Sarangapani Jathakam Review: సారంగపాణి జాతకం మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: ప్రియదర్శి, రూపా కొడువయూర్, వీకే నరేష్, తణికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, వైవా హర్ష తదితరులు
నిర్మాత: శివలెంక కృష్ణ ప్రసాద్
దర్శకుడు: మోహనకృష్ణ ఇంద్రగంటి
సంగీత దర్శకుడు: వివేక్ సాగర్
కెమెరామెన్: పీజీ విందా
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
బ్యానర్: శ్రీదేవీ మూవీస్
రిలీజ్ డేట్: 2025-04-25

కార్స్ షాప్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేసే సారంగపాణి (ప్రియదర్శి)కి జాతకాల పిచ్చి. ఉదయం లేచి జాతకాలు చూసుకోందే ఏ పని చేయని వ్యక్తి తన కంపెనీలో పనిచేసే మైథిలీ (రూపా కొడువాయూర్) అమితంగా ప్రేమిస్తాడు. అయితే ఇద్దరు తమ ప్రేమను పెద్దలకు చెప్పించి ఒప్పించడమే కాకుండా పెళ్లికి సిద్దపడుతారు. అయితే ఆస్ట్రాలజర్ జిగ్నేశ్వర్ ( శ్రీనివాస్ అవసరాల) జాతకం చూసి.. నీ జీవితంలో నరహత్య చేస్తావని జోతిష్యం చెబుతాడు. దాంతో పెళ్లికి ముందే నర హత్య చేయాలని సారంగపాణి తన స్నేహితుడు చందు (వెన్నెల కిషోర్)తో కలిసి ప్లాన్స్ వేస్తాడు.
ా
ఎవరో ఒకరిని హత్య చేయడానికి సారంగపాణి, చందూ వేట ఎలా సాగింది? పెళ్లిని వాయిదా వేసుకొంటానని చెబితే మైథిలీ తల్లిదండ్రులు (వీకే నరేష్, రూపాలక్ష్మీ), సారంగపాణి తల్లిదండ్రులు (శ్రీనివాసరావు, కల్పలత) ఎలా రియాక్ట్ అయ్యారు? నరహత్య చేయడానికి సారంగపాణికి ఎలాంటి అవరోధాలు ఏర్పడ్డాయి? చివరకు హత్యాప్రయత్నం ఎలా ముగిసింది? మైథిలిని పెళ్లి చేసుకొన్నాడా? అనేక అనుభవాలు, కష్టాల మధ్య సారంగపాణి తన జాతకాల పిచ్చి తగ్గించుకొన్నాడా? అనే ప్రశ్నలకు హాస్యరూపంలో అందించిన సమాధానమే సారంగపాణి జాతకం సినిమా కథ.
జీవితంలో అత్యంత ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకొనే ప్రాసెస్‌లో లైఫ్ హ్యాపీగా ఉండాలనే వ్యక్తి జీవితంలో క్రైమ్ ఎలిమెంట్ ప్రవేశిస్తే ఎలా ఉంటుందనే పాయింట్‌ను దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కథగా విస్తరించిన విధానం, ఆ కథను సన్నివేశాలను మలిచిన విధానం బ్రహ్మాండంగా ఉంది. సన్నివేశాలను ఫుల్ ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్‌ను జొప్పించిన విధానం మూవీకి కొత్త ఫ్లేవర్‌ను అందించింది. కథలో పాత్రలను పరిచయం చేసుకొంటూ వాటి చుట్టూ వినోదాన్ని అల్లుకొన్న విధానం పూర్తిస్థాయి వినోదాన్ని పండించింది. సారంగపాణి జాతకం లాంటి స్క్రిప్టును హిలేరియస్‌గా మార్చడం ఇంద్రగంటికే సాధ్యమవుతుందా? అనే అంతగా రాశాడు. పంచ్ డైలాగ్స్, ఆరోగ్యకరమైన, అచ్చ తెలుగు వాతావరణం సినిమాలో కనిపించేలా చేయడం ఆయన ప్రతిభకు అద్దం పట్టిందనే చెప్పాలి. సుందరమ్మ శవం సీన్, మైథిలీ బర్త్ డే సెలబ్రేషన్, సెకండాఫ్‌లో అహోటెల్ ఎపిసోడ్ సినిమాకు ప్రాణం పోశాయి.
