For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sarkaru Vaari Paata Review నాసిరకం కథ.. పేలవమైన కథనం..మహేష్‌ ఇమేజ్‌కు దూరంగా!

  |

  Rating:
  2.5/5
  Star Cast: మహేష్ బాబు, కీర్తి సురేష్, నదియా, సముద్రఖని, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు
  Director: పరుశురాం పేట

  Sarkaru Vaari Paata Review మూవీ లో హైలైట్స్ ఇవే | Filmibeat Telugu

  టాలీవుడ్‌లో అగ్ర నటుల సినిమాల సందడిలో భాగంగా మహేష్ బాబు నటించిన సర్కారు వారీ పాట చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గీతా గోవిందం లాంటి సినిమాను అందించిన పరుశురాం దర్శకుడు కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రమోషన్‌లో కూడా సినిమా గురించి ఎక్కువగా బిల్డప్ ఇవ్వడంతో సర్కారు వారీ పాటపై అంచనాలు రెండితులు పెరిగాయి. అయితే ఇలాంటి అంశాల మధ్య వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని మిగిల్చిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే.. కథ, కథనాలను సమీక్షించాల్సిందే.

  సర్కారు వారీ పాట కథ..

  సర్కారు వారీ పాట కథ..

  చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన మహేష్ (మహేష్ బాబు) అనాధాశ్రమంలో పెరిగి అమెరికాలో వడ్డీ వ్యాపారీగా సెటిల్ అవుతాడు. బాకీ తీర్చకుంటే మహేష్ ముక్కుపిండి డబ్బు వసూలు చేస్తాడు. డబ్బు విషయంలో కఠినంగా ఉండే మహేష్.. ఎంపీ రాజేంద్రనాథ్ (సముద్రఖని) కూతురు కళావతి (కీర్తి సురేష్)ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు.

  జూదానికి వ్యసనమై అప్పుల్లో కూరుకుపోయిన కళావతి తన అవసరాల కోసం మహేష్‌ను మభ్యపెట్టి అప్పుగా డబ్బు తీసుకొంటుంది. కానీ ఆమె నిజ స్వరూపం తెలిసిన మహేష్ డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తాడు.

  కథ, కథనాల్లో ట్విస్టులు

  కథ, కథనాల్లో ట్విస్టులు

  మహేష్‌ను కళావతి ఎలాంటి మాటలతో మభ్యపెట్టి బుట్టలో వేసుకొన్నది? కళావతి చేసిన 10 వేల డాలర్ల బాకీని వసూలు చేసుకోవడానికి మహేష్ ఎందుకు వైజాగ్ వచ్చాడు? వైజాగ్‌లో ఎంపీ రాజేంద్రనాథ్‌తో మహేష్ వైరుధ్యం పెంచుకొంటాడు? తన దారికి అడ్డువస్తున్న మహేష్‌ను రాజేంద్రనాథ్ ఎలా అడ్డు తొలగించుకోవాలనుకొంటాడు.

  బ్యాంక్ రుణాల ఎగవేత కేసులో మేనేజర్ (నదియా)ను ఎందుకు అరెస్ట్ చేస్తారు? బ్యాంక్ మేనేజర్‌‌కు మహేష్ ఎందుకు అండగా నిలిచాడు? బ్యాంక్ రుణాన్ని ఎగవేసిన ఎంపీ రాజేంద్రనాథ్‌కు మహేష్ ఎలాంటి గుణపాఠం చెప్పాడు అనే ప్రశ్నలకు సమాధానమే సర్కారు వారీ పాట సినిమా కథ.

  ఫస్టాఫ్‌ ఎలా ఉందంటే?

  ఫస్టాఫ్‌ ఎలా ఉందంటే?

  మహేష్ తల్లిదండ్రుల (నాగబాబు) ఆత్మహత్యతో సర్కారు వారీ పాట సీరియస్‌ నోట్‌తో ప్రారంభమవుతుంది. కథకు ఫ్లాష్ బ్యాక్ బలమైన లింక్ ఉందనే ఫీలింగ్‌ను కల్పించడంలో దర్శకుడు పరుశురాం మంచి ప్రయత్నమే చేశాడు. ఆ తర్వాత అమెరికాలో మహేష్ వడ్డీ వ్యాపారం, కాసినోలో జూదమాడే కళావతి అంశాలు చకచకా సాగిపోతాయి. రిలీజ్‌కు ముందు పెంచిన అంచనాల కారణంగా కళావతి, మహేష్ లవ్ ట్రాక్ మరీ రొటీన్‌గా సాగడం కథలో విషయం లేదనేది మెల్లగా బోధపడుతుంది.

