For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కట్టప్ప తప్ప అంతా మైనసే...(‘దొర’ రివ్యూ)

  By Bojja Kumar
  |

  Rating:
  1.5/5

  హైదరాబాద్: తమిళ నటుడు సత్యరాజ్ తెలుగులో బాహుబలి చిత్రంలో పోషించిన 'కట్టప్ప' పాత్రతో బాగా ఫేమస్ అయ్యాడు. దీంతో పాటు ఆయన తెలుగులో చేసిన మిర్చి, నేను శైలజ, బ్రహ్మోత్సవం చిత్రాలు సత్యరాజ్ కు మంచి గుర్తింపు తెచ్చాయి. దీంతో సత్యరాజ్‌కు కాదు కాదు.. కట్టప్పకు ఉన్న ఫాలోయింగును క్యాష్ చేసుకునేందుకు తమిళంలో తెరకెక్కించిన 'జాక్సన్ దొరై' చిత్రాన్ని తెలుగులో 'దొర' పేరుతో రిలీజ్ చేసారు. ఇందులో సత్యరాజ్ తో పాటు ఆయన తనయుడు శిబిరాజ్ కూడా నటించాడు. మరి తెలుగులో వీరి ప్రయత్నం మేరకు ఫలించే అవకాశం ఉందనేది రివ్యూలో విశ్లేషిద్దాం...

  కథ:
  దొరపురం అనే ఊరిలో జాక్సన్‌ బంగ్లా అంటే అందరికీ భయం. అందులో దెయ్యాలు తిరుగుతున్నాయని, ఆ బంగ్లాలోకి ఎవరు వెళ్లినా వెనక్కి తిరిగి రాలేరనే నమ్మకం ఆ ఊర్లో ఉంది. గతంలో ఆ ఊరిలో జరిగిన కొన్ని సంఘటనలు కూడా దొరపురం వాసులను భయానికి గురి చేస్తుంటుంది. ఆ ఊరిలో రాత్రి 9 గంటలు దాటితే దీపాలు ఆర్పేసి నిద్రపోతారు. ఎవరూ బయటకు రారు. ఊరిలోని దెయ్య భయం గురించి పోలీసులకు ఫిర్యాదు అందండంతో పై అధికారులు ఇక్కడ విషయం తేల్చడానికి, జనాల్లో ధైర్యం నింపడానికి ఎస్సై సత్య (శిబిరాజ్‌)ని పంపిస్తారు.

  దొరపురం వచ్చిన వెంటనే సత్య ఆ ఊరి సర్పంచ్‌ కూతురు విజ్జి (బింధుమాధవి)ని చూసి ప్రేమిస్తాడు సత్య. కానీ ఆమెని పెళ్లి చేసుకొనేందుకు విజ్జి మామ కొడుకు వీర (కరుణాకరన్‌) కూడా లైన్లో ఉంటాడు. దీంతో విషయం విజ్జి తండ్రి వద్దకు వెలుతుంది. ఆయన వీరికి ఒక పరీక్ష పెడతాడు. జాక్సన్‌ బంగ్లాలోకి వెళ్లి వెనక్కి తిరిగొచ్చిన వాళ్లకే విజ్జిని ఇచ్చి పెళ్లి చేస్తానని చెబుతాడు. విజ్జిని దక్కించుకోవడానికి ఇద్దరూ ఆ బంగ్లాలోకి వెళతారు... తర్వాత ఏమైంది? అనేది తెరపై చూడాల్సిందే.

  పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే...
  సినిమా టైటిల్ సత్య రాజ్ ప్రధాన పాత్ర పోషించిన 'దొర' పాత్ర పేరు ఉన్నా....సినిమాలో ఆయన కనిపించేది తక్కువే. శిబిరాజ్‌ పోషించిన సత్య పాత్రకే కథలో ఎక్కువగా ప్రాధాన్యముంది. మొదటి నుంచి చివరి వరకు ఆ పాత్ర తెరపై కనిపిస్తుంటుంది. అయితే శిబిరాజ్ తన పెర్ఫార్మెన్స్ తో ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయాడు. ముఖ్యంగా ఆయన ఎక్స్ ప్రెషన్స్ సినిమా మొత్తం ఒకేలా సీరియస్ గా ఉంటుంది. శిబిరాజ్ సినిమాకు పెద్ద మైనస్. సత్య రాజ్ మాత్రం ప్రేతాత్మగా, బ్రిటిష్‌ పాలకుల్ని ఎదిరించిన దొరగా బాగా ఆకట్టుకున్నాడు. సినిమాలో ఏదైనా ప్లస్ పాయింట్ ఉందంటే అది సత్యరాజ్ మాత్రమే. బింధు మాధవి ఫర్వా లేదు. కరుణాకరన్, జచేరి, రాజేంద్రన్ తదితరులు చెప్పుకునేంతగా ఏమీ నటించలేదు.

  స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

  జాక్సన్ బంగ్లాలో నిజంగా దెయ్యం ఉందా?

  జాక్సన్ బంగ్లాలో నిజంగా దెయ్యం ఉందా?

  జాక్సన్ బంగ్లా బ్రిటిష్‌ కాలం నాటిది. బ్రిటిష్‌ పాలనపై పోరాటం చేసిన దొర (సత్యరాజ్‌), దొరపురం జనాల్ని ముప్పుతిప్పలు పెట్టిన జాక్సన్‌ (జచేరీ)లు మరణించినా... వాళ్ల మధ్య పగ, ప్రతీకారంతో ఆత్మలుగా మారుతారు. వారే మళ్ళీ ఆత్మలుగా అక్కడే వుంటూ.. రాత్రికి వచ్చి పగలు మాయం అవుతుంటారు.

  తొలి భాగం, రెండో భాగం

  తొలి భాగం, రెండో భాగం

  సినిమా తొలి భాగం కాస్త ఆసక్తిగానే ఉన్నా...సెకండాఫ్‌లోకి వచ్చేసరికి చాలా బోరింగ్ గా ఉంటుంది. జాక్సన్ బంగళాలో ఉన్న సీన్లను మరీ సాగదీశారు.

  లవ్ ట్రాక్

  లవ్ ట్రాక్

  హారర్, కామెడీ నేపథ్యంలో సాగే ఈ కథలో హీరో హీరోయిన్ల లవ్‌ట్రాప్‌ రొటీన్‌గా ఉంది. ఏమాత్రం ఆ సక్తికరంగా లేదు.

  భయమే లేదు..

  భయమే లేదు..

  దెయ్యాల సినిమాలంటే భయపెట్టడడం, ఎంటరటైన్‌ చేయడం లాంటి ఉంటాయి. ఈ సినిమా చూస్తుంటే అలాంటి ఫీలింగ్ రాదు.

  కనీసం కామెడీ

  కనీసం కామెడీ

  హారర్‌ - కామెడీ మేళవింపుగానే ఈ చిత్రం తెరకెక్కినా ఎక్కువగా కామెడీ ఎంచుకున్నాడు. విచిత్రం ఏమిటంటే ఆ కామెడీ కూడా ప్రేక్షకులను పెద్దగా నవ్వించదు.

  టెర్నికల్

  టెర్నికల్

  యువరాజ్ సినిమాటోగ్రఫీ బావుంది. గ్రాఫిక్స్‌ పర్వాలేదు. సిద్ధార్థ్‌ విపిన్‌ సంగీతం యావరేజ్. ఎడిటింగ్ మరింత షార్పుగా ఉంటే బావుండేది. నిర్మాణ విలువలు ఓకే.

  ఫైనల్ గా..

  ఫైనల్ గా..

  ‘దొర' సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు.

  English summary
  Jackson Durai movie review and rating is here. Directed by Dharani Dharan, the film stars Sathyaraj, Sibiraj and Bindu Madhavi in important roles. Jackson Durai has its moments, but the whole purpose of the movie goes for a toss, thanks to its poor execution.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X