Sathi Leelavathi Movie Review: సతీ లీలావతి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.5/5

నటీనటులు: లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్, మడోన్నా సెబాస్టియన్, వీకే నరేష్, పవిత్రా నరేష్, వీటీవీ గణేషన్, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్, జాఫర్ సిద్దిఖీ, జోషి తదితరులు
దర్శకత్వం: తాతినేని సత్య
నిర్మాత: నాగ మోహన్
సమర్పణ: జెమినీ కిరణ్
మ్యూజిక్: మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రఫి: బినేంద్ర మీనన్
డైలాగ్స్: ఉదయ్ పొత్తిపాడు
ఆర్ట్: కోసనమ్ విఠల్
ఎడిటర్: సతీష్ సూర్య
బ్యానర్: ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, దుర్గా దేవీ పిక్చర్స్
రిలీజ్ డేట్: 2026-05-08

సినిమా పరిశ్రమలో దర్శకురాలిగా లీలావతి (లావణ్య త్రిపాఠి) కి చిన్నతనం నుంచి సైకాలజికల్‌గా ఓ సమస్యతో బాధపడుతుంటుంది. తన సమస్యను అధిగమించేందుకు సైకాలజిస్ట్ రామ్ సేతు (దేవ్ మోహన్)ను సంప్రదిస్తుంది. రామ్ సేతుతో పరిచయం ప్రేమగా మారుతుంది. తండ్రి (వీకే నరేష్) అనుమతితో రామ్ సేతును లీలావతి ప్రేమించి పెళ్లి చేసుకొంటుంది. కానీ మూడేళ్ల తర్వాత నర్స్‌గా పనిచేసే నికోలా సెబాస్టియన్ (మడోన్నా సెబాస్టియన్)తో రామ్ సేతు ప్రేమలో పడుతాడు. దాంతో వారి మధ్య దాంపత్యపరమైన విభేదాలు చోటు చేసుకొంటాయి.లీలావతికి రామ్ సేతు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అవుతాడు.

Sathi Leelavathi Movie Review

లీలావతిని బాల్యం నుంచి వెంటాడే మానసిక సమస్య ఏమిటి? రామ్ సేతును కలిసిన తర్వాత ఆ సమస్య తగ్గుముఖం పట్టిందా? రామ్ సేతుతో పరిచయం ఎలా ప్రేమకు దారి తీసింది? లీలావతి ప్రేమ, పెళ్లి విషయంలో తండ్రి రియాక్షన్ ఏమిటి? ఏ కారణంగా లీలా, రామ్ మధ్య దూరం పెరిగింది? ఏ పరిస్థితుల్లో వివాహితుడైన నికోలా సెబాస్టియన్‌తో ప్రేమలో పడ్డాడు? రామ్ సేతు విడాకులు ఇవ్వాలని చెప్పినప్పుడు లీలా రియాక్షన్ ఏమిటి? రామ్, లీలా విడాకుల వ్యవహారంలో లాయర్ తమలపాకుల (వీటీవీ గణేష్) పాత్ర ఏమిటి? నిర్మాత మెట్ట రాజర్ (మెట్ట రాజేంద్రన్)కు లీలా మధ్య ప్రొఫెషనల్ రిలేషన్ ఎలా సాగింది? లీలా ఇంట్లో దూరిన దొంగ (సప్తగిరి) వారి దాంపత్య జీవితానికి ఎలాంటి సాయం అందించాడు? చివరకు లీలాతో రామ్ బంధాన్ని కొనసాగించాడా? లీలాకు విడాకులు ఇచ్చి నికోలాతో రామ్ తన రిలేషన్‌ను కొనసాగించాడా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

