twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Seetimaarr Movie Review : సీటీ కొట్టించిన గోపీచంద్.. రొటీన్ కధే కానీ!

    |

    Rating: 2.75/5

    ఎప్పుడో లౌక్యం సినిమా తర్వాత సరైన హిట్ కొట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్న గోపీచంద్ ఈ రోజు సీటీమార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ స్పోర్ట్స్ డ్రామా సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా సెప్టెంబర్ 10 వినాయక చవితి సందర్భంగా తెలుగు రాష్ట్రాల లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల అయ్యింది.

    ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదల కాగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. గోపీచంద్ కు జంటగా తమన్నా, దిగంగన సూర్యవంశీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా గోపీచంద్ కు మళ్లీ హిట్ అందించిందా? గోపీచంద్ ఎలా సీటీమార్ కొట్టించాడు? అనే విషయంలోకి వెళితే

    సీటీమార్ కథ ఏమిటంటే

    సీటీమార్ కథ ఏమిటంటే

    తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం కి చెందిన కార్తీక్(గోపీచంద్) కబడ్డీ ఆటగాడు. స్పోర్ట్స్ కోటాలో బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం సంపాదించి సొంత ఊరిలోనే ఉద్యోగం చేస్తూ ఉంటాడు. తండ్రి చిన్నప్పుడే మరణించగా తల్లి(ప్రగతి), అక్క భూమి(భూమిక)లే ప్రాణంగా గడుపుతుంటాడు. అలాగే తన తండ్రి ఆస్తిపాస్తులన్నీ అమ్మి కట్టించిన స్కూల్ పిల్లలకి కబడ్డీ కోచ్ గా కూడా వ్యవహరిస్తూ ఉంటాడు.

    స్కూల్ ఉనికే ప్రమాదంలో పడటంతో ఆ స్కూల్ ని తిరిగి దక్కించుకోవాలి అంటే కబడ్డీ ఆట ద్వారా నేషనల్లో విన్ అయితే ఒక అవకాశం ఉంటుందని తద్వారా ప్రయత్నం చేస్తుంటారు. నేషనల్ కబడ్డీ పోటీలకు ఢిల్లీ వెళ్లగా అక్కడ ఈ జట్టు అనూహ్యమైన పరిస్థితుల్లో కిడ్నాప్ గురవుతుంది. కిడ్నాప్ కు గురైన జట్టు మళ్ళీ కబడ్డీ ఆడిందా? అసలు ఈ జట్టును కిడ్నాప్ చేసింది ఎవరు? తిరిగి కార్తీక్ ఊరికి స్కూల్ దక్కుతుందా? అనేదే ఈ సినిమా కథ.

    సీటీమార్ సినిమాలో ట్విస్టులు

    సీటీమార్ సినిమాలో ట్విస్టులు

    అసలు స్కూల్ ఎందుకు ప్రమాదంలో పడుతుంది ? ఆస్తులన్నీ అమ్మేసి కట్టిన స్కూల్ ని ఎవరు ప్రమాదంలో పడేస్తారు? ఊరిలో ఉన్న కడియం బ్రదర్ (రావు రమేష్)తో కార్తీక్( గోపీచంద్)కి వచ్చిన సమస్య ఏమిటి?, ఆయన కుమార్తె(దిగంగనా సూర్యవంశీ)తో కార్తీక్ కి సంబంధం ఏంటి, తెలంగాణ కబడ్డీ జట్టు కోచ్ జ్వాలా రెడ్డి(తమన్నా)తో గోపీచంద్ ఎందుకు గొడవ పడతాడు? అనూహ్యంగా జ్వాలా రెడ్డి కార్తిక్ కి ఎలా సహాయం చేస్తుంది? అసలు మఖన్ సింగ్(తరుణ్ అరోరా), అరవింద్(రెహమాన్) గొడవలోకి కార్తీక్ ఎందుకు ఎంటర్ అవుతాడు? కార్తీక్ ఎంటర్ అవడం వల్ల జరిగిన పరిణామాలు ఏమిటి? అనే ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ సీటీమార్ కథ.

