Save The Tigers Review: భర్తల ఫ్రస్టేషన్-ప్రేక్షకులకు ఫన్.. 'సేవ్ ది టైగర్స్' రివ్యూ

Rating:
3.0/5

టైటిల్: సేవ్ ది టైగర్స్
నటీనటులు: ప్రియదర్శి, చైతన్య కృష్ణ, అభినవ్ గోమటం, జోర్దార్ సుజాత, దేవియాని శర్మ, పావని గంగిరెడ్డి, హర్ష వర్దన్, గంగవ్వ, రోహిణి, వేణు టిల్లు, శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఎస్.వి. విశ్వేశ్వర్
సంగీతం: అజయ్ అరసాడ
నిర్మాతలు: మహి వి రాఘవ్, చిన్న వాసుదేవ రెడ్డి
క్రియేటర్స్: మహి వి రాఘవ్, ప్రదీప్ అద్వైతం
దర్శకత్వం: తేజ కాకుమాను
విడుదల తేది: ఏప్రిల్ 27, 2023
ఓటీటీ వేదిక: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (ఎపిసోడ్స్ 6)

పాఠశాల, ఆనందో బ్రహ్మా, యాత్ర వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన మహి వి రాఘవ్ క్రియేటర్ అండ్ ప్రొడ్యుసర్ గా నిర్మించిన వెబ్ సిరీస్ 'సేవ్ ది టైగర్స్'. 'అంతరించిపోతున్న పులుల్ని, మొగుళ్లను కాపాడుకుందాం' అనేది క్యాప్షన్. కమెడియన్లు ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ హీరోలుగా బాహుబలి నటుడు, దర్శకుడు తేజ కాకుమాను తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ ప్రమోషనల్ వీడియోస్ ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ 27న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా విడుదలైన ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో (Save The Tigers Review Telugu) చూద్దాం.

Save The Tigers Web Series Review And Rating In Telugu

కథ:విక్రమ్ (చైతన్య కృష్ణ), గంటా రవి (ప్రియదర్శి), రాహుల్ మోహన్ (అభినవ్ గోమటం) ముగ్గురు ఫ్రెండ్స్. వీళ్లను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తారు. విక్రమ్ తన భార్య లాయర్ రేఖ (దేవియాని శర్మ) పేరుపై ఉన్న కారును పోలీసులు సీజ్ చేస్తారు. దీంతో ఆ కారును ఎలాగైనా విడిపించుకుని పోవాలని ఎస్సై (శ్రీకాంత్ అయ్యంగర్)ను రిక్వెస్ట్ చేస్తారు. ఈ క్రమంలో వాళ్లు అసలు ఎందుకు తాగాల్సి వచ్చిందో ఎస్సైకి చెప్పడం మొదలు పెడతారు.

ట్విస్టులు:ఈ ముగ్గురికి తమ భార్యలతో కలిగిన ఇబ్బందులు ఏంటీ? జాబ్ మానేసి రైటర్ గా ట్రై చేస్తున్న రాహుల్ కు తన భార్య డాక్టర్ మాధురి (పావని గంగిరెడ్డి)పై అనుమానం ఎందుకు వచ్చింది? పాల వ్యాపారి గంటా రవిని బ్యూటి పార్లర్ నడుపుతున్న తన వైఫ్ హైమావతి (జోర్దార్ సుజాత) ఏ విషయంపై గొడవ పెట్టుకుంటుంది? విక్రమ్ కు తన భార్య యాటిట్యూడ్ తో ఉన్న సమస్య ఏంటీ? ముగ్గురు భర్తలు కలిసి బారులో చేసిన రచ్చ ఏంటీ? ఫైవ్ స్టార్ హోటల్ కు వెళ్లిన స్టార్ హీరోయిన్ ఏమైంది? అనే తదితర ఆసక్తిర విషయాలతో తెరకెక్కిందే 'సేవ్ ది టైగర్స్'.

Save The Tigers Web Series Review And Rating In Telugu

విశ్లేషణ:ఎప్పుడైనా సరే భార్యా భర్తల మధ్య జరిగే గొడవలు, ప్రేమానురాగాలు, అలకలు, బుజ్జగింపులు కొత్తగానే ఉంటాయి. ఈ భర్త వర్సెస్ భార్య అనే కాన్సెప్ట్ ఎప్పుడూ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంటుంది. అలాగే 'సేవ్ ది టైగర్స్' వెబ్ సిరీస్ కూడా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. పోలీస్ స్టేషన్ టీవీలో న్యూస్ చెప్పడంతో కామెడీగా ఇంట్రెస్టింగ్ గా సిరీస్ ను స్టార్ట్ చేశారు. అలాగే ఆద్యంతం హాస్య భరితంగా సిరీస్ సాగుతూనే ఉంటుంది. సిరీసులో ని సన్నివేశాలు, కామెడీ డైలాగ్ లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ మధ్య కాలంలో ఇంత బాగా నవ్వుకునే సిరీసులేవి రాలేదు. దాన్ని 'సేవ్ ది టైగర్స్' భర్తీ చేసిందని చెప్పవచ్చు.

