Sathi Leelavathi First Review: సతీ లీలావతి మూవీ ఫస్ట్ రివ్యూ

యంగ్ హీరోయిన్, మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొణిదెల టైటిల్ పాత్రలో నటించిన చిత్రం సతీ లీలావతి. ఈ చిత్రంలో దేవ్ మోహన్, వీకే నరేష్, వీటీవీ గణేషన్, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్, జాఫర్ సిద్దిఖీ, జోషి తదితరులు నటించారు. రొమాంటిక్ కామెడీ అంశాలతో రూపొందిన ఈ చిత్రానికి నాగ మోహన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాకు తాతినేని సత్య దర్శకత్వం వహించారు.

ఈ మూవీ సాంకేతిక నిపుణుల వివరాల్లోకి వెళితే.. మ్యూజిక్: మిక్కీ జే మేయర్, సినిమాటోగ్రఫి: బినేంద్ర మీనన్, డైలాగ్స్: ఉదయ్ పొత్తిపాడు, ఆర్ట్: కోసనమ్ విఠల్, ఎడిటర్: సతీష్ సూర్య తమ బాధ్యతలన్ని నిర్వర్తించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, జెమినీ కిరణ్ సమర్పణలో దుర్గా దేవీ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం మే 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్నది. ఈ చిత్రంపై సెన్సార్ ఫీడ్ బ్యాక్ ఏంటి? ఈ చిత్రానికి జారీ చేసిన సెన్సార్ సర్టిఫికెట్ ఏంటి? ఈ చిత్రం రన్ టైమ్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Sathi Leelavathi Censor Review

లీలావతి (లావణ్య త్రిపాఠి), రామ్ సేతు (దేవ్ మోహన్) ప్రేమించి పెళ్లి చేసుకొన్న కొత్త జంట. గిల్లి కజ్జాలతో సాగుతున్న వారి జీవితంలోకి నికోలా సెబాస్టియన్ (మడోనా సెబాస్టియన్) వస్తుంది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితి నుంచి కలిసి ఉండలేని పరిస్థితి ఎదురవుతుంది. నికోలా కారణంగా లీలావతి, రామ్ మధ్య దాంపత్యపరమైన విభేదాలు చోటు చేసుకొంటాయి? ఆ ఇద్దరు విడిపోయారా? రామ్ తన తప్పు సరిదిద్దుకొని లీలాతో సర్దుబాటు చేసుకొన్నాడా? నికోలాతో జీవితాన్ని కొనసాగించాడా? అనే ప్రశ్నలకు సమాధానమే సతీ లీలావతి సినిమా కథ.

Also Read
Who is Sudha Reddy? ఎవరీ సుధారెడ్డి? 3000 ఏళ్ల వస్త్ర సంస్కృతితో మెట్ గాలా 2026లో సంచలనం
Who is Sudha Reddy? ఎవరీ సుధారెడ్డి? 3000 ఏళ్ల వస్త్ర సంస్కృతితో మెట్ గాలా 2026లో సంచలనం

రొమాన్స్, ఎమోషన్స్, ఫాదర్, డాటర్ సెంటిమెంట్, మెచ్యుర్డ్ లవ్ స్టోరీ అనే అంశాలు ఈ సినిమాకు పాజిటివ్‌గా కనిపించాయి. ఇటీవల రిలీజైన ప్రోమోలు ఈ సినిమాపై సానుకూలతను పెంచాయి. అలాంటి చిత్రాన్ని ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాపై పూర్తిగా సంతృప్తిని వ్యక్తం చేసింది. ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఈ సినిమా రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

Recommended For You
రాహుల్ గాంధీ అలా చేస్తే.. ఆయనను పెళ్లి చేసుకొంటా.. కంగన రనౌత్ క్లారిటీ
రాహుల్ గాంధీ అలా చేస్తే.. ఆయనను పెళ్లి చేసుకొంటా.. కంగన రనౌత్ క్లారిటీ

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన సతీ లీలావతి మూవీకి క్లీన్ సర్టిఫికెట్‌ను సెన్సార్ జారీ చేసింది. ఈ చిత్రానికి యూఏ (UA13+) సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఈ సర్టిఫికెట్ ప్రకారం 13 ఏళ్ల నిండిన ప్రతీ ఒక్కరు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడాల్సి ఉంటుంది అని జారీ చేసిన సర్టిఫికెట్‌లో స్పష్టం చేశారు. సమ్మర్ సీజన్‌లో ప్రతీ ఫ్యామిలీ ఎంజాయ్ చేసే క్లీన్ కంటెంట్ ఉన్న చిత్రమని తమ అభిప్రాయాలను వెల్లడించినట్టు తెలిసింది.

You May Also Like
RB Choudary Passed Away: ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరీ దుర్మరణం.. షాక్‌లో పవన్ కల్యాణ్!
RB Choudary Passed Away: ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరీ దుర్మరణం.. షాక్‌లో పవన్ కల్యాణ్!

ఇక ఆలుమగలు జీవితంలోకి మూడో వ్యక్తి రావడం, కాపురంలో కలతలు లాంటి పాయింట్లతో రూపొందిన ఈ చిత్రంలో కొత్తగా చెప్పుకోవాల్సిన అంశాలు కనిపించలేదు. కథ పాతదైనా ట్రీట్‌మెంట్ కొత్తగా ప్లాన్ చేశారు. హ్యాపీగా రెండు గంటలపాటు వినోదాన్ని అందించే లక్ష్యంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా కథను సాగదీయకుండా నిడివి విషయంలో జాగ్రత్త పడినట్టు కనపడుతున్నది. ఈ చిత్రం నిడివి సుమారుగా 2 గంటల 11 నిమిషాలు అంటే.. 131 నిమిషాల రన్‌టైమ్‌ను ఫిక్స్ చేసినట్టు సెన్సార్ సర్టిఫికెట్ ద్వారా వెల్లడైంది. ఇక ఈ చిత్రం గురించిన ఎక్స్‌క్లూజివ్ కథనాలు, రివ్యూ, బాక్సాఫీస్ నంబర్ల కోసం ఫిల్మీబీట్ వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X