For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సరిలేరు నీకెవ్వరు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating:
  3.0/5
  Star Cast: మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన్న, రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్ రాజ్
  Director: అనిల్ రావిపూడి

  సూపర్‌స్టార్‌ మహేశ్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ 'సరిలేరు నీకెవ్వరు'. సంక్రాంతి కానుకగా జనవరి 11న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఈ చిత్రం ఫ్యాన్స్‌ను, ప్రేక్షకులను మహేష్ బాబు మెప్పించాడా అని తెలుసుకోవడానికి కథలోకి వెళ్తాం.

  సరిలేరు నీకెవ్వరు కథ

  సరిలేరు నీకెవ్వరు కథ

  ఎవరూ లేని అనాధ అయిన అజయ్ (మహేష్‌ బాబు) సైన్యంలో ధైర్య సాహసాలకు మారు పేరైన సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఓ ఆపరేషన్‌లో తన తోటి జవాను గాయపడటంతో అతడి బాధ్యతలను తీర్చడానికి అజయ్ కర్నూలు వెళ్లాల్సి వస్తుంది. కర్నూలులో అడుగు పెట్టిన మరుక్షణమే తన తోటి జవాను తల్లి, ప్రొఫెసర్ భారతి (విజయశాంతి) ఓ సమస్యలో కూరుకుపోవడం అజయ్ తెలుసుకొంటాడు. మంత్రి నాగేంద్ర (ప్రకాశ్ రాజ్) ప్రైవేట్ సైన్యం అజయ్‌ను టార్గెట్‌గా చేసుకొంటుంది.

  సరిలేరు నీకెవ్వరు ట్విస్టులు

  సరిలేరు నీకెవ్వరు ట్విస్టులు

  తన సహచర జవాను అజయ్ (సత్యదేవ్)‌కు ఉన్న బాధ్యత ఏమిటి? కర్నూలులో భారతికి ఎలాంటి సమస్య ఎదురైంది. మంత్రి నాగేంద్రతో భారతికి ఎదురైన ఇబ్బందులు ఏమిటి? అజయ్ (మహేష్‌) కర్నూలులో భారతికి ఎలా అండగా నిలిచాడు. భారతి కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని, లోటును అజయ్ ఎలా పూడ్చాడు. ఇలాంటి భావోద్వైగమైన కథలో సంస్కృతి (రష్మిక మందన్న) చిలిపి, అల్లరి పనులు ఎలా సినిమాకు వినోదాన్ని పంచాయి? అజయ్, సంస్కృతి మధ్య కెమిస్ట్రీ సినిమాకు ఎంత వరకు ఉపయోగపడింది. మంత్రి నాగేంద్రకు అజయ్ ఎలాంటి గుణపాఠం నేర్పాడు అనే ప్రశ్నలకు సమాధానమే సరిలేరు నీకెవ్వరు సినిమా కథ.

  ఫస్టాఫ్ అనాలిసిస్

  ఫస్టాఫ్ అనాలిసిస్

  ప్రొఫెసర్ భారతి (విజయశాంతి)పై ఓ ఎమోషనల్ సీన్‌తో కథ మొదలవుతుంది. ఆ తర్వాత కశ్మీర్‌ సరిహద్దులో దేశానికి సేవ చేస్తున్న అజయ్‌ ఎంట్రీ, ఆ తర్వాత యాక్షన్ ఎపిసోడ్‌తో కూడిన ఆపరేషన్ చకచకా పరుగులు పెడుతాయి. ఆ క్రమంలోనే తన సహచర జవాను అజయ్‌ శత్రువుల కాల్పుల్లో గాయపడి మృత్యువుతో పోరాడే అంశాలు చాలా భావోద్వేగంగా సాగుతాయి. మహేష్ బాబు కర్నూలుకు ప్రయాణించే సమయంలో ట్రైన్‌లో రష్మిక ఫ్యామిలీ (రావు రమేష్, సంగీత)తో చేయించిన సన్నివేశాలు ఫుల్లుగా వినోదాన్ని పంచుతాయి. ఇక కర్నూలులో నాగేంద్ర మనుషులను కొండారెడ్డి బురుజు వద్ద యాక్షన్ సీన్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. దీంతో ఫస్టాఫ్ మంచి ఊపుతో తొలిభాగం ముగుస్తుంది.

