Save The Tigers 3 Web Series Review: సేవ్ ది టైగర్ 3 మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్యకృష్ణ, సీరత్ కపూర్, వెన్నెల కిషోర్ తదితరులు
దర్శకత్వం: శ్రీరామ్ ఎరగమ్
నిర్మాతలు: శివ మేక, సాహితి చింతలపూడి
మ్యూజిక్: ఎన్ వెంకటస్వామి
సినిమాటోగ్రఫి: ఎస్వీ విశ్వేశ్వర్
ఎడిటర్: అజయ్ అర్సాడ
ఓటీటీ స్ట్రీమింగ్: జియో హాట్ స్టార్
ఓటీటీ రిలీజ్ డేట్: 2026-06-06

హీరోయిన్ హంసలేఖ (సీరత్ కపూర్) తో గొడవల తర్వాత భార్య హైమా (జోర్దార్ సుజాత)తో కలిసి గంటా రవి (ప్రియదర్శి) బస్తీ నుంచి గేటెడ్ కమ్యూనిటీకి షిష్ట్ అవుతాడు? భార్య రేఖ (దేవయాని)తో వైవాహిక విభేదాలతో విడాకులు తీసుకునేందుకు విక్రమ్ (చైతన్య కృష్ణ)సిద్దమవుతాడు. భార్య మాధురి (పావని గంగిరెడ్డి) పోరుతో ఇష్టం లేని జాబ్ చేయడానికి రాహుల్ (అభినవ్ గోమటం) రెడీ అవుతాడు. కానీ నోటి దూల కారణంగా ఉద్యోగం పోగొట్టుకొంటాడు. దాంతో గంటా రవి, విక్రమ్, రాహుల్ జీవితంలో అశాంతి, అసహనం కొనసాగుతూనే ఉంటుంది.

హీరోయిన్ హంసలేఖతో గంటా రవికి గొడవలు ఏమిటి? భార్య హైమాతో బస్తీ నుంచి గంటా రవి ఫ్యామిలీ గేటెడ్ కమ్యూనిటీకి ఎందుకు వెళ్తారు? గేటెడ్ కమ్యూనిటీలో హైమా ఎలా ఇబ్బంది పడ్డారు. దేవయానితో విక్రమ్ విడాకులకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి? విక్రమ్‌పై భార్య రేఖ కేసు పెట్టడం వల్ల ఏం జరిగింది? నచ్చని ఉద్యోగం చేయడం వల్ల రాహుల్‌కు ఎదురైన పరిస్థితులు ఏమిటి? రాహుల్‌పై వంద మంది అమ్మాయిలు ఎందుకు కేసులు పెట్టారు? విక్రమ్ భార్య మాధురీ ప్రెగ్నెన్సీని ఎందుకు తీసుకోవాలని నిర్ణయం తీసుకొన్నది? ముగ్గురు భర్తల్లో అశాంతి, అసహనం ఎలా కొనసాగింది? ఈ ముగ్గురి జీవితాల మధ్య ఇంద్రుడు (వెన్నెల కిషోర్) పాత్ర ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే సేవ్ ది టైగర్ 3 వెబ్ సిరీస్ కథ.

Save The Tigers Season 3 Web Series Review

గతంలో రెండు సీజన్లు ఆడియెన్స్ ఆదరణతో మంచి సక్సెస్ సాధించాయి. దాంతో ఈ సిరీస్ మూడో సీజన్‌పై పెరిగిన అంచనాలకు తగినట్టుగానే దర్శకుడు శ్రీరామ్ తన కంటెంట్‌ను బాగా డిజైన్ చేసుకొన్నారనేది ఆయన సృష్టించిన డ్రామాతో స్పష్టమైంది. చాలా సీన్లు ఫ్రెష్‌గా, ఫన్‌తో సాగాయి. ఎక్కువ మంది టాలెంటెడ్ ఆర్టిస్టుల నుంచి దర్శకుడు టాలెంట్‌ను రాబట్టుకొన్న విధానం బాగుంది. మధ్యలో కొన్ని ఎపిసోడ్స్ కొంత స్లోగా నడుస్తాయనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ చివరి ఎపిసోడ్స్‌ను హిలేరియస్‌గా అందించారు.

డిఫరెంట్ షేడ్స్ ఉన్న హైదరాబాదీగా ప్రియదర్శి తన పాత్రలో ఎప్పటిలానే ఒదిగిపోయాడు. అమాయక భర్త, లవర్ బాయ్‌గా చైతన్య కృష్ణ మరోసారి మంచి నటనతో మెప్పించే ప్రయత్నం చేశారు. బాడీ లాంగ్వేజ్, పాత్రకు తగినట్గుగా హావభావాలు, ఎమోషన్స్ చక్కగా పండించాడు. ఇక అభినవ్ గోమటం కామెడీ టైమింగ్ వల్ల షో ఫన్ రైడ్‌గా మారింది. తన సహజ శైలికి తగినట్టుగా ఆయన వేసిన పంచులు నవ్వులు పువ్వులు పూయించాయి. వెన్నెల కిషోర్ ఎప్పటిలానే తన వంతుగా ఈ సిరీస్‌కు హైలెట్‌గా నిలిచారు.

టెక్నికల్ విషయాల వస్తే.. మ్యూజిక్, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్స్ బలంగా నిలిచాయి. అన్ని రకాల ఎమోషన్స్‌ను విశ్వేశ్వర్ చక్కగా చూపించారు. సన్నివేశాలకు తగినట్గుగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో వెంకటస్వామి ఆకట్టుకొన్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఓటీటీలోనే కాబట్టి.. తగినంత సమయాన్ని కేటాయించుకొని చూడండి.. మంచి అనుభూతి కలుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X