Saraswathi Movie Twitter Review: సరస్వతి మూవీ ట్విట్టర్ రివ్యూ..
Saraswathi Movie Twitter Review: మల్టీ టాలెండెండ్ యాక్టరస్ వరలక్ష్మి శరత్‌కుమార్. తమిళ్, తెలుగు సినీ పరిశ్రమల్లో తనదైన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు దర్శకురాలిగా మారారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'సరస్వతి'. ఈ సినిమా మార్చి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది.విడుదలకు ముందే ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోవడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను విస్తృతంగా చేసింది. ఈ నేపథ్యంలో సరస్వతి సినిమాపై నెటిజన్లు అందించిన టాక్ ఏమిటీ? క్రిటిక్స్ రివ్యూ ఏమిటీ? అనే వివరాలు పరిశీలిస్తే..
'సరస్వతి' సినిమాను దోశా డైరీస్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై పూజా శరత్ కుమార్, వరలక్ష్మి శరత్ కుమార్ కలిసి నిర్మించారు. ఈ సినిమాకి ఆంటోని ప్రవీణ్ డేనియల్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.ఇక ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు ప్రియమణి, రాధిక శరత్ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, ప్రకాశ్ రాజ్, కిషోర్, నాజర్, తులసి, సప్తగిరి, శ్రీకాంత్ అయ్యంగార్, మైమ్ గోపి, హరీష్ పెరాడీ, రఘుబాబు, గెటప్ శ్రీను, నివేష్క తదితరులు కీలక పాత్రల్లో నటించారు. భారీ తారాగణం ఉండటం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్. థమన్ అందించారు.

'సరస్వతి' సినిమా కథ విషయానికి వస్తే.. సరస్వతి అనే 12 ఏళ్ల చిన్నారి. ఆమెను ఎంతో ప్రేమతో పెంచుకున్న తల్లి (వరలక్ష్మి శరత్‌కుమార్) జీవితంలో ఒక రోజు పెద్ద సంఘటన జరుగుతుంది. ఒక రోజు స్కూల్‌కు వెళ్లిన ఆ చిన్నారి అకస్మాత్తుగా కనిపించకుండా పోతుంది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన తల్లి పోలీసులను ఆశ్రయిస్తుంది. తన కూతుర్ని వెతికి పెట్టాలని వేడుకుంటుంది. అయితే ఆ మిస్సింగ్ కేసు దర్యాప్తులో అనూహ్యమైన ట్విస్ట్ బయటపడుతుంది. ఆ ట్విస్ట్ ఏమిటి? చిన్నారి మిస్సింగ్ వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? ఆ కుట్రలో ఎవరి పాత్ర ఉంది? చివరకు తల్లి తన కూతుర్ని క్షేమంగా తిరిగి పొందగలిగిందా? అనే ప్రశ్నలకు సమాధానమే 'సరస్వతి' సినిమా కథ.
ఓ నెటిజన్ సరస్వతి సినిమాపై ఎక్స్ లో ట్విట్ చేస్తూ.. సరస్వతి సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పీక్స్‌లో నడుస్తుంది. కథలో వచ్చే ట్విస్టులు, ఎమోషనల్ మూమెంట్స్ ప్రేక్షకులను పూర్తిగా ఎంగేజ్ చేస్తాయి. ముఖ్యంగా తల్లికూతురు మధ్య ఉన్న మదర్ సెంటిమెంట్ చాలా బాగా వర్క్ అయింది. ఇక థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మరో పెద్ద బలం. కీలక సన్నివేశాల్లో ఆయన ఇచ్చిన BGM థ్రిల్‌ను మరింత పెంచుతుంది. మొత్తంగా ఎమోషన్, సస్పెన్స్, థ్రిల్ అన్ని కలిసి ప్రేక్షకులకు మంచి అనుభూతి ఇచ్చే సినిమా అని ట్విట్ చేశారు.
మరో నెటిజన్ సరస్వతి సినిమాపై రివ్యూ ఇస్తూ.. ఈ సినిమలోని కొన్ని సన్నివేశాలు నిజంగానే గూస్‌బంప్స్ ఇచ్చేలా ఉన్నాయి. ముఖ్యంగా ఒకే షాట్‌లో తీసిన సీన్ చాలా హైలైట్‌గా నిలుస్తుంది. అనూహ్యంగా వచ్చే హీరో కామియో కూడా ప్రేక్షకులకు మంచి సర్‌ప్రైజ్ ఇస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే కోర్టు ఎపిసోడ్లు మాత్రం పీక్స్‌లో ఉంటాయి. మొత్తంగా మదర్ సెంటిమెంట్, థ్రిల్ కలిసి సినిమాను ఆకట్టుకునేలా చేస్తాయని రాసుకొచ్చారు.