  కానీ వెన్నెల కిషోర్ కారణంగా లవ్ ట్రాక్‌ వినోదంగా మారడం కాస్త ఉపశమనంగా అనిపిస్తుంది. వైజాగ్ చేరిన తర్వాత ఎంపీ రాజేంద్రనాథ్, మహేష్ మధ్య బలమైన సన్నివేశాలు లేకపోవడంతో మరీ బోర్‌గా ఫస్టాఫ్ ముగుస్తుంది. కనీసం ఇంటర్వెల్ బ్యాంగ్‌కు సరైన ఎపిసోడ్ లేకపోవడం మరీ చప్పగా ఫస్టాఫ్ అనిపిస్తుంది.

  సెకండాఫ్ నిరాశజనకంగా

  సెకండాఫ్ నిరాశజనకంగా

  సెకండాఫ్‌లో బ్యాంక్ రుణాల ఎగవేత అనే సీరియస్ టాపిక్‌ను ఎత్తుకోవడంతో కథ కొత్త మలుపు తిరుగుతుందని ఆశపడిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. బలహీనమైన విలనిజం.. మహేష్‌కు తప్ప మరో బలమైన క్యారెక్టర్‌ లేకపోవడంతో సినిమా అంతా ఏకపక్షంగా మారిందనే ఫీలింగ్ కలుగుతుంది. కథకు మహేష్ హీరో, విలన్‌గా మారాడా అనే అనుమానం కలుగుతుంది. క్లైమాక్స్‌లో ఊకదంపుడు ఉపన్యాసాలు, సామాజిక సందేశాలతో సాదాసీదా ముగుస్తుంది. నదియా, మహేష్‌ మధ్య ఎపిసోడ్‌ ఎమోషనల్ ముగిస్తే కథకు న్యాయం చేసినట్టు అయ్యేదనే ఫీలింగ్ కలుగుతుంది.

  దర్శకుడు పరుశురాం తడబాటు

  దర్శకుడు పరుశురాం తడబాటు

  దర్శకుడు పరుశురాం ఎంచుకొన్న పాయింట్‌ బలమైనదే. కానీ తెర మీద సన్నివేశాలను పండించడంలో ఆయన తడబాటు స్పష్టంగా కనిపిస్తుంది. ఫన్, సీరియస్ అంశాల మధ్య ఊగిసలాట కనిపిస్తుంది. దర్శకుడి ఫోకస్ అంతా మహేష్‌పైనే ఉండటంతో మిగితా కారెక్టర్లను గాలికి వదలేశాడానే ఫీలింగ్ కలుగుతుంది. దేశంలో బ్యాంకులు ఎదుర్కొంటున్న సీరియస్ ఇష్యూను సరిగా డీల్ చేయలేకపోవడంతో సర్కారు వారీ పాట కాస్త సర్కారు వారీ వేటగా మారిందనిపిస్తుంది. సర్కారు వారీ పాట సినిమా చూసిన తర్వాత పెద్ద హీరోల స్టార్‌డమ్, ఇమేజ్‌ను హ్యాండిల్ చేయగలడా? అనే అనుమానం కలగకమానదు.

  మహేష్ వన్ మ్యాన్ షో

  మహేష్ వన్ మ్యాన్ షో


  సర్కారు వారీ పాట ద్వారా మహేష్ కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిన విషయాలు ఏమీ లేవు. తన ఇమేజ్, క్రేజ్‌కు తగిన కథ, పాత్ర పడితే మహేష్ చెలరేగిపోతాడనే విషయం పలు మార్లు రుజువైంది. ఈ సినిమా విషయంలో కథ, కథనాలు చాలా పేలవంగా ఉన్నప్పటికి.. సినిమాను కాపాడేందుకు సూపర్ స్టార్ విశ్వప్రయత్నాలు చేశాడు. వన్ మ్యాన్ షో అని చెప్పాలనిపించినా మహేష్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాలనే ప్రయత్నాలు ఫలించలేదనే చెప్పాలి. డైలాగ్ డెలీవరి, రొమాన్స్, యాక్షన్ సన్నివేశాల్లో అక్కడక్కడ మహేష్ మ్యాజిక్ రిపీట్ అయిందని చెప్పవచ్చు.