  సెకండాఫ్‌ అనాలిసిస్

  సెకండాఫ్‌ అనాలిసిస్

  ఇక అదే సెకండాఫ్‌లో కొనసాగుతుందనే ఆశించిన ప్రేక్షకులకు కొంత ఝలక్ తగులుతుంది. విజయశాంతి, మహేష్ బాబు, ప్రకాశ్ రాజ్ మధ్య పోటాపోటీ సన్నివేశాలు రొటీన్‌గా మారినాయనే అనిపించే క్రమంలో అల్లూరి సీతారామరాజు ఎపిసోడ్ ఫ్యాన్స్‌లో జోష్ పెంచుతుంది. అలా కొంత ఒడిదుడుకుల మధ్య కథ ప్రయాణంలో రాజకీయ నేతలపై మహేష్ బాబు విసిరిన సెటైర్లు ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తాయి. ఆ తర్వాత నల్లమల్ల ఎపిసోడ్ సాగదీతగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో క్లాస్‌లు పీకడం, స్పీచ్‌లు ఇవ్వడం కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. రొటీన్‌కు భిన్నంగా ఫైట్స్ లేకుంబా క్లైమాక్స్‌ను ముగించడం బాగున్నప్పటికీ.. ఫ్యాన్స్‌ను మెప్పించే స్థాయిలో లేదనే ఫీలింగ్ కలుగుతుంది. ఓవరాల్‌గా హీరో ఎలివేషన్, బిల్డప్ సీన్లతో అభిమానులకు పండగ వాతావరణాన్ని నింపుతాయి.

  అనిల్ రావిపూడి డైరెక్షన్

  అనిల్ రావిపూడి డైరెక్షన్

  ఇప్పటి వరకు ఒక ఇమేజ్‌ను సొంతం చేసుకొన్న దర్శకుడు అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరుతో తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించుకొన్నారు. ఫస్టాఫ్‌ను నడిపించిన విధానం, క్లాస్, మాస్‌ను, అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా అంశాలను కలబొసి మంచి మార్కులు కొట్టేశాడు. ఓ దశలో కథ అనిల్ రావిపూడి స్కూల్‌కు దూరంగా ఉందే అనుమానం కలుగక మానదు. సీరియస్ సబ్జెక్ట్‌లో వినోదాన్ని జొప్పించిన తీరు అతడి ప్రతిభకు అద్దం పట్టింది. పూర్తిగా ఫ్యాన్స్‌కు పండగ వాతావరణం కల్పించడానికే సరిలేరు నీకెవ్వరు రూపొందించారనేది తెరపైన కనిపిస్తుంది. మహేష్ ఇమేజ్‌కు తగినట్టుగా దేశభక్తి అంచాలతో హార్ట్ టచ్ చేస్తారని చప్పవచ్చు. పాత వాసన ఓ పట్టాన వదలదని చెప్పడానికి సుబ్బరాజు‌, వెన్నల కిషోరను కథలోకి లాక్కు రావడం ఓ ఫ్లోను దెబ్బ తీసిందనే చెప్పవచ్చు. ఓవరాల్‌గా సంక్రాంతి బరిలో ఓ మంచి సినిమాను అందించాలనే తాపత్రయం అనిల్‌లో కనిపిస్తుంది.

  మహేష్ బాబు ఫెర్ఫారెన్స్

  మహేష్ బాబు ఫెర్ఫారెన్స్

  మహేష్‌బాబుకు అజయ్ పాత్ర టైలర్ మేడ్ క్యారెక్టర్. ఆర్మీ ఆఫీసర్‌గా తెరపైన ఆకట్టుకోవడమే కాకుండా తన మార్కు మేనరిజంతో ఆకట్టుకొన్నాడని చెప్పవచ్చు. మాస్, క్లాస్, ఎమోషనల్, యాక్షన్, కామెడీ అంశాలను అలవోకగా తెరపైన పండించారు. మహేష్ కామెడీ టైమింగ్ అదిరిపోయిందనే చెప్పవచ్చు. ఒక ట్రైన్ ఎపిసోడ్‌లో మహేష్ హవభావాలు ఫన్నీగా ఉంటాయి. రష్మిక, మహేష్‌ కెమిస్ట్రీ కొత్తగా ఉంటుంది. గత సినిమాలు సామాజిక సందేశాలతో ఉండటం, ఆ ఇమేజ్‌ నుంచి బయటపడటానికి ఫుల్ కమర్షియల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఎంచుకోవడం తన టేస్ట్‌కు అద్దం పట్టింది. అజయ్ పాత్రతో మహేష్‌లో మ్యాజిక్ కనిపిస్తుంది.

