Saripodhaa Sanivaaram Review: సరిపోదా శనివారం మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: నాని, ప్రియాంక అరుళ్ మోహన్, ఎస్‌జే సూర్య, సాయికుమార్ తదితరులు
రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
నిర్మాతలు: డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి
బ్యానర్: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్
మ్యూజిక్: జేక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫి: మురళీ జీ
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
రిలీజ్ డేట్: 2024-08-27

సోకులాపురం గ్రామానికి చెందిన సూర్య (నాని)కి చిన్నతనం నుంచే కోపం ఎక్కువ. అయితే తన కొడుకులోని కోపాన్ని తగ్గించడానికి కొన్ని ఆంక్షలు విధిస్తుంది. అయితే తన కుమారుడికి ఏదో విషయం చెప్పాలనే ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఆమె తాను చెప్పాలనుకొన్న విషయం చెప్పలేకపోయి.. ప్రాణాలు కోల్పోతుంది. ఇదిలా ఉండగా, తన చిన్ననాటి స్నేహితురాలు చారులత అంటే చాలా ఇష్టం.కానీ ఓ కారణంగా ఊరి వదిలి వెళ్లినా ఆమెను ప్రేమిస్తూనే ఉంటాడు. ఇక సోకులాపురంలోనే దయానంద్ (ఎస్‌జే సూర్య), కుర్మానంద్ (మురళీశర్మ) ఇద్దరు అన్నదమ్ములు తమ ఆస్తి కోసం ఒకరిపై మరొకరు కత్తులు దూసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకొంటుంటారు. అయితే దయానంద్, కూర్మానంద్ మధ్య నాని దూరాల్సి వస్తుంది.

Saripodhaa Sanivaaram Review in Telugu  Nani  Vivke Athreya shows their Mark

అయితే తన తల్లి ఏం చెప్పాలనుకొన్నదనే విషయం సూర్యను ఎలా వెంటాడింది? శనివారం రోజునే తన కోపాన్ని ఎందుకు ప్రదర్శించాలని అనుకొంటారు? ఇన్స్‌పెక్టర్‌ దయానంద్, రాజకీయ నేత కుర్మానంద్ మధ్య వైరం ఎలా సాగింది? సోకులాపురం పోలీస్ స్టేషన్‌లో చారులత (ప్రియా అరుళ్ మోహన్) కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఆమెకు ఎదురు అయ్యాయి. చారులతనే తన చిన్ననాటి స్నేహితురాలు అని సూర్యకు తెలిసిందా? దయానంద్‌ను శనివారం ఎందుకు దండించాలని అనుకొంటాడు? దయ, కూర్మానంద్ మధ్య గొడవలకు ఎలా పుల్ స్టాప్ పడింది. తన తల్లి చెప్పాలనుకొన్న విషయం చివరకు సూర్యకు బోధపడిందా? అనే ప్రశ్నలకు సమాధానమే సరిపోదా శనివారం సినిమా కథ.

వివేక్ ఆత్రేయ దర్శకుడిగా తాను రాసుకొన్న పాయింట్ బాగుంది. మదర్ సెంటిమెంట్‌ను జోడించి..యాక్షన్ డ్రామాగా డిజైన్ తీరుకూడా బాగుంది. ఈ యాక్షన్ డ్రామాలో హ్యుమర్, ఫన్ బ్యాక్ డ్రాప్‌తో పాత్రలను తీర్చిదిద్దిన విధానంగా ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా ఉండటం పాజిటివ్ విషయం. కానీ చెప్పిన విషయాన్నే సాగదీసి చెప్పడం.. సీన్లను లాగదీసి కథను చెప్పాలనుకోవడమే బాగలేదనిపిస్తుంది. కమర్షియల్ సినిమాలో లాజిక్కులు వెతుకొద్దనే ఫార్మాలాను పక్కన పెడితే.. కొంతైనా సమంజసంగా ఉంటే బాగుంటుందనిపిస్తుంది. అంటే సుందరానికి సినిమా ఫలితం నేర్పిన పాఠం వల్ల చాలా తన స్టోరీ నరేషన్‌లో మార్పు కనిపించిందనే చెప్పాలి.

