twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sebastian PC 524 movie review కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్ కొట్టాడా? మర్డర్ మిస్టరీ ఎలా ఉందంటే?

    |

    Rating:
    2.5/5

    SR కల్యాణ మండపం, రాజావారు రాణిగారు చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకొన్న యువ హీరో కిరణ్ అబ్బవరం తాజాగా సెబాస్టియన్ పీసీ 524 చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. SR కల్యాణ మండపం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో సెబాస్టియన్ పీసీ 524 చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే తన కెరీర్‌లో కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్ విజయాన్ని అందుకొన్నదా? అనే విషయాన్ని తెలుసుకోవాలంటే.. సెబాస్టియన్ పీసీ 524 చిత్రం కథ, కథనాలను సమీక్షించుకోవాల్సిందే..

     సెబాస్టియన్ కథ ఏమిటంటే

    సెబాస్టియన్ కథ ఏమిటంటే


    రేచీకటి వ్యాధితో బాధపడే సెబా అలియాస్ సెబాస్టియన్ (కిరణ్ అబ్బవరం) కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటాడు. అనేక బదిలీల తర్వాత మదనపల్లి పోలీస్ స్టేషన్‌లో నైట్ డ్యూటీ చేస్తుండగా నీలిమా (కోమలి ప్రసాద్) అనే గృహిణి హత్యకు గురవుతుంది. అయితే తాను సరిగా డ్యూటీ చేయలేకపోవడం వల్లే నీలిమా చనిపోయిందనే బాధలో ఉన్న సెబా ఆమె మరణం వెనుక గుట్టును రట్టు చేయాలని అనుకొంటాడు.

    సెబాస్టియన్ పీసీ 524 మూవీలో ట్విస్టులు

    సెబాస్టియన్ పీసీ 524 మూవీలో ట్విస్టులు

    నీలిమా హత్య వెనుక వ్యక్తులను కనుక్కొనే క్రమంలో సెబాకు ఎదురైన సవాళ్లు ఏమిటి? సెబా దర్యాప్తుకు పై అధికారి అంబారామ్ (శ్రీకాంత్ అయ్యంగార్) ఎందుకు అడ్డు తగిలాడు? నీలిమా హత్య భర్త రాహుల్ (ఆదర్శ బాలకృష్ణ) పరిస్థితి ఏమిటి? నీలిమాకు తేజ (రాజా విక్రమ్)కు సంబంధం ఏమిటి? రేచీకటితో బాధపడే సెబాతో హేలీ (నువేక్ష) అఫైర్ ఎలా కొనసాగింది? నీలిమా మరణం విషయంలో ఆవేదన చెందుతున్న సెబాకు తల్లి మేరీ (రోహిణి) ఎలా సపోర్ట్‌గా నిలిచింది అనే ప్రశ్నలకు సమాధానమే సెబాస్టియన్ పీసీ 524 సినిమా కథ.

    దర్శకుడి కథ, కథనాలు

    దర్శకుడి కథ, కథనాలు


    మర్డర్ మిస్టరీకి రేచీకటి అనే కొత్త పాయింట్‌ను జోడించి ఎంచుకొన్న కథ విషయానికి వస్తే దర్శకుడు బాలాజీ సరైన నిర్ణయమే తీసుకొన్నాడనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఆ పాయింట్‌ను తెర మీద ఎమోషనల్‌గా, గ్రిప్పింగ్‌గా, అనుక్షణం ఆసక్తిగా తెరకెక్కించడంలో విఫలమయ్యాడని సినిమా ఆరంభమైన కొద్ది నిమిషాల్లోనే స్పష్టమవుతుంది. అయితే తొలిభాగంలో దర్శకత్వం పరంగా కథను సరిగా ప్రారంభించడంలో తడబాటుకు గురైనప్పటికీ.. ఆ లోపాన్ని కనీసం సెకండాఫ్‌లోనైనా సవరించుకోలేకపోయాడనిపిస్తుంది. కథ, కథనాలు చాలా పేలవంగా సాగడం ఈ సినిమాపై కొంత ప్రతికూల ప్రభావం పడిందని చెప్పవచ్చు.

    కిరణ్ అబ్బవరం ఫెర్ఫార్మెన్స్

    కిరణ్ అబ్బవరం ఫెర్ఫార్మెన్స్


    అసంపూర్ణమైన కథ, కథనాలతో సాగే సెబాస్టియన్ పీసీ 524 సినిమాను కిరణ్ అబ్బవరం తన వంతుగా మరో రేంజ్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ సన్నివేశాలు బలహీనంగా ఉండటంతో విలక్షణమైన నటనను ప్రదర్శించే అవకాశం లభించలేదు. సెబా క్యారెక్టర్ డిజైన్‌లోనే అనేక లోపాలు ఉండటంతో ఆ లోపాలను సరిదిద్దేందుకు శత విధాల ప్రయత్నించారు. ఇక నువేక్షతో రొమాంటిక్ సీన్లలో ఆకట్టుకొన్నాడు. మదర్ సెంటిమెంట్ సీన్లలో కిరణ్ ఫెర్ఫార్మెన్స్‌లో మెచ్యురిటీ కనిపించింది. ఫైట్స్‌లో కూడా స్టైలిష్‌గా కనిపించాడు. మరోసారి కిరణ్ తన యాక్టింగ్‌తో వన్ మ్యాన్ షోగా సినిమాను నడిపించాడు.

