twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అర్థంపర్థం లేని సీతయ్య

    By Staff
    |

    Seetaiah
    -జలపతి గూడెల్లి
    చిత్రం: సీతయ్య
    నటీనటులు: హరికృష్ణ, సిమ్రాన్‌, సౌందర్య, ముఖేష్‌ రుషి, తదితరులు
    సంగీతం: ఎం.ఎం.కీరవాణి
    కథ, స్క్రీన్‌ ప్లే, నిర్మాత, దర్శకత్వం: వై.వి.ఎస్‌.చౌదరి

    దర్శకుడు వై.వి.ఎస్‌.చైదరి మరో సారి గతితప్పాడు. ఒక విజయం లభించగానే ఆ మత్తులో పడి తప్పులు చేయడం చాలా దర్శకులకున్న వీక్‌ నెస్‌. అదే పొరపాటు చౌదరి చేశాడు. హరికృష్ణకున్న ఇమేజ్‌, కీరవాణి పాటల మహత్యం వల్ల ఆయన గత చిత్రం లాహిరి..లాహిరి..లాహిరిలో విజయం సాధించింది. సో..వీటినే పెట్టుకొని సినిమా తీయాలన్న ప్రయత్నమే 'సీతయ్య'. ఏడు పాటలున్నాయి. ఏడు పాటలు వినడానికి బ్రహ్మండంగా ఉన్నా, అవి సినిమాలో ఎక్కడా పొసగవు. ఈ పాటలు, ఒక హరికృష్ణ ఆవేశపూరిమైన డైలాగ్‌, ఫైట్‌ ..దీనితో..సినిమా అల్లుకున్నారు.

    ఇంతా చేసి..క్లైమాక్స్‌ ను మరీ పేలవంగా చేయడం ఈ సినిమాలో అతిపెద్ద జోక్‌. 'సీతయ్య' అనే సిఐ విలన్‌, వారి ముఠాను అంతమొందిస్తానని చెప్పి..చివర్లో ఎటువంటి ఆయుధం లేకుండా వెళుతాడు. విలన్‌ లు రెండు కత్తులు పట్టుకొని హరికృష్ణ పోటులు పొడుస్తారు. వెంటనే మన హీరోగారు..'ఆ..' అని ఒక సంఘసంస్కర్త టైప్‌ లో ఓ డైలాగ్‌ చెప్పుతాడు. మళ్ళీ రెండు తల్వార్లతో రెండు పోటులు..హీరో డైలాగ్‌ లు..దీంతో డైలాగ్‌ లకు కరిగిపోయి విలన్‌ మారిపోతాడు. ఇలాంటి పాత కాలం నాటి క్లైమాక్స్‌ నవ్వు తెప్పించే దృశ్యాలున్నాయి ఈ చిత్రంలో.

    కథ ఏమిటంటే..సీతయ్య అనే సర్కిల్‌ ఇన్‌ స్పెక్టర్‌ ఎవ్వరి మాటా వినడు. ఆఖరికి డిఎస్పీ మాటా కూడా (ఎందుకంటే ఆయన చెవిలో దూది పెట్టుకుంటాడు). రాయలసీమలో ఫ్యాక్షనిజం అంతమొందించడమే ఆయన పని. ఫ్యాక్షనిస్ట్‌ ల కుటుంబమైన ముఖేష్‌ రుషితో సీతయ్య ఢీ. మధ్యలో సిమ్రాన్‌ సీతయ్యతో పాటలు పాడడం..కలలు కనడం..తర్వాత..సీతయ్య సీతయ్య కాదని..శివయ్య అని తెలుస్తుంది (ఫ్యాక్షనిజం అన్న తర్వాత మారు పేరులు, ప్లాఫ్‌ బ్యాక్‌ లుండాలి కదా).

    ఈ శివయ్య కుటుంబం కూడా ఫ్యాక్షన్‌ కుటుంబమే. అయితే, ఈ ఫ్యాక్షన్‌ వల్లే ఆయన భార్య (సౌందర్య) చనిపోతుంది. దాంతో వారు ఫ్యాక్షన్‌ వదిలిపెడుతారు. ఇక సీమ మొత్తంలోనే ఫ్యాక్షనిజాన్ని అంతమొందించేందుకు శివయ్య సీతయ్య అవుతాడు. చివర్లో ఇంతకుముందే చెప్పినట్లు..క్లైమాక్స్‌. సిమ్రాన్‌ ను పెళ్ళి చేసుకోకపోవడం మరో జోక్‌.

    సినిమా ఆసాంతం హరికృష్ణ పాత్రే. ఆయన ధోరణిలో బాగానే చేశారు. సిమ్రాన్‌ పాత్ర పాటలకే పరిమితం. మిగతా వారి వారి పాత్రల్లో ఫర్వాలేదనిపించారు. సంగీతం సినిమాకు హైలెట్‌. కాకపోతే, క్యాసెట్‌ కొని వినడమే బెటర్‌. చాలా మోస్తారు ఫ్యాక్షన్‌ సినిమా ఇది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X