Don't Miss!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Lifestyle పనీర్ బటర్ మాసాలాను ఇలా రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకోండి..!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నవ్వించే ఫ్యాక్షన్ సీమ శాస్త్రి-సినిమా రివ్యూ
ఎంఎస్ నారాయణ, ఎల్ బి శ్రీరామ్, ముమైత్ ఖాన్, కోవై సరళ, రఘుబాబు తదితరులు.
మాటలు-మరుధూరి రాజా
సంగీతం-వందేమాతరం శ్రీనివాస్
సినిమాటోగ్రాఫర్-అరుణ్
ఎడిటింగ్-రామ్ గోపాల్ రెడ్డి
నిర్మాత-చావలి రామాంజనేయులు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం-జి నాగేశ్వర్ రెడ్డి
విడుదల-నవంబర్ 16,2007
సీమ ఫ్యాక్షనిజం ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకర్షిస్తూనే ఉంది. నిర్మాతల జేబులు నింపుతూనే ఉంది. తాజాగా విడుదలైన సీమశాస్త్రి సినిమా కూడా ఫ్యాక్షనిజం నేపథ్యంలోనే నిర్మితమయింది. ఇక ఫ్యాక్షన్ చిత్రాలు చాలు అన్నట్టుగా ఈ ఫ్యాక్షన్ చిత్రం సాగుతుంది. అంటే వినోదాత్మకంగా సాగుతుందన్నమాట. టైటిల్ కు తగ్గట్టుగానే ఈ సినిమా పూర్తిగా కామెడీ ట్రాక్ మీదే సాగుతుంది. సుబ్రమణ్య శాస్త్రి (అల్లరి నరేష్), సురేఖా రెడ్డి(ఫర్జానా) ప్రేమలో పడతాడు. ప్రేమలో పడ్డప్పుడు సురేఖా రెడ్డి బ్యాక్ గ్రౌండ్ తెలియదు. ప్రేమ ముదిరిన తరువాత సుబ్రమణ్య శాస్త్రికి తెలుస్తుంది సురేఖా రెడ్డి ఫ్యామిలీ ఫ్యాక్షన్ ఫ్యామిలీ అని. శాస్త్రి గారు కూడా ఫ్యాక్షన్ తరహాలోనే వెళ్లి సురేఖా రెడ్డి తల్లి దండ్రులను ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. చివరికి ఏమైందన్నది సీమశాస్త్రిని అడిగితెలుసుకోండి కానీ ఆయన చేసే ప్రయత్నాలు మాత్రం ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తాయి. హీరో హీరోయిన్ లిద్దరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. అల్లరిగా నటించే నరేష్ బ్రాహ్మణ అబ్బాయి పాత్రలో చక్కగా నటించాడు. హీరోయిన్ అందంగా కనిపించింది. పాటలు బాగున్నాయి. మొత్తంగా చెప్పాలంటే కామెడీ చిత్రంగా చెప్పవచ్చు. కామెడీని ఇష్టపడే ప్రేక్షకులు వెంటనే సినిమాకు వెళ్లవచ్చు.
(గమనిక: వినోదం అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు,కథన నైపున్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది. సినిమా జయాపజయాలకు మా రేటింగ్ కు సంబందం ఉండనవసరం లేదు)