  Sarileru Neekevvaru Movie Twitter Review
  ప్రొఫెసర్‌ భారతీగా విజయశాంతి

  ప్రొఫెసర్‌ భారతీగా విజయశాంతి

  విజయశాంతి భారతీగా ప్రొఫెసర్‌ పాత్రలో హుందాగా కనిపించింది. కాలేజీ ఎపిసోడ్‌లో పవర్‌ఫుల్ ఎంట్రీతో ఫ్యాన్స్ చేత చప్పట్లు కొట్టించింది. ప్రకాశ్ రాజ్‌తో కొన్ని సీన్లలో పోటాపోటీగా నటించింది. మీ ఇంటికి ఓ మగాడు అవసరం అంటూ చెప్పిన డైలాగ్స్ కేక పెట్టించింది. అలాగే దేశం కోసం కన్న బిడ్డలు ప్రాణత్యాగం చేస్తే పడే తల్లి ఆవేదనను తెరపైన బ్రహ్మండంగా పండించింది. పలు సీన్లలో మహేష్‌తో కలిసి జోష్ పెంచింది.

  ఊరమాస్‌గా రష్మిక మందన్న

  ఊరమాస్‌గా రష్మిక మందన్న

  ఇక ఇప్పటి వరకు క్లాస్ పాత్రలతో కనిపించిన రష్మిక మందన్న సంస్కృతిగా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకొనేందుకు గ్లామర్‌ పంట పండించింది. కొన్ని సీన్లలో చూపించిన రొమాంటిక్ దూకుడు చూస్తే రష్మిక కొత్తగా అనిపించింది. చిలిపి అమ్మాయిగా మహేష్‌ ప్రేమ కోసం వెంటపడే అమ్మాయిగా ఆకట్టుకొంది. మహేష్‌తో ఊరమాస్ పాటల్లో వేసిన స్టెప్పులు బాగున్నాయి. కమర్షియల్ హీరోయిన్‌గా ఎస్టాబ్లిష్ అయ్యేందుకు ఏమేమీ చేయాలో అవన్నీ చేసింది. ట్రైన్ ఎపిసోడ్‌లో ఇరుగదీసింది. తమన్నా గెస్ట్ ఎంట్రీతో అదరగొట్టింది. డింగ్ డాంగ్ సాంగ్‌లో మహేష్‌తో కలిసి తెరపైన మెరిసింది. తమన్నాకు పెద్దగా సన్నివేశాలు లేకపోయినా.. ఫీల్‌గుడ్‌కు ఆస్కారం ఉన్న సీన్‌లో కనిపించింది. చాలాకాలం తర్వాత తెరపైన కనిపించిన సంగీత మంచి మేనరిజంతో ఆకట్టుకొన్నది. ఇక హరితేజ, ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.

  సీనియర్ నటుల యాక్టింగ్

  సీనియర్ నటుల యాక్టింగ్

  సీనియర్ ఆర్మీ ఆఫీసర్‌గా రాజేంద్ర ప్రసాద్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్‌లో నటించాడు. మహేష్ బాబుతో కలిసి త్రూ అవుట్ సినిమాలో వినోదాన్ని పంచారు. రావు రమేష్ మరోసారి సరికొత్తగా తన మార్కును ప్రదర్శించారు. ప్రకాశ్ రాజ్‌కు ఇలాంటి విలన్ పాత్రలు కొత్తేమి కాదు. కాకపోతే నాగేంద్రగా పవర్‌పుల్ విలనిజాన్ని పండించారు. అలాగే అజయ్ తనదైన శైలిలో విలనిజాన్ని పండించాడు అలాగే సీతారామరాజు ఎపిసోడ్‌కు సంబంధించి మంచి హావభావాలను ప్రదర్శించాడు.