ఓ నెటిజన్ సరస్వతి సినిమాపై రివ్యూ ఇస్తూ లాంగ్ ట్విట్ చేశాడు. 'సరస్వతి సినిమా భావోద్వేగాలతో నిండిన కోర్ట్‌రూమ్ డ్రామాగా ఆకట్టుకుంటుంది. థ్రిల్లింగ్ మూమెంట్స్, బలమైన నటనలతో సినిమా ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. మొదటి భాగం ఆసక్తికరంగా సాగుతూ పవర్‌ఫుల్ ఇంటర్వెల్ ట్విస్ట్ తో ఆకట్టుకుంటుంది. తల్లి కూతురు మధ్య ఉన్న మదర్ సెంటిమెంట్ చాలా బాగా వర్క్ అయింది. అలాగే థమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కీలక సన్నివేశాలకు మరింత బలం ఇచ్చింది' అని పేర్కొన్నారు.
అలాగే.. 'ఇక రెండో భాగంలో సినిమా మరింత ఎలివేట్ అవుతుంది. ముఖ్యంగా 7 నిమిషాలు 42 సెకన్ల సింగిల్ షాట్ సీక్వెన్స్, అనూహ్యంగా వచ్చే హీరో కామియో, అలాగే ఇంటెన్స్‌గా సాగే కోర్ట్‌రూమ్ ఎపిసోడ్లు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. నటనల పరంగా వరలక్ష్మి శరత్‌కుమార్, ప్రియమణి, అలాగే జడ్జిగా కనిపించిన రావు రమేష్ అద్భుతంగా నటించి కథకు బలాన్ని చేకూర్చారు. మొత్తంగా భావోద్వేగం, థ్రిల్ కలగలిపిన మంచి కోర్ట్‌రూమ్ డ్రామాగా సరస్వతి నిలుస్తుందని రాసుకొచ్చారు.
మరో ప్రేక్షకుడు సరస్వతి మూవీ రివ్యూ ఇస్తూ.. ఈ సినిమా మొత్తం భావోద్వేగాల చుట్టూ తిరిగే కథతో ప్రేక్షకులను బాగా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా తల్లి కూతురు మధ్య ఉన్న ఎమోషన్ కథకు ప్రధాన బలం. సినిమాలోని తల్లి ఎమోషనల్ సీన్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఇక సెకండ్ పార్ట్ లో వచ్చే 7 నిమిషాల సింగిల్ షాట్ సీక్వెన్స్ చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఆ సీన్ సినిమాకు ప్రత్యేక హైలైట్‌గా నిలుస్తుంది. భావోద్వేగం, థ్రిల్ కలిసి ఆ ఎపిసోడ్‌ను మరింత ప్రభావవంతంగా చేశాయి. దర్శకురాలిగా తొలి ప్రయత్నం చేసిన వరలక్ష్మి శరత్‌కుమార్ మంచి కథను ఎమోషనల్‌గా చెప్పడంలో సక్సెస్ అయ్యారు. మొత్తంగా ఎమోషన్, థ్రిల్ కలిసిన మంచి సినిమా అని చెప్పొచ్చు. ఈ మూవీ నేను ఇచ్చే రేటింగ్: 3.5/5 అని రేటింగ్ ఇచ్చింది.
మరో నెటిజన్ రివ్యూ ఇస్తూ.. 'సరస్వతి సినిమా ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా సాగుతూ ఇంటర్వెల్ ట్విస్ట్తో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యంగా తల్లి ఏడ్చే ఎమోషనల్ సీన్ ప్రేక్షకులను బాగా టచ్ చేస్తుంది. మదర్ ఎమోషన్స్ మరియు థమన్ ఇచ్చిన BGM ఆ సన్నివేశాలను మరింత ఎలివేట్ చేశాయి. సెకండ్ హాఫ్‌లో సినిమా మరో లెవెల్‌కు వెళ్తుంది. ముఖ్యంగా 7 నిమిషాలు 42 సెకన్ల సింగిల్ షాట్ సీక్వెన్స్ గూస్‌బంప్స్ ఇస్తుంది. అనూహ్యంగా వచ్చే హీరో కామియో, అలాగే ఇంటెన్స్‌గా సాగే కోర్ట్ డ్రామా సినిమాకు పెద్ద హైలైట్. నటనల పరంగా వరలక్ష్మి శరత్‌కుమార్ అద్భుతంగా నటించి సినిమాను మోసుకెళ్లారు. ప్రియమణి కూడా తన పాత్రలో ఆకట్టుకోగా, జడ్జిగా కనిపించిన రావు రమేష్ క్లాస్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మొత్తంగా ఎమోషన్, థ్రిల్ కలిసిన మంచి కోర్ట్‌రూమ్ థ్రిల్లర్‌గా సరస్వతి నిలుస్తుంది. థియేటర్లలో తప్పక చూడదగ్గ సినిమా' అని పాజిటివ్ రివ్యూ ఇచ్చారు.
