Saripodhaa Sanivaaram X Review: నాని 100 కోట్ల హిట్ కొట్టాడా? వివేక్ ఆత్రేయకు సక్సెస్ లభించిందా?

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైనర్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించిన చిత్రం సరిపోదా శనివారం. అంటే సుందరానికి సినిమా ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో నాని, ప్రియాంక అరుల్ మోహన్, ఎస్‌జే సూర్య నటించారు. ఈ చిత్రం ఆగస్టు 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా గురించి నెటిజన్లు, ప్రేక్షకులు, అభిమానులు ఎలాంటి అనుభూతిని పొందారు. సోషల్ మీడియాలో వారు ఎలా స్పందించారు అనే విషయంలోకి వెళితే..

అంటే సుందరానికి సినిమా ఫ్లాప్ తర్వాత నాని, వివేక్ ఆత్రేయ కలిసి రూపొందించిన చిత్రం సరిపోదా శనివారం. ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య విలన్‌గా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగా, అందాల భామ ప్రియాంక అరుళ్ మోహన్ కానిస్టేబుల్‌గా ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ సినిమాను సుమారుగా 60 కోట్ల రూపాయలతో నిర్మించారు.

Saripodhaa Sanivaaram twitter Review

ఫస్టాఫ్ అంత గ్రేట్‌గా లేదు. కొన్ని సీన్లు సాగదీసినట్టు ఉన్నాయి. సెకండాఫ్ ఒక్కటే బాగుంది. అదే సినిమాను కాపాడింది అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

సరిపోదా శనివారం రెగ్యులర్, కమర్షియల్ ఫార్మాట్ మూవీ. యాక్షన్ పార్ట్, కాన్సెప్ట్ ఈ సినిమాకు పాజిటివ్ అంశాలు. ఎస్‌జే సూర్య పెర్ఫార్మెన్స్, యాక్షన్ సీన్లు, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ ఎక్సలెంట్‌గా ఉన్నాయి. ఇక జేక్స్ బిజోయో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కుత్త పగిలేలా ఉన్నాయి అని ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

సరిపోదా శనివారం సినిమా చూశాను. ప్రతీ సీన్‌లోను డైరెక్టర్ కసి కనిపించింది. ఎవరైతే ట్రోల్ చేశారో.. వాళ్లతోనే ఎలివేషన్స్ వేయించాడు. ఇంటర్వెల్ సీక్వెన్స్, సెకండాఫ్‌లో వచ్చే సబ్ సీన్ కేక పెట్టించాయి. తప్పకుండా థియేటర్లలో చూడండి అని మరో నెటిజన్ అన్నాడు.


సరిపోదా శనివారం మూవీ చూశాను. స్క్రీన్ ప్లే, వివేక్ ఆత్రేయ అంత గొప్పగా, అంచనాలకు తగినట్టు లేదు. ఫస్టాఫ్ ఎస్‌జే సూర్య,నాని పెర్ఫార్మెన్స్ థియేటర్లలో మిస్ కావొద్దు. ఇంటర్వెల్ బ్యాంగ్, పోతారు మొత్తం పోతారు బాగుంది. సెకండాఫ్ కొంత సాగదీసినట్టు ఉండటంతో బోరింగ్ అనిపిస్తుంది. మాస్ ఎంటర్‌టైన్‌మెంట్, బీజీఎం బాగుంది అని ఓ నెటిజన్ తన రివ్యూను చెప్పారు.

నానికి హ్యాట్రిక్ మూవీ. ఇంట్రోడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ ఈ సినిమాకు ప్లస్. నాని, ఎస్‌జే సూర్య పెర్ఫార్మెన్స్ బాగున్నాయి, జేక్స్ బిజోయ్ బీజీఎం అదరగొట్టాడు. రొటీన్ స్టోరీ, ఫ్లాట్ స్క్రీన్ ప్లే, ఓవరాల్‌గా ఎబౌ యావరేజ్ కమర్షియల్ డ్రామా అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ఇక నాని నటించిన ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌ను భారీగా దేశవ్యాప్తంగా చేశారు. నాని సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రమోషన్స్‌తో ఆకట్టుకోవడంతో అన్ని భాషల్లో భారీ బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాపై మిక్స్‌డ్ రియాక్షన్ తొలుత వస్తున్నది.

నాని సినిమాపై విజయ్ దేవరకొండ ట్రెండ్స్ స్పందిస్తూ.. నేచురల్ స్టార్ నానికి భారీ విజయం దక్కాలి. బాక్సాఫీస్‌ను హడలెత్తించాలి. నా బిగ్ బ్రదర్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోవాలి. నటీనటులు, సాంకేతిక నిపుణులకు నా నుంచి, నా ఫ్యాన్స్ నుంచి ఆల్ ది బెస్ట్ అని ట్వీట్ చేశారు.

ప్రభాస్ ట్రెండ్స్ ట్వీట్ చేస్తూ.. చాలా కాలంగా ఎదురు చూస్తున్న సరిపోదా శనివారం చిత్రం విడుదలైంది. ఈ సినిమా ఘనంగా ఆడాలి. భారీ విజయం అందుకోవాలి అని ప్రభాస్, ఆయన అభిమానుల తరుపున కోరుకొంటున్నాం. నానికి బ్లాక్ బస్టర్ విజయం లభించాలి. నాని కోరుకొన్నట్టు 100 కోట్ల బొమ్మ కావాలి అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X