    సీటీమార్ సినిమా ఎలా సాగింది అంటే

    సీటీమార్ సినిమా ఎలా సాగింది అంటే

    సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి గ్రామీణ నేపథ్యంలోనే సినిమా సాగుతుంది. సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా అని ముందు నుంచి ప్రచారం చేస్తూ వస్తున్నారు, అది కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగా కనెక్ట్ అయ్యే కబడ్డీ బ్యాక్ డ్రాప్ దానికి ఒక ఊరి స్కూల్ సమస్య ను కనెక్ట్ చేసి చాలా రొటీన్ గా మనం ఫీలయ్యే కథను కూడా కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు సంపత్ నంది. అయితే మొదటి హాఫ్ మొత్తం కూడా చాలా సాగతీత ధోరణిలో సాగింది, ఎప్పుడైతే గోపీచంద్ ఆంధ్ర ప్రదేశ్ గర్ల్స్ కబడ్డీ టీంతో ఢిల్లీలో అడుగుపెడతాడో అప్పటి నుంచి సినిమా ఆసక్తికరంగా మారుతుంది.

    కబడ్డీ టీమ్ మొత్తాన్ని కిడ్నాప్ చేయడం, ఆ కిడ్నాప్ చేసిన వారందరినీ విడిపించే క్రమంలో గోపీచంద్ చేసిన ప్రయత్నాలు ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకునే విధంగా సాగాయి. సినిమాకి మైనస్ ఏమిటంటే తర్వాత ఏం జరగబోతోంది అనే సస్పెన్స్ లేకుండా ముందు ఏం జరగబోతోంది అనే విషయం కాస్త సినిమా అవగాహన ఉన్న ప్రేక్షకుడికి ఇట్టే అర్థమైపోతుంది. అయితే ఇద్దరు హీరోయిన్లు పెట్టినా అసలు ఏ మాత్రం రొమాన్స్ జోలికి వెళ్లక పోవడం గమనార్హం.

    సంపత్ నంది పనితనం ఎలా ఉంది అంటే

    సంపత్ నంది పనితనం ఎలా ఉంది అంటే

    ఈ సినిమా కొత్త కథ ఏమీ కాదు సినిమా ఓపెనింగ్ మొదలు చివరి క్లైమాక్స్ సీన్ వరకు తర్వాత సీన్ ఏమిటి అని సగటు ప్రేక్షకుడు అంచనా వేసే అంత పాత కధ, అయినా సరే తెలిసిన కథని చూస్తున్న ప్రేక్షకులు సీట్ నుంచి కదలకుండా తెర మీద దృష్టి పెట్టే విధంగా మ్యాజిక్ చేశాడు సంపత్ నంది. థియేటర్ లో స్క్రీన్ మీద మనకు తెలిసిన సీన్లే కనపడుతున్నా సరే చాలా ఎంగేజింగ్ గా చూపించగలిగాడు.

    సినిమా మొత్తం ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేసే విధంగా రూపొందించుకున్నాడు. అయితే సెకండ్ హాఫ్ లో చూపించే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో ఎందుకొ కార్తి హీరోగా వచ్చిన ఖాకీ సినిమా ఇన్స్పిరేషన్ తీసుకున్నట్లు అనిపించింది.

    గోపీచంద్ నటన

    గోపీచంద్ నటన

    ఆరడుగుల గోపీచంద్ ఈ మధ్యకాలంలో హిట్ కొట్టి చాలా కాలమే అయింది. లౌక్యం సినిమా తర్వాత ఆ రేంజ్ లో హిట్ అయిన సినిమాలు ఒక్కటి కూడా లేవు, చాలా కాలం తర్వాత ఆయన కరువు తీరే విధంగా ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు ఒక రకమైన విందుభోజనం మారింది. బి, సి సెంటర్ల ఆడియన్స్ కు ఈ సినిమా ఖచ్చితంగా ఆకట్టుకునే విధంగా రూపొందించాడు సంపత్ నంది. హీరో, విలన్ మధ్య జరిగే ప్రతి సన్నివేశం కూడా ఆసక్తికరంగా సాగుతోంది. అలాగే కోచ్ గా గోపీచంద్ నటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు, అంతలా బాగుంది.. మొత్తం మీద గోపీచంద్ అన్నీ తన భుజాల మీద వేసుకొని నడిపించాడు అని చెప్పవచ్చు