లీలావతి బాల్యానికి సంబంధించి తల్లిదండ్రులు (నరేష్, పవిత్రా నరేష్) ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో కథను ఎమోషనల్‌గానే ప్రారంభించారు. ఇక డైరెక్టర్‌గా ఆమె క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేస్తూ.. రామ్ సేతుతో బంధాన్ని ఫీల్‌గుడ్‌గా నడిపించేందుకు దర్శకుడు తాతినేని సత్య ప్రయత్నించారు. అయితే సన్నివేశాల్లో నావెల్టీ లేకపోవడం వల్ల కొత్తదనం లోపించిందనే ఫీలింగ్ కలుగుతుంది. కథలో పెద్దగా చలనం లేకపోవడం వల్ల అక్కడక్కడే సన్నివేశాలు తిరుగుతున్నట్టు అనిపిస్తాయి. కానీ భార్య,భర్తల మధ్య కాన్‌ఫ్లిక్ట్‌ను తొందరగానే కథలోకి తీసుకొచ్చి ట్విస్ట్ ఇచ్చాడు. కానీ ఆ ట్విస్ట్‌ను ఎలివేట్ చేసే సన్నివేశాలు, ఎమోషన్స్ పండకపోవడం వల్ల రొటీన్, రెగ్యులర్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ సెకండాఫ్‌లో బాత్రూమ్ డ్రామా ఫర్వాలేదనిపించినా.. సప్తగిరి, మెట్ట రాజేంద్రన్ క్యారెక్టర్లు ఈ సినిమాకు పాజిటివ్‌గా మారాయని చెప్పవచ్చు. భార్యాభర్తల విడాకుల అంశంతో వచ్చిన ఈ సినిమా కొత్తగా లేకపోయినా బోర్ కొట్టించకుండా దర్శకుడు సత్య తెరకెక్కించారని చెప్పాలి.

డిఫరెంట్ స్టోరీ కాకపోయినప్పటికీ.. లావణ్య త్రిపాఠి కథను తన పాత్ర ద్వారా నడిపించిన విధానం బాగుంది. సినిమా భారాన్నంతా తన భుజాలపైనే మోసి.. వన్ ఉమెన్ షో అనే విధంగా తన పాత్రతో ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌ను చాలా సులభంగా పోషించారు. దేవ్ మోహన్ కూడా తన పాత్ర పరిధి మేరకు రాణించారు. మడోన్నా సెబాస్టియన్ పాత్ర నిడివి తక్కువే. ఆమె రోల్ కాస్త పెంచి గ్లామర్ డోస్ పెంచితే బెటర్‌గా ఉండేదనిపిస్తుంది. లావణ్య, దేవ్, మడోన్నా మధ్య డ్రామా గురించి ఇంకాస్త దృష్టిపెట్టి ఉంటే డిఫరెంట్ మూవీ అయి ఉండేదనిపిస్తుంది. సప్తగిరి తనదైన కామెడీతో మరోసారి సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారారు. నరేష్, పవిత్ర ట్రాక్ కొద్దిసేపే అయినా.. ఫన్, ఎమోషన్స్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడ్డాయి.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. బినేంద్ర మీనన్ సినిమాటోగ్రఫి బాగుంది. సినిమా బ్యాక్ డ్రాప్‌కు సంబంధించిన సన్నివేశాలను నేచురల్‌గా తెరకెక్కించారు. కోసనమ్ విఠల్ ఆర్ట్ విభాగం పనితీరు బాగుంది. చాలా సన్నివేశాలను మిక్కి జే మేయర్ తన మ్యూజిక్‌తో హైలెట్ చేశాడు. ఎడిటింగ్ విషయంలో సతీష్ సూర్య ఇంకాస్త జాగ్రత్త పడాల్సింది. కొంత నిడివి తగ్గిస్తే.. ఫీల్, రన్ బెటర్‌‌గా ఉండేదనిపిస్తుంది. నిర్మాత నాగ మోహన్ ఎంచుకొన్న కథ, నటీనటులు బాగుంది. ఆయన పాటించిన నిర్మాణ విలువలు క్లాస్‌గా ఉన్నాయి. కథ, కథనాలపై మరింత దృష్టి పెట్టి ఉంటే.. ఇదోక డిఫరెంట్ ఫ్యామిలీ డ్రామాగా మారేంది. దాంపత్య జీవితంలో విభేదాలు, విడాకులు, లవ్, ఎమోషన్స్ అంశాలతో రూపొందే సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చడానికి అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X