Por Thozhil Review: ట్విస్టులతో అదిరిపోయే సరికొత్త క్రైమ్ థ్రిల్లర్.. 'పోర్ తోళిల్' రివ్యూ
రేటింగ్: 2.75/5
టైటిల్: పోర్ తోళిల్ (పోర్ తోడిల్)
నటీనటులు: శరత్ కుమార్, అశోక్ సెల్వన్, నిఖిలా విమల్, శరత్ బాబు, సునీల్ సుఖదా, నిళల్‌గళ్ రవి తదితరులు
బ్యానర్: అప్లాజ్ ఎంటర్టైన్ మెంట్
నిర్మాతలు: సమీర్ నాయర్, దీపక్ సెగల్, ముఖేష్ ఆర్. మెహతా, సీవీ శరత్, పూనమ్ మెహ్రా, సందీప్ మెహ్రా
సినిమాటోగ్రఫీ: కాలైసెల్వన్ శివాజీ
ఎడిటింగ్: శ్రీజిత్ సరంగ్
సంగీతం: జేక్స్ బిజోయ్
రచన: విఘ్నేష్ రాజా, ఆల్ప్రైడ్ ప్రకాష్
దర్శకత్వం: విఘ్నేష్ రాజా
థియేటర్ విడుదల తేది: జూన్ 9, 2023
ఓటీటీ విడుదల తేది: ఆగస్ట్ 11, 2023
ఓటీటీ వేదిక: సోనీ లివ్
తమిళ చిత్ర పరిశ్రమలో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా విడుదలై భారీ హిట్ సొంతం చేసుకున్న సినిమా 'పోర్ తోళిల్' (Por Thozhil). శరత్ కుమార్, అశోక్ సెల్వన్ ప్రధాన పాత్రలుగా నటించిన ఈ సినిమా జూన్ 9న తమిళంలో విడుదలై సంచలన విజయం సాధించింది. దీంతో ప్రేక్షకులందరికీ అందుబాటులో ఉంచాలన్న ఆలోచనతో తమిళంతోపాటు, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఓటీటీలోకి వదిలారు. ఆగస్ట్ 11 నుంచి సోని లివ్ (Sony Liv)లో స్ట్రీమింగ్ అవుతోన్న మర్డర్ మిస్టరీ మూవీ 'పోర్ తోళిల్' (Por Thozhil Movie Review) ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ: భయస్తుడైన ప్రకాష్ (అశోక్ సెల్వన్)కు క్రైమ్ స్పెషల్ బ్రాంచ్ కు డీఎస్పీగా అపాయింట్ అవుతాడు. అతన్ని ఎస్పీ లోకనాథన్ (శరత్ కుమార్) వద్ద ట్రైనీగా పనిచేసేందుకు అడిషనల్ డీజీపీ మహేంద్రన్ (నిళల్‌గళ్ రవి) ఆర్డర్ వేస్తాడు. తిరుచ్చిలో జరిగిన ఓ యువతి మర్డర్ కేసును వీళ్లకు అసిస్ట్ చేస్తారు. ఈ కేసుకు సంబంధించి లోకనాథన్ కు ప్రకాష్ తోపాటు టెక్నికల్ అసిస్టెంట్ గా వీణ (నిఖిలా విమల్) కూడా అపాయింటి చేస్తారు. ఈ ముగ్గురు కలిసి కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా మరికొన్ని హత్యలు జరుగుతుంటాయి.

