For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సప్తగిరి LLB మూవీ రివ్యూ: సప్తగిరి హీరోగా ఇరుగదీశాడు..

  By Rajababu
  |

  Rating:
  2.5/5
  Star Cast: సప్తగిరి, కశిష్ వోరా, సాయికుమార్, శివప్రసాద్, శకలక శంకర్
  Director: చరన్ లక్కాకుల

  Saptagiri LLB Public Talk సప్తగిరి LLB మూవీ పబ్లిక్ టాక్

  బొమ్మరిల్లు చిత్రంతో కమెడియన్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి యాక్టర్ సప్తగిరి అనతికాలంలోనే జూనియర్ బ్రహ్మానందంగా పేరు తెచ్చుకొన్నాడు. ఆ తర్వాత ఎక్స్‌ప్రెస్ స్పీడ్‌తో వరుస చిత్రాలు చేస్తూ తనదైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకొన్నాడు. జీవితంలో స్థితిగతుల్లో మార్పు ఉండాలనే లక్ష్యంతో సప్తగిరి ఎక్స్‌ప్రెస్ చిత్రంతో హీరోగా మారాడు. విజయాన్ని అందుకొని హీరోగా మంచి పేరు సంపాదించుకొన్నాడు. అలా కమెడియన్‌గా కొనసాగుతూనే హీరోగా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొంటున్నాడు.

  ఇలాంటి పరిస్థితుల్లోనే మరోసారి సప్తగిరి హీరోగా వస్తున్న చిత్రం సప్తగిరి LLB. హిందీలో ఘనవిజయం సాధించిన జాలీ LLB చిత్రానికి ఇది రీమేక్. డాక్టర్ రవి కిరణ్ నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకొన్న ఈ చిత్రానికి విజయ్ బుల్గానియన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇంకా ఈ చిత్రంలో కశిష్ వోరా హీరోయిన్‌గా, సీనియర్ నటులు సాయికుమార్, శివప్రసాద్ తదితరులు ఇతర పాత్రలో నటించారు. డిసెంబర్ 7వ తేదీన రిలీజ్ అవుతున్న చిత్రం ఎలా ఉంది? సప్తగిరికి మరో విజయాన్ని అందించిందా? అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సింది.

   సప్తగిరి LLB కథ

  సప్తగిరి LLB కథ

  చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన సప్తగిరి (సప్తగిరి) న్యాయశాస్త్రం విద్యలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేస్తాడు. గ్రామంలో చోటుచేసుకొన్న ఓ సంఘటనలో తన ప్రతిభను ఉపయోగించి పరిష్కారం చూపుతాడు. జిల్లా కోర్టులో సరైన కేసులు దొరకపోవడంతో తన మరదలు (కశీష్ వోరా)ను ఇచ్చి పెళ్లి చేయడానికి మామ నిరాకరిస్తాడు. ఎలాగైనా పేరు ప్రతిష్ఠలు సంపాదించడమే కాకుండా మరదలి పెళ్లి చేసుకోవడానికైనా కేసులు గెలువాలని అనుకొంటారు. ఆ క్రమంలో హైదరాబాద్‌ హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభిస్తాడు. ఐదుగురి మరణానికి కారణమైన హిట్ రన్‌ కేసులో ఏకంగా టాప్ లాయర్ రాజ్‌పాల్‌ (సాయికుమార్)నే ఢీకొంటాడు. కేసు విచారణ సందర్భంగా ఊహించని అంశాలు తెరపైకి వస్తాయి.

   కథలో కీలక మలుపులు

  కథలో కీలక మలుపులు

  కారు ప్రమాదంలో ఫుట్‌పాత్‌పైన మరణించింది బిక్షగాళ్లు కాదు రైతులు అనే తెలియడంతో కోర్టు విచారణ కొత్త మలుపు తిరుగుతుంది. పోలీసులు, రాజ్‌పాల్ కుమ్మక్కై ముద్దాయిని కేసు నుంచి తప్పించడానికి ప్లాన్ చేస్తారు. రాజ్‌పాల్‌, పోలీసుల దాడులను సప్తగిరి ఎలా ఎదురించాడు? కారు ప్రమాదంలో రైతులు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? పోలీసులకు సప్తగిరి ఎలా బుద్ది చెప్పాడు? కేసును గెలిచి రాజ్‌పాల్ గర్వాన్ని సప్తగిరి ఎలా అణిచాడు అనే ప్రశ్నలకు సమాధానమే సప్తగిరి LLB కథ.

