Sarkaaru Noukari Review సామాజిక సందేశంతో.. సింగర్ సునీత కొడుకు ఎలా చేశాడు? సర్కారు నౌకరి సమీక్ష

Rating:
2.5/5

నటీనటులు: ఆకాశ్, భావన, తనికెళ్ల భరణి, సుధాకర్ రెడ్డి, సమ్మెట గాంధీ, సతీష్ దాసరి, సూర్య, మధులత, మణిచందన, మహాదేవ్ తదితరులు
దర్శకత్వం: గంగనమోని శేఖర్
నిర్మాత: కే రాఘవేంద్రరావు బీఏ
బ్యానర్: ఆర్కే టెలి ఫిలిం
సినిమాటోగ్రఫి: శేఖర్ గంగనమోని
ఆర్ట్: రవికుమార్ గుర్రమ్
మ్యూజిక్: సురేష్ బొబ్బిలి
రిలీజ్ డేట్: 2024-01-01

మహబూబ్‌నగర్ జిల్లాలోని ఓ గ్రామంలో సర్కారు నౌకరి ఉద్యోగం సంపాదించిన గోపాల్ (ఆకాశ్) సత్య (భావన)ను వివాహం చేసుకొంటాడు.ఆరంభంలో గోపాల్, సత్య దాంపత్య సాఫీగానే ముందుకెళ్తుంది. హెల్త్ అసిస్టెంట్‌ ఉద్యోగం కారణంగా గ్రామస్థులకు నిరోధ్ వాడకం గురించి చెబుతూ వాటిని పంచుతుండటంతో తన భర్త ఉద్యోగం సత్యకు అవమానంగా మారుతుంది. దాంతో సర్కారు నౌకరిని మానేసి బిజినెస్ పెట్టుకోమని సలహా ఇస్తుంది. కానీ భార్య మాటలు పట్టించుకోకుండా తన ఉద్యోగానికే ప్రాధాన్యం ఇస్తాడు. దాంతో గర్భంతో ఉన్న సత్య మెట్టింటి గడపదాటి.. కోపంతో పుట్టింటికి వెళ్లిపోతుంది.

హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాన్నే గోపాల్ ఎందుకు ఎంచుకొన్నాడు? పై అధికారులు, భార్య, గ్రామస్థులు అవమానించినా అదే ఉద్యోగాన్ని ఎందుకు చేశాడు? భార్య వదిలేసి వెళితే గోపాల్ ఎలా స్పందించాడు? తన స్నేహితుడు శివ (మహాదేవ్)కు ఎదురైన సమస్య ఏమిటి? శివ, గంగ (మధులత) పెళ్లికి ఎలాంటి విషయం అడ్డంకిగా మారింది అనే ప్రశ్నలకు సమాధానమే సర్కారు నౌకరి సినిమా కథ.

Sarkaaru Noukari Telugu Movie Review and Rating: Singer Sunita Son Akash Debut movie

పాపులర్ సింగర్ సునీత తన కుమారుడిని సినిమా పరిశ్రమకు పరిచయం చేస్తుండగా సర్కారు నౌకరీ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు నిర్మించడం విశేషం. రాఘవేంద్రరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారంటే ఏదో కొత్త పాయింట్ ఉందనే అభిప్రాయ కలుగుతుంది. అయితే పాయింట్ డిఫరెంట్ అయినప్పటికీ.. నేటితరం ఆడియెన్స్ అభిరుచికి కాస్త దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే ఈ సినిమాలోని పాత్రల ఎమోషన్స్ మాత్రం బాగా పండాయి. కొత్తవాళ్లైనప్పటికీ నటీనటులు ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. చాలా సీన్లను దర్శకుడు శేఖర్ మనసుపెట్టి చిత్రీకరించారనిపిస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే.. ఆకాశ్ తొలి సినిమా అయినా ఎక్కడా తడబాటు కనిపించలేదు. పాత్రకు తగినట్టు గెటప్, తన క్యారెక్టర్‌కు తగినట్టు హవభావాలు, యాటిట్యూడ్‌ను చక్కగా చూపించాడు. అనుభవం పెరిగిన కొద్ది మంచి నటుడు అవ్వడానికి చాన్స్ ఉందనిపించింది. సత్య తన పాత్రలో ఒదిగిపోయిన నటించిన విధానం అందర్నీ ఆకట్టుకొంటుంది. గోపాల్ భోజనం చేస్తున్న సమయంలో నిరోధ్ విసిరికొట్టిన సీన్‌లో హీరో, హీరోయిన్లు బాగా నటించారు.

Sarkaaru Noukari Telugu Movie Review and Rating: Singer Sunita Son Akash Debut movie

సర్కారు నౌకరీ సినిమాలో తనికెళ్ల భరణి, శ్రీనివాసరావు, సమ్మెట గాంధీ, సుధాకర్ రెడ్డి, ఇతర నటీనటులు మధులత, మహాదేవ్ తమ పాత్రల పరిధి మేరకు ఫర్వాలేదనిపించారు. తనికెళ్ల భరణి తన మార్కు హాస్యంతో నవ్వించారు.. అలాగే తనదైన శైలిలో నటనతో ఎమోషనల్‌గా మారుస్తారు.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్‌గా, ఇంకా పలు విభాగాలను పర్యవేక్షిస్తూ గంగనమోని శేఖర్ తన ప్రతిభను చాటుకొన్నారు. పల్లె అందాలను, మట్టి మనుషుల గుభాళింపును తెరపైన చక్కగా చూపించారు. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

Sarkaaru Noukari Telugu Movie Review and Rating: Singer Sunita Son Akash Debut movie

ఎమోషన్స్, ఫ్యామిలీ వ్యాల్యూస్, గ్రామీణ ప్రాంతా వాసులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలన్న అంశాలతో తెరకెక్కిన చిత్రం సర్కారు నౌకరి. అయితే యానిమల్, సలార్ లాంటి విభిన్నమైన కంటెంట్ ఉన్న సినిమాలు వస్తున్న ఈ రోజుల్లో ఈ సినిమా కథ నేటితరం ప్రేక్షకులకు దూరంగా ఉందనే చెప్పాలి. కాకపోతే కథలో నేటీవిటి ఉంది. మన ఊర్లో జరిగే కథలు, సంఘటనలు గుర్తుకు వస్తాయి. కొత్త యాక్టర్లు నటించే సినిమాలను చూసి ఆదరించే వారికి ఈ సినిమా నచ్చవచ్చు. నటీనటులు ఏ మాత్రం నిరాశపరచరు. బీ,సీ సెంటర్ల ప్రేక్షకులకు కనెక్ట్ అయితే సినిమా భారీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X