    మిగితా నటీనటుల గురించి

    మిగితా నటీనటుల గురించి


    కథలో దమ్ము లేకపోవడం, కథనం ఆసక్తికరంగా సాగపోవడం, పాత్రల డిజైన్ సరిగా లేకపోవడం వల్ల కోమలి ప్రసాద్, శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణి, ఆదర్శ్ బాలకృష్ణ లాంటి నటుల ప్రతిభ బయటకు రాలేకపోయాయనిపిస్తుంది. వీరి ఫెర్ఫార్మెన్స్ రొటీన్‌గా, వేరీ రెగ్యులర్‌గా అనిపిస్తుంది. ఏ ఒక్క పాత్ర కూడా రిజిస్టర్ కాకపోవడం సినిమాకు మైనస్ పాయింట్‌గా మారింది.

    సాంకేతిక నిపుణులు ప్రతిభ గురించి

    సాంకేతిక నిపుణులు ప్రతిభ గురించి


    సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. మ్యూజిక్, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ అన్ని అంశాలు యావరేజ్‌గానే ఉన్నాయి. స్టోరీలో బలమైన పాయింట్, వైవిధ్యం ఉంటే సాంకేతిక నిపుణులు పనితనం కూడా బయటకు కనిపిస్తుంది. బేసిక్‌ లోపాలు ఉండటంతో అన్ని విభాగాల్లో వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కథ ఎమోషనల్‌గా సాగే క్రమంలో ఇంగ్లీష్ సినిమా పాటను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేయడం చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది.

    ఫైనల్ ఎలా ఉందంటే..

    ఫైనల్ ఎలా ఉందంటే..


    మర్డర్ మిస్టరీగా సాగే సెబాస్టియన్ చిత్రంలో కథ, కథనాల కంటే.. క్రైస్తవ మతానికి సంబంధించిన అంశాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారనిపిస్తుంది. దాదాపు ప్రతీ సీన్‌లో క్రైస్తవ మతానికి చెందిన ఎలిమెంట్స్‌ను బలవంతంగా జొప్పించారనిపిస్తుంది. ఓ సందర్భంలో హిందూ మతంపై కూడా సెటైర్ వేశారనిపిస్తుంది. ఇవన్నీ నాణెనికి ఓ వైపు కాగా, మరోవైపు కిరణ్ అబ్బవరం యాక్టింగ్‌తో సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చారని చెప్పవచ్చు. తల్లి పాత్ర, సెబాస్టియన్ మధ్య సన్నివేశాలు ఎమోషనల్‌గా కనిపిస్తాయి.

    Recommended Video

    Kiran Abbavaram Terrific Speech | Sebastian PC524 Trailer Launch | Filmibeat Telugu
    నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు

    నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు


    నటీనటులు: కిరణ్‌ అబ్బవరం, కోమలీ ప్రసాద్‌, నువేక్ష (నమ్రతా దారేకర్‌), శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సూర్య, రోహిణీ రఘువరన్‌, ఆదర్ష్‌ బాలకృష్ణ, జార్జ్‌, సూర్య తదితరులు
    నిర్మాతలు: సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, ప్రమోద్‌, రాజు
    ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: కేఎల్‌ మదన్‌
    కథ, దర్శకత్వం: బాలాజీ సయ్యపురెడ్డి
    సంగీతం: జిబ్రాన్‌
    సినిమాటోగ్రఫి: రాజ్‌ కే నల్లి
    డిజిటల్‌ పార్ట్‌నర్‌: టికెట్‌ ఫ్యాక్టరీ
    మార్కెటింగ్ & బిసినెస్ హెడ్ : చవన్‌ ప్రసాద్‌
    స్టిల్స్‌: కుందన్‌ - శివ
    సౌండ్‌: సింక్‌ సినిమాస్‌ సచిన్‌ సుధాకరన్‌
    కాస్ట్యూమ్స్‌: రెబెకా - అయేషా మరియమ్‌
    ఫైట్స్‌: అంజి మాస్టర్‌
    ఎడిటింగ్: విప్లవ్‌ న్యసదాం
    ఆర్ట్: కిరణ్‌ మామిడి
    నిర్మాణ సంస్థ: జ్యోవిత సినిమాస్‌
    పీఆర్వో: సురేంద్రకుమార్‌ నాయుడు`ఫణి కందుకూరి (బియాండ్‌ మీడియా)
    రిలీజ్ డేట్: 2022-03-04

    English summary
    Young hero Kiran Abbavaram latest movie Sebastian PC 524 hits the theatres on March 04th. Here is the exclusive Review by Telugu filmibeat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X