   సప్తగిరి LLB విశ్లేషణ

  సప్తగిరి LLB విశ్లేషణ

  హిందీలో హిట్టైన జాలీ ఎల్‌ఎల్‌బీ కథను ఎంచుకోవడమే విజయానికి తొలిమెట్టు అనవచ్చు. సప్తగిరి బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా కథలో మార్పులు చేసి.. జాగ్రత్తగా కమర్షియల్ హంగులను అద్దారు. అన్నివర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తొలిభాగంలో కామెడీ, ఫైట్లు, పాటలతో సరదాగా సాగింది. అనామకుడైన ఓ లాయర్‌ను న్యాయశాస్త్రంలో దిగ్గజంగా పేరొందిన మరో లాయర్‌ను ఎదురించే ప్రాసెస్‌ను దర్శకుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయడంతో తొలిభాగం పాజిటివ్‌గా మారింది.

  సప్తగిరి LLB స్క్రిప్ట్ అనాలిసిస్

  సప్తగిరి LLB స్క్రిప్ట్ అనాలిసిస్

  సప్తగిరి ఎల్ఎల్‌బీకి సంబంధించిన అసలు సరకంతా రెండో భాగంలోనే ఉండటంతో సెకండాఫ్‌పై ప్రేక్షకులకు ఆసక్తి కలుగుతుంది. అనుకొన్నట్టుగానే రెండో భాగంలో అనేక భావోద్వేగాలతో సినిమా రక్తికడుతుంది. దానికి తోడు సప్తగిరి ఫెర్ఫార్మెన్స్ అదిరిపోవడంతో సినిమా మరోస్థాయికి వెళ్తుంది. సాయికుమార్, జడ్జి శివప్రసాద్ (ఎంపీ శివప్రసాద్) మధ్య జరిగే ట్రాయాంగిల్ డ్రామా ప్రేక్షకుడిని సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది. రైతు పాత్రలో కనిపించిన ఎల్బీ శ్రీరాం చేత చెప్పించిన డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. రైతులకు సంబంధించి చక్కటి సందేశం, ఎమోషనల్ క్లైమాక్స్‌తో సినిమాకు తెరపడుతుంది.

   సప్తగిరి LLB డైరెక్షన్ గురించి

  సప్తగిరి LLB డైరెక్షన్ గురించి

  ఎన్నో ఏళ్లుగా దర్శకత్వ విభాగంలో సేవలందిస్తున్న చరన్ లక్కాకుల ఈ సినిమాకు దర్శకుడు. కథలో ఉండే ఎమోషనల్ టచ్ దర్శకుడి భారాన్ని సగానికి తగ్గించింది. ఇక సప్తగిరికి తగినట్టుగా, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా అల్లుకొన్న సీన్లు తెరపైనా బాగా పండాయి. పాటలు మధ్యలో దూరినట్టు కనిపించినా అంతగా ఇబ్బంది పెట్టేలా లేవు. తెలుగు ప్రేక్షకుల అభిరుచి అనుగుణంగా రాసుకొన్న డైలాగ్స్ మెప్పించడమే కాదు ఉద్వేగానికి గురిచేస్తాయి. ఓవరాల్‌గా మొదటి సినిమాతోనే సక్సెస్ సొంతం చేసుకోవడం చరన్‌కు కలిసి వచ్చే అంశం.

