twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'సత్యం' నచ్చుతాడు

    By Staff
    |

    Satyam
    -జలపతి గూడెల్లి
    చిత్రం: సత్యం
    నటీనటులు: సుమంత్‌, జెనాలినా, కోట శ్రీనివాసరావు,
    తనికెళ్ళ భరణి, బ్రహ్మనందం తదితరులు
    సంగీతం: చక్రి
    నిర్మాత: అక్కినేని నాగార్జున
    స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సూర్యకిరణ్‌

    సుమంత్‌ రీలాంఛ్‌ చిత్రం వర్కవుట్‌ అయింది. కొత్త దర్శకుడు సూర్యకిరణ్‌ హీరో మీద కాకుండా పూర్తిగా ట్రీట్‌మెంట్‌పైనే దృష్టి సారించడంతో సినిమా హాయిగా సాగింది. సుమంత్‌ నటనలో ఇంకా పరిణితి రాలేదు. కానీ గత చిత్రాలతో పోల్చితే చాలా ఇంప్రూవ్‌ అయ్యాడు. అందంగా కూడా కనపించాడు. ఆ కొత్త లుక్‌, చక్రి స్వరపర్చిన మెచ్యుర్డ్‌ సంగీతం, హాయిగా సాగే కథనం, కామెడీ..అన్ని సమపాళ్ళలో కలవడంతో 'సత్యం' నచ్చుతుంది. తొలిసారిగా చక్రి చక్కటి రీరికార్డింగ్‌ అందించాడు. బహుశా అందుకేనేమో..ఈ పాప్ట్‌ ప్రేమకథా చిత్రం మృదువుగా సాగుతుంది. అయితే, హీరో సుమంత్‌ మాత్రం డైలాగ్‌ డెలివరీలోనూ, ఎక్స్‌ప్రెషన్స్‌లోనూ ఎదగాల్సిన అవసరం చాలా ఉంది. టీనేజ్‌ అందగత్తె జెనాలినా ఈ సినిమాకు మరో ఆకర్షణ.

    కథ: సత్యం (సుమంత్‌) చదువులో వీక్‌. తను చేసే పనుల వల్ల వారి కుటుంబం అప్రతిష్ట పాలవుతోందని ఆయన తండ్రి ఇంటి నుంచి వెళ్ళగొడుతాడు. సత్యం మంచి కవి. డ్రైవర్‌ ఉద్యోగం చేసుకుంటూ ఓ ప్రఖ్యాత సినిమా పాటల రచయిత (తనికెళ్ళ భరణి)వద్ద ఘోష్ట్‌ రైటర్‌గా పనిచేస్తుంటాడు. ఇండిపెండెంట్‌ పాటల రచయితగా ఎదగాలని సత్యం కోరిక. మరోవైపు, కవిత్వం, సంగీతం అంటే ఇష్టపడే అంకిత (జెనాలినా)ను ప్రేమిస్తాడు. కానీ తను మాత్రం ఇతను రౌడీగా భావిస్తుంది. అంకిత తండ్రి (కోట శ్రీనివాసరావు) సత్యంకి ఫ్రెండ్‌. అంకిత మెడిసిన్‌ చదువు కోసం రెండు లక్షల రూపాయలు కోటకు అందించి, తన కెరీర్‌ ను వదులుకుంటాడు. చివరికి హీరో లిరిక్‌ రైటర్‌ గా ఎదగడం, తన ప్రేమను సాధించుకోవడంతో కథ ముగుస్తుంది.

    సింపుల్‌ కథను బోర్‌ కొట్టించుకుండా మంచి పాటలను ఉపయోగించుకుంటూ దర్శకుడు సినిమాను నడిపించాడు. అన్ని పాటలు బాగున్నాయి. బ్రహ్మానందానికి రాష్ట్రపతి కలాం టైప్‌ గెటప్‌ బాగా సూటయింది. తనికెళ్ళ భరణి పాత్ర ఏ లిరిక్‌ రైటర్‌పై సెటైరో? (ఆ పాత్రను బట్టి, అసిస్టెంట్‌లను పోషించే కవిని ఉద్దేశించినట్లుగా అర్థమవుతోంది. కానీ ఆయన వ్యక్తిగతంగా అత్యంత ప్రతిభావంతుడు మరి). సమీర్‌ రెడ్డి ఫోటోగ్రఫీ స్మూత్‌గా సాగుతుంది. సుమంత్‌ నటన, డైలాగ్‌ డెలివరీపై ఇంకా శ్రద్ద వహిస్తే మంచి హీరోగా ఎదుగుతాడు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X