  ఇమేజ్‌కు సరిపడని పాత్రలో కీర్తి సురేష్

  ఇమేజ్‌కు సరిపడని పాత్రలో కీర్తి సురేష్

  కీర్తీ సురేష్‌కు దక్షిణాదిలో ఉన్న ఇమేజ్ ఈ సినిమాకు ముందు వేరు. ఇప్పటి వరకు క్లాస్‌కే పరిమితమైన కీర్తీ సురేష్‌ను మాస్ క్యారెక్టర్‌లో చూడటం జీర్ణించుకోలేని విషయంగా కనిపిస్తుంది. మాస్ క్యారెక్టర్‌కు తగినట్టుగా ఆమె మేకోవర్, లుక్‌ సింక్ కాలేదనిపిస్తుంది. ఊరమాస్ క్యారెక్టర్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం బాగానే చేసింది. కథకు మెయిన్ లీడ్ ఆమె అయినప్పటికీ.. కథ మలుపు తిరిగిన తర్వాత ఆమె క్యారెక్టర్ పాటకే పరిమితమైందనిపిస్తుంది. కళావతిగా కీర్తి సురేష్ పాస్ మార్కులే తెచ్చుకొన్నదనిపిస్తుంది.

  సముద్రఖని, ఇతర పాత్రల గురించి

  సముద్రఖని, ఇతర పాత్రల గురించి


  ఎంపీ రాజేంద్రనాథ్‌గా సముద్రఖనికి రొటిన్ పాత్రే. బొత్తిగా వేరియేషన్ లేని పాత్రలోనే ఆయన ఒదిగిపోయాడు. మహేష్ క్యారెక్టర్‌కు ధీటుగా తన క్యారెక్టర్ లేకపోవడం వల్ల సముద్రఖని డిఫరెంట్ పెర్ఫార్మెన్స్‌ను చూపించుకోలేక పోయారనిపిస్తుంది. మిగితా క్యారెక్టర్లలో వెన్నెల కిషోర్, సుబ్బరాజు, ప్రభాస్ శ్రీను కామెడీకి పరిమితమయ్యారు. తనికెళ్ల భరణి, నదియా పాత్రల్లో ఎమోషనల్ యాంగిల్ ఉన్నా అది పూర్తి స్థాయిలో పండలేదని చెప్పవచ్చు.

  తమన్ మ్యూజిక్ కాస్త అతిగానే..

  తమన్ మ్యూజిక్ కాస్త అతిగానే..

  సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. గత చిత్రాల్లో తమన్ మ్యూజిక్ ఓ మ్యాజిక్‌లా పనిచేసింది. సర్కారు వారీ పాటలో కావాల్సిన దానికంటే.. ఎక్కువగా.. అతిగా సౌండ్ పొల్యూషన్ చేశాడనిపిస్తుంది. సన్నివేశాల్లో బలం లేకపోవడం వల్ల ఆయన బీజీఎం నాన్ సింక్‌లో కొనసాగుతుంది. మూడు పాటలు ఆడియోపరంగానే కాకుండా తెర మీద కూడా ఆకట్టుకొన్నాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, ఆర్ట్ విభాగాల పనితీరు పెద్దగా ఆకట్టుకొలేకపోయింది. సినిమాను వేగంగా చుట్టేయాలనే తాపత్రయం సీన్లలో స్పష్టంగా కనిపించింది. వీఎఫ్ఎక్స్ కూడా నాసిరకంగానే ఉన్నాయి.

  ఫైనల్‌గా ఎలా ఉందంటే?

  ఫైనల్‌గా ఎలా ఉందంటే?

  రుణాల ఎగవేతకు పాల్పడుతున్న పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలపై సంధించిన విమర్శనాస్త్రం సర్కారు వారీ పాట. కానీ పరుశురాం సంధించిన అస్త్రం టార్గెట్‌కు చాలా దూరంగా ఉండటం సినిమాకు ప్రధాన లోపం. కథ, కథనాలు, పాత్రల డిజైన్‌లో అనేక లోపాలు కనిపిస్తాయి. దాంతో మహేష్ ఒంటరిపోరాటమే తెరపైన కనిపిస్తుంది తప్ప కథలో భావోద్వేగం ఎక్కడ కనిపించదు. ఈ సినిమాపై, మహేష్ పాత్రపై పోకిరి, బిజినెస్ మ్యాన్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. కొత్తదనానికి, ఎలివేషన్స్ లేకుండా చప్పగా ఈ సినిమా సాగుతుంది. దాంతో యావరేజ్‌గా, సాదాసీదా చిత్రంగా సర్కారు వారీ పాట మిగిలింది. వారాంతంలో అభిమానుల పండుగలాంటి చిత్రమే అయినా.. సగటు ప్రేక్షకుడికి నిరాశే మిగులుతుంది.

  ట్యాగ్ లైన్: సర్కారు వారి వేట

  English summary
  Sarkaru Vaari Paata Movie Review:
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion