Sathi Gani Rendu Ekaralu Review పుష్ప ఫేమ్ జగదీష్ ఆకట్టుకొన్నాడా? సత్తిగాని రెండు ఎకరాలు మూవీ ఎలా ఉందంటే?
Rating: 2/5
నటీనటులు: జగదీష్ ప్రతాప్ బండారి, మోహన శ్రీ, రాజ్ తిరన్ దాసు, అనీషా దామా, వెన్నెల కిషోర్, బిత్తిరి సత్తి, మురళీధర్ గౌడ్ తదితరులు
దర్శకత్వం: అభినవ్ రెడ్డి దండ
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి
సినిమాటోగ్రఫి: విశ్వనాథ్ రెడ్డి సీహెచ్
మ్యూజిక్: జై క్రిష్
సాహిత్యం: కాసర్ల శ్యామ్, నిఖిలేష్, జగదీష్
ఓటీటీ స్ట్రీమింగ్: ఆహా
ఓటీటీ రిలీజ్ డేట్: 2023-05-26
రెండు ఎకరాల భూమికి ఆసామీ సత్తి (జగదీష్ ప్రతాప్ బండారీ) బతుకు తెరువు కోసం ఆటో నడుపుకొంటూ భార్య, ఇద్దరు పిల్లల్ని పోషించుకొంటు ఉంటాడు. ఎన్ని కష్టాలు వచ్చినా భూమిని అమ్మకూడదని తాత చెప్పిన మాటలకు కట్టుబడి ఉంటాడు. బతుకు తెరువే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో తన కుమార్తె గుండెలో రంధ్రం ఉందని తెలియడం, దాని ఆపరేషన్‌కు 30 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెబుతారు. ఈ క్రమంలో భూమిని అమ్మలేని పరిస్థితుల్లో.. ఓ కారులో నుంచి సూట్ కేస్ దొంగతనం చేస్తాడు.

కారులో నుంచి దొంగిలించిన సూట్ కేస్‌ను ఒపెన్ చేయడానికి తన స్నేహితుడు అంజి (రాజ్ తిరన్ దాస్)తో సత్తి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? సూట్ కేస్ కోసం షిప్పింగ్ బిజినెస్ ఓనర్ లలిత్ (రియాజ్) తన అనుచరులకు ఎందుకు పురమాయిస్తాడు? రైడర్ (వెన్నెల కిషోర్) సూట్ కేస్ కోసం వెతుకుతూ ఎన్ని కష్టాలు పడ్డాడు? ఈ వ్యవహారంలో ఎస్సై నిరంజన్ రెడ్డి (బిత్తిరి సత్తి) ఎలా దర్యాప్తు చేస్తాడు? సత్తిని మోసం చేయాలని చూసిన సర్పంచ్ (మురళీధర్ గౌడ్)కు ఎలాంటి అనుభవం ఎదురైంది? సత్తి రెండెకరాల భూమిని అమ్మాడా? సత్తి, అంజికి సూట్‌కేసు ఎలాంటి కష్టాలు తెచ్చి పెట్టింది? తన కూతురుకు అంజి వైద్యం చేయించాడా? చివరకు సూట్‌కేసు వ్యవహారం సత్తికి ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందనే ప్రశ్నలకు సమాధానమే సత్తిగాని రెండు ఎకరాలు సినిమా కథ.
సత్తిగాని రెండు ఎకరాలు సినిమా కథ విషయానికి వస్తే..మంచి ఎమోషన్స్, కామెడీకి స్కోప్ ఉన్న కథగా చెప్పుకోవచ్చు. కానీ ఆ రెండు విషయాలు పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో రొటీన్ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. పాపకు గుండెలో రంధ్రానికి ఆపరేషన్ అనే ఎమోషనల్ పాయింట్, సూట్ కేసు దొంగతనం వ్యవహరంతో కథ ఊపందుకొంటే.. కథలో పస లేకపోవడం, సన్నివేశాల్లో బలం లేకపోవడంతో తేలిపోయిందనే చెప్పాలి.
పుష్ప చిత్రంతో ఆకట్టుకొన్న జగదీష్ హీరోగా అంటే వినోదభరితంగా ఉంటుందనే అభిప్రాయం కలుగుతుంది. అలాంటి అభిప్రాయానికి తగినట్టుగానే ఫన్, ఎమోషన్స్ ఉన్న పాయింట్‌ను దర్శకుడు అభినవ్ రెడ్డి ఎంచుకొన్నాడనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ కథ, కథనాల ఆసక్తికరంగా లేకపోవడం, సన్నివేశాల్లో బలం లేకపోవడంతో ఏదో కథ సాదాసీదాగా సాగుతుందనే ఫీలింగ్ కలుగుతుంది. వెన్నెల కిషోర్‌తో చేయించిన కామెడీ చాలా సిల్లీగా ఉంది. సత్తి, అంజి మధ్య సన్నివేశాలు ఆకట్టుకొంటాయి. సర్పంచ్‌గా చేసిన మురళీధర్ గౌడ్ క్యారెక్టర్ కూడా అంతంతా మాత్రంగానే ఉంది. ఎస్సై నిరంజన్ రెడ్డిగా బిత్తిరి సత్తి రొటీన్ ఫార్మాట్‌లో నవ్వించడానికి చేసిన ప్రయత్నం అంతగా ఆకట్టుకోలేదని చెప్పవచ్చు.

సత్తిగా జగదీష్ తనకు లభించిన పాత్రలో డిఫరెంట్ షేడ్స్ పలికించేందుకు ప్రయత్నించాడు. కానీ సన్నివేశాల్లో బలం లేకపోవడం వల్ల బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారనే ఫీలింగ్ కలుగుతుంది. ఉన్నంతలో అంజి ఫర్వాలేదనిపించాడు. వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్, లలిత్, బిత్తిరి సత్తి ఒకే అనిపిస్తాయి. సత్తి భార్యగా మోహన శ్రీ, అంజి ప్రేయసిగా అనీషా దామా తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. విశ్వనాథ్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. పల్లె అందాలను చక్కగా కెమెరాలో బంధించాడు. పేలవంగా సాగే కథ, సన్నివేశాలను జై క్రిష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఎలివేట్ చేసే ప్రయత్నం చేశాడు. కాసర్ల శ్యామ్, నిఖిలేష్, జగదీష్ రాసిన పాటలు పెద్దగా ఆకట్టుకోలేకోపోయాయనే చెప్పాలి. సత్తి కుమారుడిగా నటించిన అబ్బాయి డైలాగ్స్‌లో మంచి స్పార్క్ కనిపించింది. మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, రవిశంకర్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
తెలంగాణ, రూరల్ బ్యాక్ డ్రాప్‌తో చైల్డ్ సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్, వినోదం అంశాలను అందించే ప్రయత్నంగా రూపొందిన చిత్రం సత్తిగాని రెండు ఎకరాలు. అయితే తెలంగాణ యాస, భాష ఉంటే సరిపోతుందనుకొంటే పొరపాటే అనేది ఈ సినిమా చెప్పింది. కథ, కథనాలు, ఎమోషనల్ సీన్లపై కసరత్తు చేసినట్టు కనిపించదు. దాంతో మంచి వినోదానికి, భావోద్వేగాలకు స్కోప్ ఉన్న చిత్రం ఎమోషన్స్ పండకపోవడం, కామెడీ వర్కవుట్ కాకపోవడంతో సాదాసీదాగా మారిపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ చిత్రం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది. రూరల్ బ్యాక్ డ్రాప్, కామెడీ చిత్రాలను ఇష్టపడే వారికి సత్తిగాని రెండు ఎకరాలు నచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











