twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్లో..స్లో కథ... సూపర్ స్పీడ్ కామెడీ : సప్తగిరి ఎక్స్ ప్రెస్ రివ్యూ రేటింగ్

    ఇప్పుడు స‌ప్త‌గిరి కూడా హీరో అయ్యాడు. స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్ అంటూ ఏకంగా త‌న పేరుతోనే ఓ సినిమా చేశాడు. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది?

    |

    Rating:
    2.5/5
    Star Cast: సప్తగిరి, రోషిణి ప్రకాశ్, పోసాని కృష్ణమురళి, షకలక శంకర్, షియాజీ షిండే
    Director: అరుణ్ పవార్

    ఇప్పుడు స‌ప్త‌గిరి కూడా హీరో అయ్యాడు. స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్ అంటూ ఏకంగా త‌న పేరుతోనే ఓ సినిమా చేశాడు. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది? పేరులో ఉన్న స్పీడు సినిమాలో ఉందా? లేదా? శ్రీ సాయి సెల్యులాయిడ్ పతాకం పై మాస్టర్ హోమియోపతి అధినేత డాక్టర్ రవి కిరణ్ నిర్మించిన సినిమా 'సప్తగిరి ఎక్స్ ప్రెస్'. టాలీవుడ్ స్టార్ కమెడీయన్ సప్తగిరి ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు తెరకు కమెడియన్ 'సప్తగిరి'' ఇక కథానాయకుడు ..

    గతంలో అలీ హీరో గా నటించిన యమలీల సూపర్ డూపర్ హిట్ అయింది. తర్వాత హీరోగా వచ్చిన చిత్రాలు పెద్దగా ఆడలేదు. మరోపక్క బ్రహ్మానందం కూడా హీరోగా బాబాయ్ హోటల్ లో నటించాడు. అది బాక్సాపీస్ వద్ద తన్నేసింది., కమెడియన్ నుంచి హీరో అయ్యి ఇంకా నిలదొక్కుకునే ప్రయత్నాల్లోనే ఉన్నాడు సునీల్... ఓ పక్క ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి.. పరవాలేదనిపించుకున్నాడు, మొన్ననే శ్రీనివాస రెడ్డి కూడా "జయమ్ము నిశ్చయమ్మురా" అంటూ ఒక జయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు... ఇక ఇప్పుడు సప్తగిరివంతు... మరి ఇప్పుడు సప్తగిరి వంతు వచ్చి మరి సప్తగిరి సక్సెస్ అయినట్టేనా... ముందు రాబోయే సినిమాల పై సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఏమైనా ప్రభావం చూపూతుందా అంటే.....

    నిజాయతీగల కానిస్టేబుల్ కొడుకు:

    నిజాయతీగల కానిస్టేబుల్ కొడుకు:


    కథ: శివ ప్రసాద్ (శివ ప్రసాద్) ఓ నిజాయతీగల కానిస్టేబుల్ కొడుకు సప్తగిరి (సప్తగిరి)ని మాత్రం ఐఏఎస్ చేయాలనుకొంటాడు. కానీ సప్తగిరికి సినిమాలూ, నాటకాలంటే పిచ్చి. సినిమా నటుడవ్వాలని కలలు కంటుంటాడు. తన కాలనీకి కొత్తగా వచ్చిన పూర్ణిమ (రోషిణి ప్రకాష్) వెంట పడుతుంటాడు.

     తండ్రి మ‌ర‌ణం :

    తండ్రి మ‌ర‌ణం :


    అయితే ఓ ఎన్కౌంటర్లో శివప్రసాద్ ని దారుణంగా చంపేస్తారు. తండ్రి ఆశ‌యం కోసం త‌న‌కు ఇష్టం లేక‌పోయినా కానిస్టేబుల్‌గా మారాల్సివ‌స్తుంది. త‌న తండ్రి మ‌ర‌ణం వెనుక డిపార్ట్‌మెంట్‌లోని కొంత‌మంది (పోసాని, అజ‌య్‌ఘోష్‌) కుట్ర ఉంద‌ని తెలుసుకొని.. ప్ర‌తీకారం తీర్చుకోవాల‌నుకొంటాడు. తన తండ్రి మరణం వెనుక మనుషులున్నారన్న సంగతి తెలుసుకొన్న సప్తగిరి ఏం చేశాడు? ప్రతీకారం ఎలా తీర్చుకొన్నాడు? అనేదే 'సప్తగిరి ఎక్స్ప్రెస్' కథ.