ఇక నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ప్రియదర్శి మంచి పెర్ఫార్మర్ అనే విషయాన్ని కొత్తగా చర్చించాల్సిన అవసరం లేదు. కానీ ఈ సినిమాలో చందూ క్యారెక్టర్‌లో వెన్నెల కిషోర్ చేసిన పెర్ఫార్మెన్స్ సపోర్ట్‌తో సారంగపాణిగా ప్రియదర్శి నటన స్థాయి మరో లెవెల్‌లో ఉందని చెప్పాలి. ఫస్టాఫ్‌లో ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కడుపుబ్బ నవ్వించడమే కాకుండా హెల్తీ కామెడీని పండించారు. ఇక సెకండాఫ్‌లో ఈ ఇద్దరికి తోడుగా వైవా హర్ష ఎంట్రీ ఇచ్చి కామెడీ ట్రాక్‌ను మరో మెట్టు ఎక్కించాడు. వీకే నరేష్, శ్రీనివాస్ వడ్లమాని తమకు వెసులుబాటు దక్కినప్పుడల్లా తమ జోరును ప్రదర్శించారు. మైథిలిగా రూపా మరోసారి తన నటనతో ఆకట్టుకొన్నారు. తన పాత్రకు తగినట్టుగా ఎమోషన్స్, యాటిట్యూడ్‌ను చక్కగా చూపించారు. సిగ్మా ఉమెన్‌గా యాంకర్ హర్షిణి కొంత ఫన్ రుచి చూపించారు. ఇంకా ఈ సినిమాలో నటించిన తనికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్‌తోపాటు ప్రతీ ఒక్కరు గుర్తుండిపోయేలా నటించారు
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. డైరెక్టర్‌గానే కాకుండా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ విషయంలో ఇంద్రగంటి ప్రతిభ మొదటి వరుసలో నిలుస్తుంది. ఒక అచ్చ తెనుగు సినిమాగా మలిచిన విధానం సినిమాపై ఆయనకు ఉన్న డెడికేషన్ కనిపిస్తుంది. ఇక పీజీ విందా సినిమాటోగ్రఫి చాలా బాగుంది. ప్రతీ సన్నివేశాన్ని కంటెంట్ పరంగా చాలా రిచ్‌గా ఉందనేలా తీశారు. వెన్నెల కిషోర్, వైవా హర్ష మూడ్‌ను, మూమెంట్స్‌ను ఇంకాస్త చూపించి ఉంటే ఇంకా బెటర్ ఫన్ క్రియేట్ అయి ఉండేదనిపిస్తుంది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్, ముఖ్యంగా ఇలాంటి నాన్ స్టాప్ ఫన్ ఉన్న కంటెంట్‌లో యాక్షన్ ఎపిసోడ్‌ను డిజైన్ చేయడం కష్టమైన పని. కానీ ఈ సినిమాలో ఫైట్స్ కూడా కథలో భాగంగా మారడం మరో బ్యూటీ. ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ హై రేంజ్‌లో ఉన్నాయి. శ్రీదేవీ మూవీస్ బ్యానర్ అనుసరించే ప్రమాణాలకు ఏ మాత్రంగా తగ్గకుండా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను లావిష్‌గా రూపొందించారు.
లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్, క్రైమ్, కామెడీ ఇలా మల్టీ జోనర్ అంశాలను బేస్ చేసుకొని రూపొందిన సినిమా సారంగపాణి. హిలేరియస్ కామెడీ, యాక్టర్ల ఫెర్ఫార్మెన్స్, డైలాగ్ డ్రామా, విజువల్ సెన్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. ఫస్టాఫ్ హైస్పీడ్‌లో పరిగెత్తితే.. అంతకు మించి స్పీడ్ సెకండాఫ్‌లో కనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌లో అక్కడక్కడ కొంత ల్యాగ్ సినిమా వేగానికి కళ్లెం వేస్తుందా? అనే ఫీలింగ్ కల్పించినప్పుడల్లా ఇంద్రగంటి అనుసరించిన స్క్రీన్ ప్లే ఆ లోపాన్ని సవరించేలా చేసింది. సారంగపాణి జాతకం ఇంటిల్లిపాది చక్కగా కలిసి చేసే విందు భోజనం లాంటింది. ప్రతీ సన్నివేశాన్ని పెదవిపై చిరునవ్వు చిందిచే స్థాయి నుంచి పగలబడి నవ్వుకునేలా ఇంద్రగంటి అందించారు. ఇంద్రగంటి విజన్‌ను అర్ధం చేసుకొన్న యాక్టర్లు తమ తోడ్పాటును చక్కగా అందించారు. ఈ సినిమాను థియేటర్‌లో చూడండి. ఈ వారం చూడాలనుకొన్న సినిమాల లిస్టులో సారంగపాణి జాతకం మూవీని పెట్టుకొండి..చాలా రోజుల తర్వాత జంధ్యాల, ఈవీవీ మార్క్ సినిమాను చూసిన అనుభూతి తప్పకుండా కలుగుతంది. డోంట్ మిస్ సారంగపాణి జాతకం ఇన్ థియేటర్.


Click it and Unblock the Notifications