   సప్తగిరి ఎలా చేశాడంటే

  సప్తగిరి ఎలా చేశాడంటే

  కమెడియన్‌గా సప్తగిరి ఏన్నో వేరియషన్స్ పలికిస్తాడనేది అందరికి తెలిసిందే. కామెడీ టచ్‌ను వదులుకోకుండానే భావోద్వేగ అంశాలు కలిసి ఉన్న లాయర్ పాత్రలో సప్తగిరి అదరగొట్టేశాడు. సినిమా భారాన్ని సొంత భుజాలపైనే మోసే బాధ్యతను వేసుకొని విజయాన్ని సాధించాడు. సెకండాఫ్‌లో సాయికుమార్‌, శివప్రసాద్‌ ధీటుగా సప్తగిరి తనదైన నటనతో ఆకట్టుకొన్నారు. సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌తో హిట్‌ను సొంతం చేసుకొన్న సప్తగిరి ఖాతాలో సప్తగిరి ఎల్‌ఎల్‌బీ రూపంలో సక్సెస్ చేరడం ఖాయమే. సప్తగిరి కేవలం కమెడియన్ కాదు.. స్క్రిప్ట్‌లో సత్తా ఉంటే మంచి హీరో కూడా అని సప్తగిరి ఎల్‌ఎల్‌బీ‌తో ప్రూవ్ చేసుకొన్నాడు. పాటల్లో డాన్యులు, ఫైట్లును కూడా ఇరుగదీశాడు. ఎక్కడ అతిగా అనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవడం సప్తగిరికి కలిసి వచ్చే అంశం.

   హీరోయిన్ కశిష్ ఓరా గురించి

  హీరోయిన్ కశిష్ ఓరా గురించి

  సప్తగిరి ఎల్‌ఎల్‌బీ స్క్రిప్టులో పెద్దగా స్కోప్ లేని పాత్రలో హీరోయిన్‌గా కశిష్ వోరా నటించింది. కేవలం గ్లామర్, ఆట పాటలకే పరిమితమైంది. తొలి సినిమా అయినప్పటికీ కశిష్ వోరాలో ఎక్కడ తడబాటు కనిపించదు. పాత్రలో దమ్ము లేదు కాబట్టి ఆమెలో మైనస్‌లు వెతకడం భావ్యం కాదు. కథలో భాగమైంది.. ఫర్వాలేదు అనే రేంజ్‌లో కశిష్ మెప్పించింది.

   సాయికుమార్, శివప్రసాద్ నటన

  సాయికుమార్, శివప్రసాద్ నటన

  సప్తగిరి ఎల్‌ఎల్‌బీ కథలో సప్తగిరి ఒక్కడే హీరో కాదు. మరో ఇద్దరు హీరోలు కూడా ఉంటారు. వారే సాయికుమార్, నటుడు, నిర్మాత శివప్రసాద్. సాయికుమార్ నటన, డైలాగ్స్ డెలివరీ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అవకాశం దొరికిందా పాత్రను అమాంతం తినేస్తాడు. ఈ చిత్రంలో కూడా సాయికుమార్ ఆ పనే చేశాడు. కీలక సన్నివేశాల్లో.. ప్రధానంగా సాయికుమార్ తన నటనతో చిత్రాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాడు. శివ ప్రసాద్ జడ్జీ పాత్రలో కనిపించాడు. హిందీలో సౌరభ్ శుక్లా చేసిన పాత్రకు సమానంగా తన హావభావాలను పలికించాడు. శివ ప్రసాద్ తప్ప మరొకరిని ఊహించుకోలేమని చెప్పిన ఆశ్చర్యపోనక్కర్లేదు.

  బుల్గానియన్ సంగీతం

  బుల్గానియన్ సంగీతం

  సప్తగిరి ఎల్‌ఎల్‌బీ చిత్రానికి విజయ్ బుల్గానియన్ సంగీతం అందించారు. ఒకట్రెండు పాటలు బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో కొన్ని సన్నివేశాల్లో ఫ్లాట్‌గా రొడ్డ కొట్టుడు కనిపించింది. ఎమోషనల్ సీన్లలో మరింత మెరుగైన సంగీతాన్ని అందించడానికి అవకాశం ఉందనిపించింది. కథలో ఉండే సత్తా మాటున బుల్గానియన్ లోపాలు పెద్దగా కనిపించలేదు.

   సారంగం సినిమాటోగ్రఫీ

  సారంగం సినిమాటోగ్రఫీ

  కథలో ఉండే భావోద్వేగాలను సరైన రీతిలో సినిమాటోగ్రాఫర్ సారంగం ఎస్ఆర్ తెరకెక్కించారు. స్టోరి అంతా కోర్టు డ్రామా కాబట్టి తన నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి వీలుకలిగింది. స్విటర్జాండ్, స్థానికంగా షూట్ చేసిన ప్రాంతాలను రిచ్‌గా తెరక్కించారు. క్వాలిటీని కూడా మెయింటెన్ చేశాడు. పాటల చిత్రీకరణ ఆకట్టుకునేలా ఉంది.

