twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సర్దుకుపోవడం కష్టమే

    By Staff
    |

    Sardukupodam Randi
    ఈ మధ్య వచ్చే సినిమాల్లో ఒక కొత్త ధోరణి కన్పిస్తోంది. అదేమిటంటే పాత కథలను, ఇదివరకు వచ్చిన సినిమాలను కొద్దిగా మార్చి, ఆస్థాన హాస్య నటుల చేత 'కామెడీ చేష్టలు' చేయించడం. ఇలా చేస్తే చాలు ఒక కొత్త సినిమా తయారవుతుంది. అటు పూర్తిగా పాతగా కాకుండా, కొత్తగా కాకుండా ఉండే ఈ తరహా చిత్రాల కోవలో మరో చిత్రం వచ్చింది. ఈ సారి ఈ చిత్రం-సర్దుకుపోదాం రండి- సృష్టికర్త సెంటిమెంట్‌ చిత్రాల దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. 'భార్య' గొప్పతనం గురించి ఈయన గతంలో ఎన్నో చిత్రాల్లో ఎన్నో రీళ్ళను చుట్టేశారు. అది చాలదన్నట్టు ఈ సినిమాలో మరో 10 రీళ్ళను చుట్టేశారు. ఈసారి పత్నీ ప్రాశస్త్యంతో పాటు, ఆస్థాన హాస్యపు నటుల పిచ్చి కామెడీ 'అతి'క్రమించడంతో రెండున్నర గంటలపాటు సినిమాను చూస్తూ సర్దుకుపోవడం కష్టమే.

    జగపతిబాబు ఏదో ఆఫీస్‌ లో ఒక బాస్‌. అతనికి పెద్ద బంగాళా ఉంటుంది. ఆఫీసుకు కోటు వేసుకొని వస్తాడు- బైక్‌ మీద. సౌందర్యతో అతనికి పెళ్ళి అవుతుంది. రోజూ ఆఫీస్‌ కు వెళ్ళేముందు భార్యకు ముద్దు ఇవ్వడం, ఆఫీస్‌ మధ్యలోనే డుమ్మా కొట్టేసి భార్య దగ్గరికి రావడం ....ఇలా ఆదర్శవంతమైన జీవితం గడుపుతుంటాడు. కానీ పెళ్ళయి ఏడేళ్ళు అయినతర్వాత ఈ మురిపాలు పోతాయి. సరసాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టేయాల్సి వస్తుంది.

    ముగ్గురు పిల్లలతో, గంపెడంత చాకిరీ చేసే సౌందర్యకు భర్తతో గడిపేందుకు టైం చిక్కదు. ఆమెను చూస్తే జగపతిబాబుకు కూడా మూడ్‌ రాదు.సో... ప్రాబ్లెమ్‌ స్టార్ట్స్‌...... మరో హీరోయిన్‌ ఎంటర్స్‌. ఆషాశైనీని చూడగానే హీరోగారు పడిపోతారు. ఏడేళ్ళు వెనక్కి పోతారు. పర్సనల్‌ సెక్రటరీగా అపాయింట్‌ చేసుకుంటారు. కొద్దిరోజులకే వీరిద్దరు మరీ పర్సనల్‌ గా దగ్గరవుతారు. భర్త అక్రమ సంబంధాన్ని విడగొట్టేందుకు సౌందర్య ప్లాన్‌ వేస్తుంది. ఆ ప్లాన్‌ ప్రకారం సౌందర్య, జగపతి బాబులిద్దరు మళ్ళీ ఒకటవుతారు. దట్సాల్‌ సినిమా ఓవర్‌...

    ఇందులో సర్దుకుపోదాం..రండి టైటిల్‌ కు, సినిమాకు సంబంధమేంటో అర్ధం కాదు. ఆంటీలాగా మారిన సౌందర్య గృహిణి పాత్రలో చక్కగా సరిపోయింది. జగపతిబాబు నటించేందుకు అవకాశం ఉన్న సన్నివేశాలు లేవు కాబట్టి నటన గురించి చెప్పలేం. కమెడియన్లలో ఎమ్మెస్‌ నారయణ ఫర్వాలేదు- అతిగా చేసినా. బ్రహ్మనందం పాత్ర సినిమాకు సంబంధం లేదు. ప్రకాష్‌ రాజ్‌ పాత్ర అవసరమేంటో కూడా అర్ధం కాదు. సంగీతం గురించి చెప్పడం శుద్ద దండగ. ఎస్వీ కృష్ణారెడ్డి నుంచి మరో బోర్‌ చిత్రం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X