and Rating: Rakshit Shettys love and Revenage drama

సప్త సాగరాలు దాటి సైడ్ ఏ సినిమాలో మాదిరిగానే రక్షిత్, రుక్మిణి తమ పాత్రలతో భావోద్వేగాన్ని పండించారు. రక్షిత్ పాత్ర విషయానికి వస్తే మరిన్నీ వేరియేషన్స్ కనిపించాయి. కథలో వేరియేషన్స్ ప్రకారం రక్షిత్ చేసిన పెర్ఫార్మెన్స్ బాగుంది. అలాగే సైడ్ బీలో సురభి క్యారెక్టర్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా కనిపిస్తుంది. సురభీగా చైత్ర జే ఆచార్ చిలిపిగా, ఎమోషనల్‌గా తన పాత్రతో మెప్పించారని చెప్పవచ్చు. ఇక సోముగా రమేష్ ఇందిర, అలాగే ప్రభుగా అచ్యుత్ కుమార్ తమదైన శైలిలో ఆకట్టుకొన్నారు. మను స్నేహితుడిగా నటించిన ప్రకాశ్, అలాగే ప్రియ తమ్ముడు వినోద్ క్యారెక్టర్లలో నటించిన వారు కూడా మెప్పించారు.

ఇక టెక్నికల్ విషయాలకు వస్తే.. సైడ్ ఏ మూవీకి ఏ మాత్రం తగ్గకుండా సైడ్ బీని ఉత్తమ ప్రమాణాలతో నిలబెట్టారు. చరణ్ రాజ్ బీజీఎం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచిందని చెప్పవచ్చు. అలాగే అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫి సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ఎడిటింగ్ పరంగా సునీల్ ఎస్ భరద్వాజ్‌కు ఇంకా చాలా పని ఉంది. సినిమాను కనీసం 15 నిమిషాలు కట్ చేస్తే బెటర్ రిజల్ట్ ఉండేదనిపిస్తుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ టాప్ క్లాస్‌గా ఉన్నాయి.

Sapta Sagaralu Dhaati Side B Review and Rating: Rakshit Shettys love and Revenage drama

తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన యువతి జీవితం కోసం తపన పడే ప్రియుడి పాయింట్ ఓవైపు.. అనుకోకుండా భగ్న ప్రేమికుడి జీవితంలోకి మరో అమ్మాయి వస్తే ఎలాంటి డ్రామా కొనసాగుతుందనే కోణంలో ట్రయాంగిల్ లవ్ స్టోరిగానే కాకుండా ఎమోషనల్ డ్రామాగా సప్త సాగరాలు దాటి సైడ్ బీ రూపొందింది. లవ్, ఎమోషన్స్, ఫన్, రివేంజ్ అంశాలతో రూపొందిన ఈ సినిమా రైటింగ్ బాగుంది. కానీ స్లో నరేషన్, సాగదీత సినిమాకు మైనస్‌గా మారిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో డైలాగ్స్, ఎమోషనల్ సీన్లు, యాక్టర్ల ఫెర్ఫార్మెన్స్, డైరెక్టర్ హేమంత్ రావు టేకింగ్ సినిమాను చూసేలా చేస్తుంది. లవ్, ఎమోషనల్, స్లోగా సాగినా.. ఫీల్ గుడ్ కంటెంట్‌ను ఇష్టపడేవారికి, యూత్‌కు కనెక్ట్ అవుతుంది. ఓ సారి ఈ సినిమాను థియేటర్‌లో చూడటానికి కొన్ని అంశాలు ఉన్నాయి. కాబట్టి ఓటీటీ కోసం వేచి చూడకుండా కొంత ఓపిక తెచ్చుకొని థియేటర్ ఎక్స్ పీరియెన్స్ ఫీల్ అవ్వండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X