Satyam Sundaram Twitter Review: సత్యం సుందరం ట్విట్టర్ రివ్యూ.. కార్తీ మూవీ ఎలా ఉందంటే?
విలక్షణ నటులు కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రలో ఎమోషనల్ మూవీ సత్యం సుందరం (Meiyazhagan). సంచలన విజయం సాధించిన 96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మించారు.
తమిళంలో మేఅలగన్ అనే టైటిల్‌తో రూపొందిన ఈ సినిమాను తెలుగు వెర్షన్‌ను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 28న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ట్విట్టర్‌లో నెటిజన్లు ఇస్తున్న రివ్యూ వివరాల్లోకి వెళితే..

సత్యం సుందరం మూవీ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా. కార్తీ కెరీర్‌లో బెస్ట్ ఫెర్మార్సెన్ ఇచ్చిన సినిమా ఇది. అరవింద్ స్వామి, కార్తీ మధ్య ఎమోషనల్ బాండ్ బాగా వర్కవుట్ అయింది అని ఓ నెటిజన్ అన్నాడు.
సత్యం సుందరి మూవీ ఫీల్ గుడ్ మూవీ. ప్రేమ్ బై ఫ్రేమ్.. ప్రతీ మూమెంట్స్ ఎంజాయ్ చేసేలా ఉంది. కార్తీ కెరీర్‌లో అద్బుతమైన చిత్రం. అరవింద్ స్వామి కెరీర్ బెస్ట్ మూవీ. నిర్మాతగా మారి ఇలాంటి అద్బుతమైన సినిమాను అందించిన హీరో సూర్యకు ధన్యవాదాలు. ఇది సినిమా కానే కాదు.. గొప్ప అనుభూతి. ఈ సినిమా చూసిన తర్వాత నా సొంత ఊరుకు వెళ్లానే కోరిక కలిగింది. నేను వెళ్తున్నాను అని ఓ నెటిజన్ అన్నారు.
సత్యం సుందరం సినిమా కథను దర్శకుడు అద్బుతంగా రాశాడు. ఎమోషనల్ ఫీల్ గుడ్ డ్రామా. డైరెక్టర్ చిత్రీకరించిన తీరు మాస్టర్ క్లాస్‌గా ఉంది. ఫైట్స్ లేవు. రొమాన్స్ లేదు. మాస్ మూమెంట్స్ లేవు. మూడు గంటలపాటు హృదయాన్ని పండేసేలా కథను నెరేట్ చేశాడు. ఫస్టాఫ్ బాగుందనుకొంటే.. అంతకంటే డీసెంట్‌గా సెకండాఫ్ ఉంది అని ఓ నెటిజన్ సుదీర్ఘమైన రివ్యూను రాశారు.
సత్యం సుందరం సినిమా బాగుంది. 15 నుంచి 20 నిమిషాలపాటు నిడివి తగ్గిసే.. 2024 సంవత్సరంలో ఈ మూవీ బెస్ట్ మూవీ అవుతుంది అని తమిళ నెటిజన్ కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











