twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guduputani movie review సప్తగిరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?

    |

    Rating:
    2.5/5

    నటీనటులు: సప్తగిరి, నేహా సోలంకి, రఘు కుంచె తదితరులు

    దర్శకత్వం: కే ఎం కుమార్
    నిర్మాతలు: పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్
    సినిమాటోగ్రఫి: పవన్ చెన్న
    ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి
    మ్యూజిక్: ప్రతాప్ విద్య
    ఫైట్స్: సోలిన్ మల్లేష్
    స్టిల్స్: ఎమ్ఎమ్.రెడ్డి
    బ్యానర్:ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్
    రిలీజ్ డేట్: 2021-12-25

    గిరి (సప్తగిరి), సిరి (నేహా సోలంకి) పీకల్లోతు ప్రేమలో ఉంటారు. పెద్దలు తమ ప్రేమను అంగీకరించకపోవడంతో వారిని ఎదురించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొంటారు. ఎవరికి చెప్పకుండా ఊరికి దూరంగా పారిపోయి దట్టమైన అడవి ప్రాంతంలోని ఓ పురాతన ఆలయంలో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతారు. అయితే ప్రేమించుకోవడానికి ముహుర్తం అక్కర్లేదు.. కానీ పెళ్లికి ముహుర్తం అవసరమని చెప్పి పురోహితుడు వారి పెళ్లిని వాయిదా వేస్తారు. అనుకోకుండా ఆ పురాతన ఆలయానికి తాళం వేయడంతో గిరి, సిరి అందులో చిక్కుకుపోతారు. ఇలాంటి పరిస్థితిలో అమ్మవారి నగలను దోచుకోవడానికి ఓ ఊరి పెద్ద (రఘు కుంచె) తన అనుచరులతో గుడిలోకి వస్తాడు. నగలు దోచుకొని వెళ్తుండగా తన కంటికి కనిపించిన సిరిని రేప్ చేసి చంపడానికి ప్రయత్నిస్తాడు.

    గూడుపుఠాణి చిత్రంలో గిరి, సిరి ప్రేమ కథ ఏంటి? వారి పెళ్లిని పురోహితుడు ఎందుకు వాయిదా వేస్తాడు. ఆలయాల దోపిడి సమయంలో ఊరి పెద్ద అరాచకాలు ఏమిటి? తన చేతికి చిక్కిన సిరిని ఊరి పెద్ద, అతడి అనుచరులు ఏం చేశారు? తన ప్రియురాలిని దక్కించుకోవడానికి గిరి ఏం చేశాడు. ఊరి పెద్ద దురాగతాలకు ఎవరు ముగింపు పలికారు? సిరి, గిరి ప్రేమ కథకు ముగింపు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే గూడుపుఠాణి సినిమా.

     Saptagiris Guduputani movie review and Rating

    గూడుపుఠాణి సినిమాకు సప్తగిరి కామెడీ, నేహా సోలంకి గ్లామర్ ఓ బలం అయితే ఊరి పెద్దగా గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె విలనిజం ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు. ఎమోషనల్, లవ్ అంశాలతో కథను థ్రిల్లర్‌గా దర్శకుడు మలిచిన తీరు బాగుంది. దర్శకుడు కే ఎం కుమార్ కొత్తవాడైనప్పటికీ స్క్రిప్టుపై కమాండ్ కనిపించింది. ఒకే ఒక లొకేషన్‌లో కథను నడిపించిన విధానం ఆకట్టుకొనేలా ఉంటుంది. కథ, కథనాలపై ఇంకాస్త దృష్టిపెట్టి ఉంటే గూడుపుఠాణి సినిమాకు మరింత జస్టిఫికేషన్ లభించి ఉండేది.

    కమెడియన్‌గా సప్తగిరి ఎప్పటి మాదిరిగానే తన మార్కు నటనతో ఆకట్టుకొన్నారు. పాటలు, డ్యాన్సుల, కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు. ఇక 90 ml ఫేమ్ నేహా సొలంకి కి సినిమాలో కీలకమైన పాత్రే లభించింది. కథలో భాగమై సాగే పాత్రను చాలా ఈజ్‌తో చేసింది. గ్లామర్‌పరంగా కూడా మెప్పించింది. పలాస చిత్రం తర్వాత మరోసారి పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో రఘు కుంచె కనిపించారు. పక్కాగా విలనిజాన్ని పండించి ప్రేక్షకులను ఆకట్టుకొంటాడు. ఆరంభంలో వచ్చే కొన్ని సీన్లలో విలన్‌గా బీభత్సాన్ని తన పాత్రలో పండించాడు. మిగితా నటీనటులు పర్వాలేదనిపించారు.

    ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. పవన్ చెన్న అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. నైట్ ఎఫెక్ట్ షాట్స్ కొత్తగా ఉన్నాయి. ప్రతాప్ విద్య అందించిన సంగీతం బాగుంది. నీలి నింగి తాకాలనే పాట ఫీల్‌గుడ్‌గా ఉంది. ఈ పాటను పవన్ చెన్న చిత్రీకరించిన విధానం తెర మీద మరింత ఆకర్షణగా మారింది. పలు సన్నివేశాలకు రీరికార్డింగ్ బలంగా మారింది. ఎడిటర్‌గా బొంతల నాగేశ్వర్ రెడ్డి తన కత్తెరకు పదును చూపించాడు. సోలిన్ మల్లేష్ అందించిన ఫైట్స్ కూడా ఉన్నాయి. ప్రొడక్షన్ వ్యాలూస్ పుష్కలంగా ఉన్నాయి. పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ రాజీ పడకుండా సినిమాను తెరకెక్కించారు. ఊటీలోని సుందరమైన ప్రదేశాలో చిత్రీకరించడం సినిమాకు మరింత పాజిటివ్‌గా మారింది.

    థ్రిల్లింగ్ ఎలిమింట్స్‌తో సాగే ప్రేమ కథా చిత్రం గూడుపుఠాణి. సప్తగిరి, నేహా సోలంకి, రఘు కుంచె ఫెర్ఫార్మెన్స్ సినిమాకు బలంగా మారాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే మంచి వినోదంతోపాటు థ్రిల్లింగ్ కూడిన అనుభూతి కలుగుతుంది. సప్తగిరి ఫ్యాన్స్‌కు పైసా వసూల్ చిత్రం.

    English summary
    Guduputani movie review: Saptagiri's Latest picture is Guduputani. Neha Solanki is the Heroine. Kumar is director. P Srinivas Reddy, Katani Ramesh is the producer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X