మరొకరు ఈ సినిమాపై రివ్యూ ఇస్తూ.. 'స్క్రీన్‌ప్లే, ట్విస్టులు, బలమైన సందేశంతో సరస్వతి ఒక మంచి థ్రిల్లర్‌గా నిలుస్తుంది. కథను ఆసక్తికరంగా నడిపిస్తూ దర్శకురాలు వరలక్ష్మి శరత్‌కుమార్ నటిగా, దర్శకురాలిగా రెండు పాత్రల్లోనూ మెప్పించారు. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్ సహా ఇతర నటీనటులు కూడా తమ తమ పాత్రల్లో బలమైన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కీలక సన్నివేశాల్లో వచ్చే ట్విస్టులు కథను మరింత ఉత్కంఠగా మార్చాయి. సాంకేతికంగా కూడా సినిమా బాగానే ఉంది. థమన్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు మరింత ఇంటెన్సిటీ తీసుకొచ్చాయి. అలాగే దోశా డైరీస్ నిర్మాణ విలువలు కూడా సినిమా మొత్తం మంచి స్థాయిలో కనిపిస్తాయి.మొత్తానికి థ్రిల్, ఎమోషన్ కలిసిన ఒక డీసెంట్ థ్రిల్లర్‌గా సరస్వతి ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. నా రేటింగ్ 3.5/5'అని రాసుకొచ్చారు.
మరొకరు ఈ సినిమాపై రివ్యూ ఇస్తూ.. 'సరస్వతి ఒక ఆసక్తికరమైన థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మంచి సందేశంతో కూడిన కథలో వచ్చే ట్విస్టులు, ఎంగేజింగ్ నేరేషన్ సినిమాను ఆసక్తిగా ముందుకు తీసుకెళ్తాయి. దర్శకురాలిగా, నటిగా వరలక్ష్మి శరత్‌కుమార్ మెప్పించారు. ముఖ్యంగా తల్లి భావోద్వేగ సన్నివేశాల్లో ప్రియమణి అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఎమోషనల్‌గా కనెక్ట్ చేస్తుంది. అలాగే చిన్నారి పాత్రలో నటించిన నివిక్షా కూడా తన నటనతో ఆకట్టుకుంది. సాంకేతికంగా కూడా సినిమా బాగుంది. థమన్ ఇచ్చిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను మరింత ఎలివేట్ చేస్తాయి. అలాగే మంచి నిర్మాణ విలువలు సినిమాకు మరింత బలం ఇచ్చాయి. మొత్తంగా ట్విస్టులు, ఎమోషన్ కలిసిన ఒక మంచి థ్రిల్లర్‌గా సరస్వతి నిలుస్తుంది' అని రాసుకొచ్చారు.
ఇంకొకరు మూవీపై రివ్యూ ఇస్తూ.. 'సరస్వతి సినిమాలో అనూహ్యంగా వచ్చే హీరో కామియో థియేటర్లలో మంచి స్పందన తెచ్చుకుంటోంది. ఆ సర్ప్రైజ్ ఎంట్రీ ప్రేక్షకులను ఆకట్టుకునే హైలైట్‌గా నిలుస్తుంది. ఇక రావు రమేష్ జడ్జి పాత్రలో చాలా కన్విన్సింగ్‌గా కనిపించి తన నటనతో కథకు మరింత బలం ఇచ్చారు. కోర్ట్ సన్నివేశాల్లో ఆయన డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. మొత్తంగా ఎమోషన్, థ్రిల్ కలిసిన కోర్ట్‌రూమ్ డ్రామాగా 'సరస్వతి' ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. ముఖ్యంగా కోర్ట్ డ్రామా సినిమాలు ఇష్టపడే వారికి ఈ మూవీ బాగా నచ్చుతుంది' అని పాజిటివ్ గా రాసుకొచ్చారు.


Click it and Unblock the Notifications