     తిరుడన్‌ పోలీస్‌:

    తిరుడన్‌ పోలీస్‌:


    .తమిళంలో వచ్చిన ‘తిరుడన్‌ పోలీస్‌'కి రీమేక్‌ గా వచ్చిన సప్తగిరి ఎక్స్ ప్రెస్ చాలా మార్పులు చేసి వదిలారు. అల్లరి చిల్లరగా తిరిగే ఓ కుర్రాడు, తన తండ్రి మరణానికి ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడన్నదే కథ ని కామెడీతో మిక్స్ చేసి వదిలారు. మామూలుగా అయితే భారీ యాక్షన్ సినిమాగా మారాల్సిన కథని కామెడీతో కలిపి కడుపుబ్బా నవ్వించారు.

     సింగిల్‌ టేక్‌లో :

    సింగిల్‌ టేక్‌లో :


    యాక్షన్ కథకి మాస్ హీరో అయితే ఓకే గానీ ఇక్కడున్నది సప్తగిరి కావడంతో ఈ ఫార్ములా కాస్త కామెడీ బాట పట్టింది. సప్తగిరి ‘సినిమా పిచ్చి'తో నడిచిన ప్రారంభ సన్నివేశాలు నవ్విస్తాయి. కాలనీలో ప్రేమకథ కూడా ఓకే అనిపిస్తుంది. మరో వైపు తండ్రీ-కొడుకుల మధ్య భావోద్వేగ సన్నివేశాలు వస్తుంటాయి. సింగిల్‌ టేక్‌లో దానవీర శూరకర్ణ డైలాగ్‌ చెప్పడం ఆకట్టుకొంటుంది.

     సప్తగిరి కోసం కామెడీగా :

    సప్తగిరి కోసం కామెడీగా :


    కానిస్టేబుల్‌ అయిన తర్వాత సప్తగిరి పడే కష్టాలు, తండ్రిని గుర్తు చేసుకొంటూ ఎమోషన్‌కి గురైన సందర్భాలు ఆకట్టుకొనేవే. పతాక సన్నివేశాలు కూడా నచ్చుతాయి. కానీ.. రివేంజ్‌ డ్రామా మాత్రం అతకలేదు. దాన్ని మరీ కామెడీ చేశారు. అంతర్లీనంగా ఓ సీరియస్‌ విషయం ఉన్నా.. దాన్ని సప్తగిరి కోసం కామెడీగా మార్చేయడంతో కథలో సీరియస్‌నెస్‌ తగ్గింది.

     ఓవర్ యక్షన్ చేయించకుండా:

    ఓవర్ యక్షన్ చేయించకుండా:


    మాంచి మాస్ కథని పూర్తిగా మార్చేసి కేవలం కామెడీకోసమే ఈ కథ అన్నట్టు చూపించటం లో దర్శకుడు సక్సెస్ అయినట్టే. అందులోనూ సప్తగిరి లాంటి హీరో ఎలా చేస్తే వర్కౌట్ అవుతుందో అంతవరకే అతన్ని వాడుకున్నడు. పగా, ప్రతీకారం అనగానే కనిపించే భారీ ఫైట్లూ, పంచ్ డైలాగులూ లేకుందా మొత్తానికి సప్తగిరితో ఓవర్ యక్షన్ చేయించకుండా అతన్ని ఫ్రీగా వదిలేసాడు.

     ఈ సినిమాకి హైలెట్ :

    ఈ సినిమాకి హైలెట్ :


    బ‌య‌ట సినిమాల్లో స‌ప్త‌గిరి ఎలా న‌వ్వించాడో, ఇక్క‌డా అలానే న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు. పాట‌లు, ఫైటులు చేసినా అవీ కామెడీగానే సాగాయి. స‌ప్త‌గిరి న‌ట‌న‌పై పిచ్చి చూపించే సీన్లు, కాలేజీలో గోల్డు మెడ‌ల్ కోసం వేసిన వేషాలు న‌వ్విస్తాయి. త‌న న‌ట‌నా ప్ర‌తిభ చూపించ‌డానికి త‌ల్లిదండ్రుల్ని కూర్చోబెట్టి వేసిన ఏక పాత్రాభిన‌యం ఈ సినిమాకి హైలెట్ అయ్యింది. తండ్రి మ‌ర‌ణం.. దాన్నుంచి పుట్టుకొచ్చిన ఎమోష‌న్ ఈ సినిమాని ఫ్యామిలీ ప్రేక్ష‌కుల‌కూ ద‌గ్గ‌ర చేస్తుంది.

