'సీతాకోక చిలుక' చూడొచ్చు

విడుదల తేదీ: 07-07-2006
నటీ నటులు: నవదీప్, షీలా, పృథ్వీ, శుభలేఖ సుధాకర్, సంగీత, తదితరులు
సంగీతం: మణిశర్మ
దర్శకుడు: ఎ. ఆర్. రాజా
లవ్ స్టోరీస్‌లో కొత్త ట్రెండ్‌ని తీసుకొచ్చిన పాత 'సీతాకోక చిలుక'కు అదే పేరుతో రూపొందిన ఈ చిత్రానికి ఒక్క పేరులో తప్ప మరే విధంగానూ సంబంధం లేదు. పోలీకా లేదు. దానికీ, దీనికీ కామన్‌గా చెప్పవలసిన అంశమేమన్నా ఉందా అంటే అది పల్లెటూరి బ్యాక్‌డ్రాప్ ఒక్కటే. అయితే రిచ్‌నెస్, ఫ్రెష్‌నెస్ కలసి తాజా 'సీతాకోక చిలుక'ను చూడదగ్గ స్థాయిలో ఉంచడం ఈ సినిమాకి వున్న ప్లస్ పాయింట్. ఇది దర్శకుడి ప్రతిభకి, నిర్మాతల అభిరుచికి తార్కాణంగా నిలుస్తుంది.
కథ విషయానికి వస్తే కొత్తదనం ఏమీ లేదు కానీ, దాన్ని ప్రెజెంట్ చేసిన తీరులోనే ఒక నూతనత్వం కనపడుతుంది. పోలీస్ ఎస్కార్టుతో చదివి, పరీక్షలు రాసి యూనివర్శిటీ గోల్డ్‌మెడల్ సాధించిన శ్రీనివాస్ (నవదీప్) అభినందన సభలో ఆ జిల్లా కలెక్టర్ (సుహాసిని) అతని ఫ్లాష్‌బ్యాక్ చెప్పమనడంతో సినిమా ప్రారంభమవుతుంది.
అసలు కథలో శ్రీనివాస్ (నవదీప్), లక్ష్మి (షీలా) ఒకే ఊరికి చెందినవారు. సిటీ బస్సులో పక్క ఊరెళ్లి కాలేజీలో చదువుకుంటుంటారు. లక్ష్మిని పెళ్లి చేసుకుని ఆస్తి అంతా దక్కించుకోవాలని చూసే ఆమె అక్క మొగుడు పృథ్వీ, అతడిని నమ్మే ఆమె తండ్రి విజయకుమార్, అక్క సురేఖ వాణి, తల్లి సంగీత హీరోయిన్ కుటుంబం. తండ్రి శుభలేఖ సుధాకర్, బామ్మ మనోరమ, ఒక తమ్ముడు హీరో కుటుంబం.
టీనేజ్ మేజిక్ వర్కవుట్ అయి ఇద్దరు ప్రేమలో పడడం, దానికి హీరోయిన్ బావ అడ్డం పడడం వంటివి క్లైమాక్స్‌కి దారి తీసినా అంతవరకూ కొత్త సన్నివేశాలతో దర్శకుడు ఏ. ఆర్. రాజా ఇంట్రెస్టింగ్‌గా రూపొందించారు. మణిశర్మ సంగీతం ఎస్సెట్ అనే చెప్పాలి. నవదీప్, షీలా చాలా బాగా చేశారు. పృథ్వీ నటన ఈ సినిమాకి బ్యాక్‌బోన్. కామెడీ, రోమాన్స్ సమపాళ్లలో రంగరించిన ఈ సీతాకోక చిలుక మొత్తానికి డిజప్పాయింట్ చేయ్యని చూడదగ్గ సినిమా.
గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.


Click it and Unblock the Notifications