  మ్యూజిక్, ఎడిటింగ్

  మ్యూజిక్, ఎడిటింగ్

  టెక్నికల్‌ విషయాలకు వస్తే.. దేవీ శ్రీ ప్రసాద్ మాస్ పాటలు మైండ్ బ్లాక్, డాంగ్ డాంగ్ పాటలు మాస్‌గా ఉంటే.. హీ ఈజ్ సో క్యూట్ అనే పాట డ్యూయెట్‌గా ఆలరించింది. మైండ్ బ్లాక్, డాంగ్ డాంగ్ పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఇక ఎమోషనల్‌గా సరిలేరు నీకెవ్వరు ఆంథెమ్, సూర్యుడు చంద్రుడివో బాగున్నాయి. రత్నవేలు సినిమాటోగ్రఫి నెక్ట్స్ లెవెల్. తమ్మిరాజు ఎడిటింగ్ ఫర్వాలేదు. సెకండాఫ్‌లో కొన్ని సీన్లు చాలా లెంగ్తీగా అనిపిస్తాయి. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి.

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  సరిలేరు నీకెవ్వరు చిత్రం ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రూపొందించారు. క్లాలిటీ, కంటెంట్ విషయంలో రాజీ పడలేదని విషయం ప్రతీ ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. కాకపోతే సెకండాఫ్‌లో కథపై కొంత కసరత్తు జరిగి ఉంటే మరింత మంచి ఫలితం వచ్చే అవకాశం ఉండేది. ఈ చిత్రానికి రికార్డు ఓపెనింగ్స్ రావడం గ్యారెంటి.

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించే సైనికుల జీవితాలను హైలెట్ చేస్తూ రూపొందిన సరిలేరు నీకెవ్వరు చిత్రం ఓ ఫ్యాక్షన్ చిత్రంగా మారింది. మహేష్ బాబు, విజయశాంతి, ప్రకాశ్ రాజ్ ఫెర్ఫార్మెన్స్‌తో పాటు రష్మిక గ్లామర్, పదునైన డైలాగ్స్ సినిమాలో ఆకట్టుకొనే అంశాలు. దేశభక్తిని గుర్తు చేసే విధంగా రాసుకొన్న సన్నివేశాలు ఫ్యాన్స్‌ను సంతృప్తిపరుస్తాయి. కాకపోతే ఫస్టాఫ్ మంచి ఊపుతో సాగిన ఈ చిత్రం సెకండాఫ్ కొచ్చే సరికి నీరసపడినట్టు కనిపిస్తుంది. కాకపోతే ప్రీ క్లైమాక్స్‌లో కొన్ని సీన్లు మళ్లీ జోష్‌ను నింపేలా చేస్తాయి. ఓవరాల్‌గా ఫ్యాన్స్‌ను మాత్రం ఆలరించే విధంగా ఉన్న ఈ చిత్రం సంక్రాంతి రేసులో రిలీజైనందున భారీ ఓపెనింగ్స్ సాధించడం ఖాయం. ఇక బీ, సీ సెంటర్లలో ఇతర సినిమాల పోటీని తట్టుకొని నిలకడగా కలెక్షన్ల సాధిస్తే రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  ప్లస్ పాయింట్

  మహేష్ బాబు ఫెర్ఫార్మెన్స్

  యాక్షన్ ఎపిసోడ్స్

  ట్రైన్ జర్నీలో కామెడీ ఎపిసోడ్

  ఇంటర్వెల్ బ్యాంగ్

  ఓవరాల్'గా ఫస్టాఫ్

  మైనస్ పాయింట్స్

  సెకండాఫ్‌లో కొన్ని ఎపిసోడ్స్

  వెన్నెల కిషోర్, సుబ్బరాజు కామెడీ

  సెకండాఫ్‌లో సాగదీత

  క్లైమాక్స్

  తెర వెనుక, తెర ముందు

  తెర వెనుక, తెర ముందు

  నటీనటులు: మహేష్ బాబు, విజయ్ శాంతి, ప్రకాశ్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, రష్మిక మందన్న, అజయ్, హరితేజ తదితరులు

  కథ, దర్శకత్వం: అనిల్ రావిపూడి

  నిర్మాతలు: అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు

  సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్

  సినిమాటోగ్రఫి: ఆర్ రత్నవేలు

  ఎడిటింగ్: తమ్మిరాజు

  బ్యానర్లు: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్

  నిడివి: 169 నిమిషాలు

  రిలీజ్ డేట్: 2020-01-11

  English summary
  Sarileru neekevvaru review: Mahesh Babu Sarileru Neekevvaru movie going with sensational records before release.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X