     కొత్త‌గా ఏం లేక‌పోవ‌డంతో:

    కొత్త‌గా ఏం లేక‌పోవ‌డంతో:


    స‌ప్త‌గిరి పోలీస్ అయ్యాక‌.. క‌థ మ‌రింత ర‌క్తి క‌ట్టాల్సింది. అయితే.. రివైంజ్ డ్రామాలో కొత్త‌గా ఏం లేక‌పోవ‌డంతో, అవి సిల్లీ ట్రిక్కుల‌తో లాగించేయ‌డంతో సెకండాఫ్ ట్రాక్ త‌ప్పింది. కాల్ మ‌నీ, చైన్ స్నాచింగ్ లాంటివి పైపైనే చూపించి వ‌దిలేశారు. విలన్ అసలు ఉన్నాడాలేదా అన్నంత పేలవమైన విలనిజం ఈ సినిమాకి ప్ర‌ధాన లోపం. అంతే కాదు తరువాత వచ్చే సీన్ మాత్రమే కాదు ఇంకో మూడు సీన్ల తర్వాత ఏం వస్తుందో కూడా చాలా ఈజీగా అర్థ‌మైపోతుంటుంది.

     ష‌క‌ల‌క శంక‌ర్ :

    ష‌క‌ల‌క శంక‌ర్ :


    చెప్పాలంటే సినిమా అంతా స‌ప్త‌గిరి వ‌న్ మ్యాన్ షో..అనే చెప్పుకోవాలి న‌వ్వించాడు..ఎమోష‌న్ పండించాడు. ఆ మాట‌కొస్తే.. కామెడీ సీన్ల‌లో కంటే ఎమోష‌న్ సీన్ల‌లోనే స‌ప్త‌గిరి న‌ట‌న బాగుంది. ష‌క‌ల‌క శంక‌ర్ స‌పోర్టింగ్ రోల్‌ని ర‌క్తి క‌ట్టించాడు. పోసానిది అల‌వాటైన పాత్రే ఈ తరహా పాత్రల్లో పోసాని బాగా ఇమిడి పొతాడు.

     హీరోయిన్ సంగతికొస్తే:

    హీరోయిన్ సంగతికొస్తే:


    అజ‌య్ ఘోష్‌ కి కూడా ఈ తరహా పాత్రలు అలవాటే కాబట్టి తన రోల్ ని బాగానే చేసాడు. శివ ప్ర‌సాద్ తండ్రి పాత్ర‌లో ఇమిడిపోయాడు. స‌ప్త‌గిరి - శివ ప్ర‌సాద్‌ల కాంబోలో వ‌చ్చిన ఎమోష‌న్ సీన్స్ ఆక‌ట్టుకొంటాయి. ఇక హీరోయిన్ సంగతికొస్తే... ఆ..! సినిమా అన్నాక హీరోయిన్ లేకుంటే ఏం బావుంటుందీ అనుకొని పెట్టినట్టుగా ఉంది. హీరోయిన్ పాత్రని కేవలం నామ్ కే వాస్తే ఉందా అంటే ఉందీ అన్నట్టు చేసారు.

     పంచ్‌లు పేలాయి :

    పంచ్‌లు పేలాయి :

    చిన్న సినిమా అయినా క్వాలిటీ విషయంలో రాజీ పడలేదు నిర్మాత. అందుకే ప్రతీ సీన్‌ రిచ్‌గా కనిపిస్తుంది. ఓ మాస్‌ హీరోకి తగిన పాటలిచ్చాడు సంగీత దర్శకుడు. మాటలు అక్కడక్కడ ఆకట్టుకొంటాయి. కొన్ని పంచ్‌లు పేలాయి కూడా. ద్వితీయార్ధంలో రివేంజ్‌ డ్రామా విషయంలో దర్శకుడు ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. కామెడీ, తండ్రీ కొడుకుల సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అయినా... రొటీన్ కథా సెకండాఫ్ సాగదీసినట్టుగా అనిపించటం లాంటి లోపాలూ ఉన్నాయి... రొటీన్ లో కామెడీ పోసి సర్వ్ చేసిన కాక్టెయిల్... హాస్యాన్ని ఇష్టపడేవాళ్ళు నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు..

    English summary
    Comedian Saptagiri plays the lead role and also wrote the film, which is an adaptation of the Tamil film Thirudan Police. Here is the complete review, rating of Saptagiri Expres movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X