   ఎడిటింగ్, ఇతర విభాగాలు

  ఎడిటింగ్, ఇతర విభాగాలు

  ప్రముఖ ఎడిటర్ గౌతం రాజు ఈ చిత్రానికి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. కమర్షియల్ హంగుల కోసం చేసిన సీన్లలో కొంత లెంగ్త్ తగ్గించే అవకాశం ఉంది. పోలీసులను బాడీగార్డు కొట్టే సీన్లు, ఇతర సన్నివేశాల నిడివిపై కత్తెర వేయడానికి స్కోప్ ఉంది. ఓవరాల్‌గా గౌతంరాజు తన బాధ్యతలను సమర్ధంగా పోషించారు. ఇక సినిమాలో ఫైట్స్ విషయానికి వస్తే సప్తగిరి రేంజ్‌ను దృష్టిలో పెట్టుకొని కథ డిమాండ్ మేరకు యాక్షన్ సీన్ల బ్యాలెన్స్‌గా కంపోజ్ చేశారనే ఫీలింగ్ కలుగుతుంది.

   ఫైనల్

  ఫైనల్

  న్యాయ, పోలీసు వ్యవస్థలో ఉండే లోపాలపై ఎక్కుపెట్టిన సినీ విమర్శనాస్త్రం సప్తగిరి ఎల్‌ఎల్‌బీ. ఈ కథలో ఉండే భావోద్వేగం, రైతుల అంశం ప్రేక్షకుడిని కదిలిస్తుంది. సప్తగిరిని ఓ పరిణితి చెందిన నటుడనే విషయాన్ని చెప్పడానికి ఈ కథ బాగా ఉపయోగపడింది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే.. కామెడీ, ఎమోషనల్, మసాల అంశాలు కలిపిన చిత్రంగా సప్తగిరి ఎల్‌ఎల్‌బీ ఫుల్ మీల్స్ అనిపిస్తుంది.

   ప్రొడక్షన్ వ్యాల్యూస్

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌కు నిర్మాతగా వ్యవహరించిన డాక్టర్ రవికిరణ్ సప్తగిరి ఎల్‌ఎల్‌బీ చిత్రానికి కూడా ప్రొడ్యూసర్. స్టోరి డిమాండ్ మేరకు చాలా లావీష్‌గా సినిమాను తెరకెక్కించారు. స్విటర్లాండ్‌లో పాటలైనా, ఇతర సాంకేతిక విభాగాల విషయంలో కూడా ఖర్చుకు వెనుకాడలేదనే విషయం కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగా ఉన్నాయి. నిర్మాతగానే కాకుండా సప్తగిరి బావ క్యారెక్టర్‌లో రవికిరణ్ మెరిసాడు. కీలక సన్నివేశాల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకొన్నాడు.

   తెర వెనుక, తెర ముందు

  తెర వెనుక, తెర ముందు

  నటీనటులు: సప్తగిరి, కశిష్ వోరా, సాయికుమార్, శివప్రసాద్, శకలక శంకర్ తదితరులు
  నిర్మాత: డాక్టర్ రవికుమార్
  దర్శకత్వం: చరన్ లక్కాకుల
  సంగీతం: విజయ్ బుల్గానియన్
  సినిమాటోగ్రఫీ: సారంగం ఎస్ఆర్
  ఎడిటింగ్: గౌతమ్ రాజు
  మాటలు: పరుచూరి బ్రదర్స్

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  కథ, కథనం
  సప్తగిరి పెర్ఫార్మెన్స్
  సాయికుమార్, శివప్రసాద్ యాక్టింగ్

  మైనస్ పాయింట్లు
  తొలిభాగంలో కొన్ని సీన్లు

  English summary
  Comedian Saptagiri becomes as hero with Saptagiri Express movie.His latest movie is Saptagiri LLB. Its remake of the Hindi hit Jolly LLB. Saptagiri plays the titular role in the movie. Kashish Vora is the heroine, Sai Kumar, Shivaprasad Reddy played lead roles. This movie set to release on December 7th. In this occassion, Telugu Filmibeat is bringing exclusive review for the our own readers.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X