పక్కా మసాలా చిత్రం

చిత్రం: సీమసింహం
నటీనటులు: బాలకృష్ణ, సిమ్రాన్, రీమాసేన్,
విశ్వనాథ్, రఘువరణ్, చరణ్ రాజ్, వెన్నిరాడై నిర్మల...
సంగీతం: మణిశర్మ
కథ: చిన్నికృష్ణ
మాటలు: పరుచూరి బ్రదర్స్
నిర్మాతలు: జె.భగవాన్, డి.వి.వి.దానయ్య
దర్శకత్వం: జి.రాంప్రసాద్
నరసింహనాయుడు తర్వాత వచ్చిన చిత్రం కాబట్టి అనివార్యంగా సీమసింహం ఆ స్థాయిలో ఉంటుందని అనుకోవడం సహజం. దానికితోడు ఈ చిత్రం టైటిల్ ను బట్టి ఈ చిత్రం కూడా రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో సాగుతుందనుకుంటాం. కానీ ఈ సినిమా టైటిల్ ఉద్దేశం వేరు. కథ ఒక అతుకుల బొంత. కేవలం బాలకృష్ణ ఇమేజ్ ను క్యాష్ చేసుకునేందుకు చేసిన ప్రయత్నం ఈ చిత్రం. కథారచయిత చిన్నికృష్ణ, రచయితలు పరుచూరి బ్రదర్స్, దర్శకుడు రామ్ ప్రసాద్ ల ఇమ్మెచ్యురిటీకి నిదర్శనం ఈ సినిమా. ఇంకా చెప్పాలంటే వీరి తెలివి తక్కువ తనానికి, అవగహనా రాహిత్యానికి ప్రతిరూపం. తెలంగాణలో ఫ్యాక్షనిజం ఉందా? ఇండియాలో మెర్సీ కిల్లింగ్ చట్టబద్దమా? ఇటువంటి చాలా చిన్న విషయాలు కూడా తెలియని వీరు కలిసి వండిన 'రసవత్తర వంటకమే' ఈ సినిమా. ప్రేక్షకులు బుర్రను పక్కన పెట్టి ఈ సినిమా చూడాలి అని ముందే ప్రకటిస్తే బాగుండేది.
గతంలో ఇదే టీం(దర్శకుడి మినహా) అందరూ చూడగలిగే (సినిమాటిక్ గా కాస్తా రీజనబుల్ ) నరసింహనాయుడు, సమరసింహరెడ్డి లాంటి చిత్రాలు అందించారు. ఈ చిత్రాల వల్ల బాలకృష్ణకు వచ్చిన ఇమేజ్ ను క్యాష్ చేసుకోవాలనుకోవడమే ఈ చిత్రం ఉద్దేశం. ఆ సినిమాల్లో మాదిరిగా కన్విన్సింగ్ గా చెపితే సినిమా చూడడానికి బాగుండేది. ఆ సినిమాల్లో హీరోకు ఒక మోటివ్ ఉంది. అందుకే అందులో హీరోయిజిమ్ బాగా ఎలివేట్ అయింది. కానీ ఇందులో పాత్రకే, ఒక సరైనా ఐడెంటిటీ లేదు. లక్ష్యమూ లేదు. ఈ చిత్రంలోని మిగతా పాత్రలకు అంతగా ఐడెంటిటీ ఉండదు. కేవలం పాత్రలు అంతే. లాజిక్ కు అందకపోవడం ఈ చిత్రంలో ప్రధాన లోపం.
కథ గురించి చెప్పాలంటే రఘువరన్, చరణ్ రాజ్ లిద్దరూ ప్రాణ స్నేహితులు. కానీ చరణ్ రాజ్ వల్ల రఘువరన్ కొడుకు మరణిస్తాడు. దాంతో వారిద్దరి స్నేహం శత్రుత్వంగా మారుతుంది. చరణ్ రాజ్ కొడుకును చంపి తన పగ తీర్చుకుంటానని రఘు శపథం చేస్తాడు. అందుకు రౌడీ బాలకృష్ణను నియమిస్తాడు. బాలకృష్ణ ఈ పనిలో ఉండగా, రీమసేన్ ఇతనితో డీంసాంగ్స్ పనిలో ఉంటుంది. బాలయ్య చరణ్ రాజ్ కొడుకును చంపివేస్తాడు. ఇక రీమాకు, బాలయ్యకు పెళ్ళి చేద్దామనుకునే సమయంలో కథలో మలుపు. ఇక్కడ బాలకృష్ణ ఫ్లాష్ బ్యాక్ మొదలు పెడుతాడు.
తెలంగాణలోని ఒక మూరుమూల ఊర్లో అక్కడ ఆ నియోజకవర్గం ఎంపీ చెప్పంది వేదం. అతన్ని తుదమొట్టించడం అనేది ఒక్క ఎస్.పి. బాలకృష్ణ వల్ల అవుతుందన్నమాట. మన హీరో అతన్ని జైల్లో వేస్తాడు. ఇతని హీరోయిజాన్ని చూసి సిమ్రాన్ ప్రేమిస్తుంది. కానీ వీరి పెళ్ళి జరిగే సమయంలో బాలకృష్ణకు అసలు విషయం తెలుస్తుంది. తన తండ్రి చరణ్ రాజు అని....సో ఒక మిగతా మిషన్ ను హీరోగారు ఎలా పాజిబుల్ చేస్తారనేది చిత్రం.
ఈ సినిమాలో మగాడు అనే పదం ఎన్ని సార్లు వస్తుందో మీరు కరెక్ట్ గా లెక్కిస్తే పరుచూరి బ్రదర్స్ మీకు మంచి ప్రైజ్ ఇచ్చినా ఇస్తారు. మొలతాడు, మగాడివేనా....ఇలాంటి యూజువల్ పదాలతో సినిమాను నింపేశారు. బాలకృష్ణ నటన తన సహజ ధోరణిలో చేశాడు. మిగతా వారి నటన గురించి చెప్పుకునేంత సీన్ లేదు. మణిశర్మ సంగీతం మరీ పేలవంగా ఉంది. ఫోటోగ్రఫీ కూడా సాధారణం. అంతా తప్పుల తడకే ఈ చిత్రం.


Click it and Unblock the Notifications