ఫస్టాప్‌ను మదర్ సెంటిమెంట్‌తో ఆరంభించి.. తండ్రి చేత క్యారెక్టర్ చెప్పించిన రొటీన్ ఫార్మాలా రెగ్యులర్‌గా ఉన్నప్పటికీ.. ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్లడానికి ఉపయోగపడిందనే చెప్పాలి. ఇక నాని యాక్షన్ ఎపిసోడ్‌తో క్యారెక్టర్‌ను ఎలివేట్ చేసిన విధానం బాగుంది. ఫస్టాఫ్ లెంగ్తీగా సాగదీసినట్టు అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఎప్పుడు పడుతుందా? అనే కోరిక కలిగే సమయంలోనే ఫస్టాప్‌ను దర్శకుడు ముగించేశాడు. ఇక సెకండాఫ్‌లో యాక్షన్ డ్రామా పీక్స్‌కు తీసుకెళ్లాడు. అయితే ఆ డ్రామాలో రొమాన్స్ పరిధి పెంచి ఉంటే కొంత రిలీఫ్ ఉండేదనిపిస్తుంది. కాఫీ, టీల సీన్, పబ్‌లో యాక్షన్ ఎపిసోడ్, కొన్ని సెంటిమెంట్ సీన్లు ఈ సినిమాకు ప్లస్ పాయింట్.

Saripodhaa Sanivaaram Review in Telugu  Nani  Vivke Athreya shows their Mark

ఇక నాని ఫ్యామిలీ హీరో నుంచి పక్కనకు వచ్చి మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో సూర్య క్యారెక్టర్ ఒకటి. సూర్యగా నాని ఎప్పటిలానే ఎమోషన్స్‌కు ఎమోషన్స్, సెంటిమెంట్‌కు సెంటిమెంట్ చక్కగా పండించారు. యాక్షన్‌ సన్నివేశాల్లో తన మజిల్ పవర్ చూపించే ప్రయత్నం చేశారు. సినిమా భారాన్ని తన భుజాల మీద వేసుకొని.. ఇతర పాత్రల ద్వారా కథ చెప్పించడం కొత్తగా ఉంటుంది. ప్రియాంక అరుల్ మోహన్‌కు చారులతగా ప్రమోషన్ లభించినట్టే.. పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో ఒదిగిపోయారు. ఇక ఎస్‌జే సూర్య, మురళీ శర్మ మరోసారి తన క్యారెక్టర్లతో కామెడీ, యాక్షన్‌ను భారీగా పండించారు.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఈ సినిమాకు మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదనపు బలం. జేక్స్ బిజోయ్ యాక్షన్ సన్నివేశాలకు మూడ్‌ను క్రియేట్ చేసే విధంగా బీజీఎంతో రఫ్ ఆడించాడు. కొన్ని చోట్ల అవసరం ఆ రేంజ్ మ్యూజిక్ అవసరం లేదనిపిస్తుంది. ఇక కథ డిమాండ్ చేసిన మేరకు మురళీ జీ సినిమాటోగ్రఫి తమవంతు రోల్‌ను పోషించింది. స్లమ్ సీన్లు సినిమా మూడ్‌ను క్రియేట్ చేస్తే, యాక్షన్ ఎపిసోడ్స్ ఉత్కంఠను రేపేలా ఉన్నాయి.కార్తీక శ్రీనివాస్‌ ఎడిటింగ్ విషయంలో చాలా ఉదారం వ్యవహరించారనే అనిపిస్తుంది. ఆయనకు మరింత స్వేచ్చ లభించి ఉంటే.. మరిన్నీ కత్తెరలు పడాల్సి ఉండేవనిపిస్తుంది. దానయ్య అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ఇక సరిపోదా శనివారం సినిమా మదర్ సెంటిమెంట్‌తో కూడిన పక్కా యాక్షన్ డ్రామా. రెగ్యులర్, రొటీన్ కథ అయినప్పటికీ.. మేకింగ్, ట్రీట్‌మెంట్ ఆకట్టుకొనేలా ఉంటుంది. కథ మొదలైన కొద్ది సేపటికే సినిమా డిస్టినేషన్ ఏమిటో సాధారణ ప్రేక్షకుడికి అర్దం అవుతుంది. అయితే ఆ మధ్యలో వచ్చే సన్నివేశాలు, ఎపిసోడ్స్ ఒడిదుడుకులతో సాగుతుంది. ఓవరాల్‌గా సినిమాను చూస్తే కొత్తగా ఏమీ అనిపించదు. కానీ సీన్ల ప్రకారం చూస్తే ఫన్, ఎమోషన్స్ మెప్పిస్తాయి. లెంగ్త్, కొత్తదనం లేదనే విషయాలను పక్కన పెడితే.. రెండు గంటల 50 నిమిషాలపాటు ఎంజాయ్ చేయడానికి చాలా అంశాలు ఉన్నాయి. మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న సినిమా ఇది. ఫ్యామిలీ అంతా చూడదగినట్టు ఉంది. ఇక నాని సినిమా రేంజ్‌కు సరిపోయిందా? అని అంటే.. సరిపుచ్చుకొనే వారికి సరిపోతుంది. సరి పెట్టుకోలేని వాళ్లకు సరిపోలేదనిపిస్తుంది. ఈ రెండు గ్రూపుల్లో మీరు ఎవరో థియేటర్‌కు వెళ్లి తేల్చుకోండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X