Satyam Sundaram Review: సత్యం సుందరం మూవీ రివ్యూ అండ్ రేటింగ్
సత్యం సుందరం మూవీ రివ్యూ
నటీనటులు: కార్తీ, అరవింద్ స్వామి, శ్రీ దివ్య, రాజ్ కిరణ్, దేవదర్శిని, ఇళవరసు, శ్రీరంజని తదితరులు
దర్శకత్వం: ప్రేమ్ కుమార్ సీ
నిర్మాతలు: జ్యోతిక, సూర్య
సినిమాటోగ్రఫి: మహేందిరన్ జయరాజు
ఎడిటింగ్: ఆర్ గోవింద్ రాజ్
మ్యూజిక్: గోవింద్ వసంత
బ్యానర్: 2డీ ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్ డేట్: 2024-09-27
కుటుంబ కలహాల కారణంగా అమరావతి ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన సత్యం (అరవింద్ స్వామి) ఫ్యామిలీ వైజాగ్‌కు షిఫ్ట్ అవుతారు. వైజాగ్‌లో ఓ కార్పోరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ తన తల్లిదండ్రులతో సంతోషంగా సత్యం జీవితం గడుపుతుంటాడు. అయితే తమకు జరిగిన అన్యాయం కారణంగా తమ సొంతూరు, తమ బంధువులపై కొంత ద్వేషం పెంచుకొంటాడు. అయితే తనను అధికంగా ప్రేమించే సోదరి పెళ్లికి ఆహ్వానం రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ గ్రామానికి వెళ్లగా బావ.. బావ అంటూ సత్యంపై అంతులేని ప్రేమను వ్యక్తం చేస్తూ ఓ బంధువు (కార్తీ) వెంటపడుతాడు.
తన సొంత ఊరులో సత్యం కుటుంబానికి జరిగిన అన్యాయం ఏమిటి? పెళ్లిలో ఎలాంటి అనుభూతులు సత్యంకు ఎదురయ్యాయి? పెళ్లిలో కలిసిన బంధువుల నుంచి ఎలాంటి స్పందన లభించింది. పెళ్లిలో బావ అంటూ వెంటపడిన ఆ వ్యక్తిని సత్యం ఎందుకు దూరం పెట్టాడు? ఓ రోజు తన ఇంటిలో గెస్టుగా ఉంచుకొన్న ఆ వ్యక్తికి చెప్పకుండా తన ఊరికి ఎందుకు పారిపోతాడు? వైజాగ్ వచ్చిన తర్వాత సత్యంను వెంటాడిన సంఘటనలు ఏమిటి? సత్యంపై బావ అంటూ ప్రేమను కురిపించిన వ్యక్తిని మళ్లీ కలిసేందుకు అమరావతికి వెళ్లాల్సిన పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి? ఆ వ్యక్తి పేరు తెలియని కారణంగా సత్యం ఎందుకు మానసిక సంఘర్షణకు గురయ్యాడు అనే ప్రశ్నలకు సమాధానమే సత్యం సుందరం సినిమా కథ.