ఆలోచింపజేసేలా:వెబ్ సిరీసలో హాస్యం పండిస్తూనే ఇళ్లలో పిల్లల భవిష్యత్తు గురించి పేరెంట్స్ ఆలోచించడం, తల్లిదండ్రుల వ్యాపారం, ప్రవర్తనపై పిల్లల అభిప్రాయాలను ఎమోషనల్ గా బాగా చూపించారు. భార్యాభర్తల గిల్లికజ్జాలు, గొడవలు చూపిస్తూ వెంటనే ప్రేమ, అభిమానంతో కలిసిపోయే సన్నివేశాలు సరదాగా ఆకట్టుకుంటాయి. అయితే అక్కడక్కడ ఊహించని విధంగా వచ్చే బూతులు మాత్రం పిల్లలతో కలిసి చూడలేం. అలాగే తల్లిదండ్రులు బూతులు మాట్లాడితే దాని ప్రభావం పిల్లలపై ఎలా ఉంటుందో కామెడీగా చూపించి ఆలోలిచింపజేసేలా చేశారు.

Save The Tigers Web Series Review And Rating In Telugu

క్లైమాక్స్ మాత్రం:కథ పరంగా కొత్తదనం లేకున్నా పెళ్లైన ఏదో ఒక జంటకు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది ఈ సిరీస్. సహజంగా తరచు ఇంట్లో జరిగే సన్నివేశాలతో అంతర్లీనంగా సందేశాన్ని అందించారు. పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, తండ్రి వ్యాపారంపై పిల్లలు నామోషీగా ఫీలవ్వడం, భర్తను అర్థం చేసుకోలేని భార్య సోషల్ యాక్టివిస్ట్ అవడం, క్రియేటివ్ యాడ్ ఏజెన్సీ సంస్థలపై ఫెమినిస్ట్ ల కేసులు వంటివి బాగా చూపించారు. ఇక ఇందులో భార్యాభర్తల్లో ఏ ఒక్కరి సైడ్ తీసుకోకుండా ఇద్దరికీ సమ న్యాయం చేసేలా చూపించారు. అయితే సిరీస్ మొత్తం బాగున్నా క్లైమాక్స్ అంతగా ఆకట్టుకోదు. కొన్ని పాయింట్స్ వదిలేశారు. ఇంకా కొనసాగుతుంది అని పార్ట్ 2కి హింట్ ఇచ్చారు.

ఎవరెలా చేశారంటే..:ప్రియదర్శి, జోర్దార్ సుజాత తెలంగాణ యాసలో భార్యాభర్తలుగా అదరగొట్టారు. వీళ్ల సీన్లు నవ్వించడమే కాకుండా కథ పరంగా ఎమోషన్స్ కూడా పండిస్తుంది. చైతన్య కృష్ణ కూడా విక్రమ్ పాత్రలో ఆకట్టుకున్నాడు. భార్య, బాస్ పై ఫ్రస్టేషన్స్ వంటివి బాగా చూపించాడు. ఇక అభినవ్ గోమటం కామెడీ టైమింగ్ అదిరింది. ఎక్కువగా అతని వల్లే హాస్యం పండింది. అభినవ్, రోహిణి మధ్య వచ్చే సన్నివేశాలు నవ్విస్తాయి. పావని గంగిరెడ్డి, జోర్దార్ సుజాత, దేవియాని శర్మ భార్యలుగా మంచి నటన కనబర్చారు.

Save The Tigers Web Series Review And Rating In Telugu

అది పక్కన పెడితే:గంగవ్వ, వేణు టిల్లు, హర్షవర్దన్, సునయన, శ్రీకాంత్ అయ్యంగర్ మిగతా నటీనటులు కూడా బాగా చేశారు. నటుడు, డైరెక్టర్ తేజ కాకుమాను ఒక్క బూతుల విషయం పక్కన పెడితే సిరీస్ కు ఎక్కడా గ్లామర్ టచ్ ఇవ్వకుండా ఫ్యామిలీతో కలిసి చూసేలా తెరకెక్కించారు. సినిమా ప్రొడక్షన్ విలువలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతా బాగుంది.

Save The Tigers Web Series Review And Rating In Telugu

ఫైనల్ గా చెప్పాలంటే..:ఈ వెబ్ సిరీసులో జనాలు అందరూ సీరియస్ గా ఉన్నారు.. నవ్వడం మర్చిపోయారు అని చైతన్య కృష్ణ చేత డైలాగ్ చెప్పించారు. నిజంగానే నవ్వడం మర్చిపోయిన వారికి 'సేవ్ ది టైగర్స్' నవ్వు తెప్పిస్తుంది. మొదటి నుంచి ఫన్ జెనరేట్ చేసే వెబ్ సిరీస్ ఇది. 30 నిమిషాల నిడివితో ఆరు ఎపిసోడ్స్ తో ఎక్కువ సాగదీత లేకుండా అలరిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X