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్: వరుసగా హత్యలు ఎవరు చేస్తున్నారు వాళ్ల మోటివ్ ఏంటీ అందుకు గల కారణాలు ఏంటీ విచారణలో లోకనాథన్, ప్రకాష్, వీణ ఎదుర్కున్న పరిస్థితులు, ఇబ్బందులు ఏంటీ హంతకున్ని పట్టుకున్నారా లేదా వంటి ఇంట్రెస్టింగ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అంశాలు తెలియాలంటే ఈ 'పోర్ తోళిల్' (Por Thozhil Telugu Review)మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ: సాధారణంగా మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వాటిని ఎంత కొత్తగా చిత్రీకరిస్తే అంతా బాగా వర్కౌట్ అవుతాయి. సీరియల్ మర్డర్స్, వాటి వెనుక కారణాలు, ఎవరు హత్య చేస్తున్నారు, సస్పెక్ట్స్ ఇలాంటి అంశాలతోనే ప్రతి క్రైమ్ థ్రిల్లర్ మూవీ సాగుతుంది. ఈ అంశాలను ఎలా డిజైన్ చేసి చూపించామనేదే ముఖ్యం. ఎంత బాగా చూపిస్తే ప్రేక్షకులు అంతా బాగా ఆదరిస్తారు. అందులో పోర్ తోళిల్ మూవీ టీమ్ సక్సెస్ అయిందనే చెప్పాలి.

కొత్తగా కారణం: ప్రతి (ఈ జోనర్ లో) సినిమాలాగే హత్యలు, కారణాలు, మోటివ్, ఇన్వెస్టిగేషన్, హంతకుడు వంటి అంశాలు ఉన్నాయి. చివరి వరకు హత్య చేసేది ఎవరనే సస్పెన్స్ బాగా మెయింటేన్ చేశారు. మొదటి మర్డర్ తోనే కథలోకి తీసుకెళ్లిన డైరెక్టర్ పాత్రల పరిచయం వద్ద కాస్తా టైమ్ తీసుకున్నారు. ఇలాంటి జోనర్స్ లో మర్డర్ చేసేవాళ్లు సైకోపాత్ అయి ఉంటారు. కానీ ఇందులో మర్డర్స్ చేసేందుకు చూపించిన రీజన్ కొత్తగా ఉండి ఆకట్టుకుంటుంది.

బీజీఎమ్ అలా: కెనడీ (శరత్ బాబు), లోకనాథన్, ప్రకాష్ మధ్య హైడ్ అండ్ సీక్ గేమ్ చాలా బాగుంటుంది. వీరి సన్నివేశాల మధ్య వచ్చే బీజీఎమ్ నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్తుంది. దాంతో సస్పెన్స్ హైలెట్ అయింది. ట్విస్టులు అదిరిపోయాయి. క్లైమాక్స్ లో మర్డర్ చేసే వ్యక్తిని బలహీనంగా కాకుండా ఎలివేట్ చేసి చూపించారు. మర్డర్ చేసే విధానాన్ని బాగా వివరించారు. డైలాగ్స్ చాలా బాగా పేలాయి. తల్లిదండ్రుల ఆధిపత్యం, భార్యాభర్తల గొడవల వల్ల జరిగే అనర్థాలను అంతర్లీనంగా చూపించి మెసేజ్ ఇచ్చారు. బీజీఎమ్, సినిమాటోగ్రఫీ అంతా బాగున్నాయి. కానీ, కొన్ని డీటెల్స్ మిస్ చేశారు. పూర్తిగా క్లారిటీ ఇవ్వలేదనిపించింది.

ఎవరెలా చేశారంటే?: శరత్ కుమార్, అశోక్ సెల్వన్ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయారు. పోటాపోటీగా నటించారు. ఇక శరత్ బాబు నటన హైలెట్. ఆయనతోనే సినిమా ఎంగేజింగ్ గా ఉండి మంచి సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది. నిఖిలా విమల్ పాత్రకు అంతా ఇంపాక్ట్ ఏం లేదు. రెండు చోట్ల హైలెట్ అవుతుంది అంతే. మిగతా పాత్రలు, విఘ్నేష్ రాజా డైరెక్షన్ అంతా బాగున్నాయి. ఫైనల్ గా చెప్పాలంటే.. కొత్త కథతో క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకునేవారికి పోర్ తోళిల్ (Por Thozhil Review) ఒక మంచి ఆప్షన్.


Click it and Unblock the Notifications











