Sarangapani Jathakam Twitter Review: సారంగపాణి జాతకం ట్విట్టర్ రివ్యూ.. కోర్టు తర్వాత ప్రియదర్శికి మరో హిట్టా?
ప్రియదర్శి హీరోగా, రూపా కొడవయూర్ హీరోయిన్‌గా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన చిత్రం సారంగపాణి జాతకం. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లా ఈ చిత్రం ఉండబోతోందని అర్థం అవుతోంది. ప్రియదర్శితో పాటుగా ఈ చిత్రంలో తణికెళ్ల భరణి, నరేష్, శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిషోర్, వైవా హర్ష నటించారు. టీజర్లు, ట్రైలర్లతో ఆకట్టుకొన్న ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమా గురించి ట్విట్టర్‌లో నెటిజన్లు వెల్లడించిన రివ్యూలు, అభిప్రాయాల వివరాల్లోకి వెళితే..
మల్లేశం, బలగం, కోర్ట్ సినిమాల మాదిరిగానే సారంగపాణి చిత్రంలో ప్రియదర్శి పోషించిన పాత్ర కామన్ మ్యాన్ రోల్. ఈ సినిమాలోని ఆ క్యారెక్టర్ జర్ ఫన్‌తోపాటు పెయిన్ ఫుల్‌గా ఉంటుంది. జాతకాల్ని నమ్మే ఓ కుర్రాడి పాత్ర చుట్టూ తిరిగే కథ. వెన్నెల కిషోర్, వైవా హర్ష కామెడీ, అవసరాల శ్రీనివాస్ కొత్తగా కనిపించే పాత్ర, వీకే నరేష్, శ్రీనివాసరావు లాంటి పాత్రలు విభిన్నంగా ఉంటాయి. హీరోయిన్ రూపా కొడవాయూర్ అందర్నీ ఆకట్టుకొంటుంది.
ఇంద్రగంటి కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఈ సినిమాలో ఆయన రూపొందించిన పాత్రలు సమాజంలో మనం చుట్టూ ఉండే పాత్రలకు దగ్గరగా ఉంటాయి. జంధ్యాల, ఈవీవీ లాంటి దర్శకుల సినిమాలను మిస్ అయ్యే వారికి ఆ కొరతను ఇంద్రగంటి తీర్చాడనిపిస్తుంది.

వైజాగ్‌లో ప్రీమియర్ షో చూశాను. ఫస్టాఫ్ చాలా బాగుంది. తెర మీద వచ్చే సన్నివేశాలు హిలేరియస్‌గా ఉన్నాయి. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. సెకండాఫ్ కోసం ఆసక్తికరంగా వేచి చూస్తున్నాను అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
సారంగపాణి జాతకం చూశాను. ఇలాంటి చక్కటి మూవీని అందించిన దర్శకుడు ఇంద్రగంటికి ధన్యవాదాలు. ప్రియదర్శి, వెన్నెల కిషోర్ మధ్య వచ్చే సన్నివేశాలు, కామెడీ సీన్లు అద్బుతంగా ఉన్నాయి. మీకు దగ్గరలో ఉన్న ఈ సినిమాను తప్పకుండా చూడండి అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
సారంగపాణి జాతకం సినిమా చూస్తే తప్పకుండా వినోదాన్ని, ఎమోషన్స్ పంచుతుందనిపిస్తున్నది. విజయాలతో దూసుకెళ్తున్న ప్రియదర్శికి మరో విజయం ఖాయమనిపిస్తున్నది. ఇంద్రగంటి, శివలెంక కృష్ణ ప్రసాద్, రూపా కొడువాయూర్, వెన్నెల కిషోర్, హర్ష వైవాకు ధన్యవాదాలు అంటూ సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