తన బంధువుల కారణంగా అన్యాయానికి గురైన సత్యంగా అరవింద్ స్వామి పాయింట్ వ్యూలో దర్శకుడు ప్రేమ్ కుమార్ రాసుకొన్న నవలకు సినిమా రూపం ఇవ్వడమే కాకుండా దానికి ఇచ్చిన ట్రీట్‌మెంట్ అద్బుతంగా ఉన్నాయని చెప్పవచ్చు. అరవింద్ స్వామి పాత్రను నడిపించి తీరు.. ఆ పాత్ర చుట్టుూ అ్లలు కొన్న కథనం అనుక్షణంగా భావోద్వేగానికి గురి చేసేలా ఉంటుంది. ప్రతీ సన్నివేశం హృదయాన్ని తట్టిలేపేలా ఉంటుంది. ఫస్టాఫ్‌ను క్యారెక్టర్ల ఎస్టాబ్లిష్‌మెంట్ చేస్తూ ఎమోషన్స్ పండిస్తూ కథను నడిపిస్తున్న తీరు అద్బుతంగా ఉంటుంది.
ఇక సెకండాఫ్‌లో సత్యం, తన బావమరిదిగా చెప్పుకొనే కార్తీ మధ్య ఎమోషనల్ జర్నీ ఓ వైపు ఫన్ క్రియేట్ చేస్తూనే మరో వైపు కంటతడి పెట్టించేలా ఉంటుంది. చివరి సన్నివేశం వరకు కథలో ఉండే ఎమోషనల్ సస్పెన్స్‌కు భావోద్వేగాన్ని దట్టించి ఫీల్‌గుడ్‌గా మలిచిన మరీ బాగుంది. ప్రతీ చిన్న పాత్ర రిజిస్టర్ అయ్యేలా దర్శకుడు ప్రేమ్ కుమార్ రాసుకొన్న స్క్రిప్టు ఈ సినిమాకు అత్యంత బలంగా మారిందని చెప్పవచ్చు.
నటీనటులు విషయానికి వస్తే.. అరవింద్ స్వామి, కార్తీ తమ పాత్రలో ఒదిగిపోయారు. ఎక్కడా వారిద్దరూ కనిపించకుండా కేవలం క్యారెక్టర్లు మాత్రమే కనిపించేలా నటించారని చెప్పేకంటే.. వారిద్దరూ ఆ పాత్రల్లో జీవించారు. వినోదాన్ని పంచుతూనే కంటతడి పెట్టించే సన్నివేశాలను అద్బుతంగా పడించారు. వారిద్దరూ కూడా తమ కెరీర్‌లో బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పవచ్చు. ఇక శ్రీ దివ్య, దేవదర్శిని, శ్రీరంజని తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. ముఖ్యంగా ఈ సినిమాకు అరవింద్ స్వామి, కార్తీ మ్యాజిక్ చేశారు.
సత్యం సుందరి సినిమాకు గోవింద్ వసంత అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు మరింత ఫీల్‌గుడ్‌గా మార్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా నేటివిటితో సాగే ఈ సినిమాను మహేందిరన్ జయరాజు అద్బుతంగా కెమెరాలో బంధించారు. గోవింద్ రాజ్ ఎడిటింగ్ బాగుంది. ఈ సినిమా ఎమోషనల్ డ్రామాగా మార్చడానికి సూర్య, జ్యోతిక అనుసరించిన నిర్మాణ విలువలు టాప్ క్లాస్‌లో ఉన్నాయి.

సినిమా రంగంలో ప్రస్తుతం కమర్షియల్ వాల్యూస్ కోసం పాకులాడుతున్న నేపథ్యంలో ఎలాంటి ట్విస్టులు, టర్నులు లేకుండా కథ, కథనాలే బలంగా రూపొందించిన చిత్రం సత్యం సుందరం. ప్రతీ సీన్‌లో హృదయాన్ని భారంగా మార్చే ఎమోషన్స్, అప్పుడప్పుడు కంటతడి పెట్టించే సీన్లు ఈ సినిమా క్లాసిక్‌గా మార్చాయి. కార్తీ, అరవింద్ స్వామి ఫెర్ఫార్మెన్స్, దర్శకుడు ప్రేమ్ కుమార్ టేకింగ్, రైటింగ్ ఈ మూవీకి ములస్థంబాల్లా నిలిచాయి. ఈ సినిమాను తప్పకుండా థియేటర్లలోనే చూడండి.. ఈ మూవీని మిస్ చేసుకొంటే.. గొప్ప ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను మిస్ చేసుకొన్నట్లే. ఈ సినిమా ఆద్యంతం ఓ అనుభూతిని పండించడమే కాకుండా తమ ఫ్యామిలీ బంధాలను గుర్తు చేస్తుంది. సో డోంట్ మిస్ ఇట్.


Click it and Unblock the Notifications











