Satyabhama Review: డిసెంట్ యాక్షన్ థ్రిల్లర్.. పోలీసు ఆఫీసర్‌గా కాజల్ మెప్పించిందా?

Rating: 2.75

సత్యభామ (కాజల్ అగర్వాల్) నిజాయితీతో కూడిన సమాజం పట్ల భాద్యతాయుతమైన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్. యూనివర్సిటీ రోజుల నుంచి ప్రేమించిన రచయిత అమర్ (నవీన్ చంద్రను వివాహం చేసుకొంటుంది. డ్యూటీ మైండ్ ఉన్న అధికారిణి ముందు వచ్చిన కేసులను చాకచక్యంగా, ధైర్య సాహసాలతో పరిష్కరిస్తుంది. అయితే లైంగిక వేధింపులకు గురైన హసీనా అనే అమ్మాయిని రక్షించేందుకు ప్రయత్నిస్తుంది. అయితే అనుకోకుండా యాదు అనే డ్రగ్ అడిక్గ్ చేతిలో దారుణంగా హత్యకు గురవుతుంది.

అయితే హసీనా మరణం సత్యభామలో ఎలాంటి మార్పులు తెచ్చింది? హసీనాను రిషి ఎందుకు చంపాడు? హసీనా మరణం తర్వాత తన సోదరుడు ఇక్బాల్ ఎందుకు అదృశ్యమయ్యాడు? ఇక్బాల్‌కు విజయ్ అలియాస్ రియాజ్‌కు రిలేషన్ ఏమిటి? పొలిటిషియన్ కొడుకు రిషికు సంబంధం ఏమిటి? హసినా మర్డర్‌కు సత్యభామ ఎలా న్యాయం చేసింది? ఇక్బాల్ అదృశ్యమైన తర్వాత అతడు చేపట్టిన మిషన్ ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే సత్యభామ సినిమా కథ.

Satyabhama Movie Review in Telugu Kajal Aggarwal rocks as police Cop check rating here full details

సత్యభామ క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేయడానికి రాసుకొన్న సన్నివేశాలు, అనుసరించిన స్క్రీన్ల్ ప్లే సినిమాకు తొందరగా కనెక్ట్ అయ్యేలా చేశాయి. సినిమా ఆరంభంలోనే కాజల్ చేసిన పవర్ పుల్ పెర్పార్మెన్స్ ఆడియెన్స్‌కు హై ఇచ్చేలా ఉండటం వల్ల కథను ఫాలో అయ్యేలా చేస్తాయి. అలాగే స్టోరీలో వచ్చే ట్విస్టులు, టర్న్‌లు సినిమాను పరుగులు పెట్టించేలా చేస్తాయి. అయితే హసీనా సీన్లు ఎమోషనల్‌గా ఉండటం సినిమాకు పాజిటివ్‌గా మారడం, ఇక్బాల్ కనిపించకుండా పోవడం లాంటి సీన్లు సినిమాపై ఆసక్తిని కలిగించేలా చేస్తాయి. ఒక ఎమోషనల్ సీన్‌తొ ఫస్టాఫ్‌ ముగుస్తుంది. తొలి భాగంలో స్క్రీన్ల్ ప్లే, యాక్షన్, ఎమోషనల్ సీన్లు హైలెట్‌గా అనిపిస్తాయి.

అయితే సెకండాఫ్‌ విషయానికి వస్తే.. రకరకాల ట్విస్టుల కొంత గందరగోళానికి గురి చేస్తాయి. కానీ ఆ ట్విస్టులను లింక్ చేస్తూ కథను నడిపించిన విధానం దర్శకుడికి, స్క్రీన్ ప్లే రైటర్‌ ప్రతిభకు అద్దంపట్టాయని చెప్పవచ్చు. కామన్ ఆడియన్‌కు సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు కొంత కన్‌ఫ్యూజన్‌కు గురి చేస్తాయనే చెప్పాలి. కానీ అలాంటి కన్‌ఫ్యూజన్‌ను క్రియేట్ చేసి దానికి సొల్యూషన్ చూపిన విధానం సినిమాకు బలంగా మారిందని చెప్పవచ్చు.

Satyabhama Movie Review in Telugu Kajal Aggarwal rocks as police Cop check rating here full details

ఇక నటీనటులు ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు చూసిన కాజల్ అగర్వాల్‌కు సత్యభామగా కనిపించే తీరుకు చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. తన ఇమేజ్‌ను కంప్లీట్‌గా మార్చుకొని చేసిన రోల్ ఇది. సత్యభామగా ఆమె పూర్తిగా పరకాయ ప్రవేశం చేశారని చెప్పవచ్చు. యాక్షన్, ఎమోషనల్ సీన్లలో ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. ఫైట్స్ సీన్లలో నేచురల్‌గా బిహేవ్ చేసింది.రైటర్, భర్త పాత్రలో నవీన్ చంద్ర సపోర్టివ్ రోల్ సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చింది. ఇక అంకిత్ కోయ, ఇతర యువ నటీనటుల యాక్టింగ్ సినిమాకు మరింత బలంగా మారడమే కాకుండా ప్రెష్ నెస్‌ను తీసుకొచ్చిందని చెప్పవచ్చు

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోరు సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. అనేక ట్విస్టులు ఉండే ఈ సినిమాను అర్ధవంతంగా చూపించిన ఎడిటర్ పనితనాన్ని మెచ్చుకోవాలి. ఇక సినిమాటోగ్రఫి సినిమాను రిచ్‌గా ఫీల్‌గుడ్‌గా మార్చింది. నిర్మాతలు బాబీ తిక్క, శ్రీనివాస్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాను రిచ్‌గా మార్చాయి.

Satyabhama Movie Review in Telugu Kajal Aggarwal rocks as police Cop check rating here full details

ఇక హ్యుమన్ ఎమోషన్స్, అమ్మాయిల అక్రమ రవాణ, గేమింగ్ కాన్సెప్ట్‌‌తో రూపొందించిన క్రైమ్ థ్రిల్లర్. యాక్షన్, యాక్టర్ల ఫెర్ఫార్మెన్స్ సినిమాకు బలం. ఒకే పాయింట్ మీద కథ సాగడం రొటీన్‌గా అనిపిస్తుంది. అమ్మాయిలకు సామాజిక సందేశాన్ని ఇస్తూ కమర్షియల్ అంశాలు జోడించిన తీరు సినిమాకు ప్లస్ అయ్యాయి. చాలా కాలం తర్వాత వచ్చిన మంచి లేడీ ఓరియెంటెడ్ పోలీస్ కాప్ కథ. ఈ వారం ఫ్యామిలీ ఆడియెన్స్, యూత్, ముఖ్యంగా ఎలాంటి అంచనాలు పెట్టుకొని వెళ్లినా మంచి అనుభూతిని క్రియేట్ చేస్తుంది. ఈ వారం థియేటర్లలో తప్పక చూడాల్సిన సినిమా సత్యభామ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X