    తమన్నా దిగంగన నటన విషయానికి వస్తే

    తమన్నా దిగంగన నటన విషయానికి వస్తే

    ఈ సినిమాకి ఇద్దరు హీరోయిన్లను ఎంచుకున్నాడు దర్శకుడు సంపత్ నంది. జ్వాలా రెడ్డి గా తమన్నా అలాగే సిటీ కేబుల్ న్యూస్ రీడర్ పాత్రలో దిగంగన సూర్యవంశీ ఇద్దరినీ తీసుకున్నా సరే పెద్దగా వారి నటనకు ప్రాధాన్యత ఉన్న దాఖలాలు లేవు. తమన్నా స్క్రీన్ ప్రెజెన్స్ దిగంగన స్క్రీన్ ప్రెజెన్స్ కంటే ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పుకునే ప్రయత్నం చేయడం, అందులోనూ తెలంగాణ యాస ప్రయత్నించడంతో కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది.

    రావు రమేష్, ప్రగతి, పోసాని తదితరుల నటన విషయానికి వస్తే

    రావు రమేష్, ప్రగతి, పోసాని తదితరుల నటన విషయానికి వస్తే

    సినిమాలో చాలా మంది సీనియర్ నటీనటులు కనిపించారు. గోపీచంద్ అక్క పాత్రలో భూమిక, బావ పాత్రలో రెహమాన్, తల్లి పాత్రలో ప్రగతి కనిపించగా ఊరిలో ఆడపిల్లల తండ్రులుగా పోసాని కృష్ణ మురళి, దివంగత టి ఎన్ ఆర్, నాగ మహేష్, లాంటి వాళ్లు కనిపించి తమదైన నటన కనబరిచారు. అలాగే కడియం బ్రదర్స్ లో ఒకరిగా రావు రమేష్ తనదైన హాస్యం పండించారు.. రావు రమేష్ కనిపించేది తక్కువ సేపే అయినా ఆయన మాట్లాడిన ప్రతి డైలాగ్ థియేటర్ లో నవ్వులు తెప్పించింది.. ఇక కబడ్డీ ప్లేయర్స్ గా నటించిన ప్రీతి అస్రానీ, టెలివిజన్ నటుడు ప్రభాకర్ కుమార్తె అలాగే ఇతర నటీమణులు కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక అప్సరా రాణి పెప్సీ ఆంటీ సాంగ్ తో ఆకట్టుకుంది.

    టెక్నికల్ విషయానికి వస్తే

    టెక్నికల్ విషయానికి వస్తే

    ఈ సినిమాలో టెక్నికల్ పరంగా ముఖ్యంగా ప్రస్తావించాల్సి రెండే రెండు, ఒకటి సినిమాటోగ్రఫీ అలాగే మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్. అలాగే డైలాగ్స్ స్వయంగా సంపత్ నంది రాశారో లేక డైలాగ్ రైటర్ ను పెట్టుకున్నారో తెలియదు కానీ ప్రతి డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అటు కామెడీ, ఎమోషనల్ అన్ని యాంగిల్స్ ని కవర్ చేస్తూ ప్రతి డైలాగ్ గుర్తుంచుకునే విధంగా రాసుకున్నారు.

    మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే సెకండ్ హాఫ్ మొత్తానికి ఒకరకంగా ప్రాణం అని చెప్పవచ్చు. సినిమా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే బాగా కుదిరింది. ప్రేక్షకులను సీట్లకు అతుక్కునేలా చేసిందని చెప్పవచ్చు. ఇక సినిమాలో పాటలు బాగా హైలెట్ అయ్యాయి ఒకటి రెండు పాటలు ప్రేక్షకులకు అంతగా నచ్చకపోయినా మిగతా పాటలన్నీ బాగున్నాయి, ఇక ఫస్ట్ హాఫ్ లో ఎడిటర్ తన కత్తెరకు పని పెట్టి ఉంటే బాగుండేది. ఇక నిర్మాత నిర్మాణ విలువలు కూడా అత్యద్భుతంగా ఉన్నాయి.

    ఫైనల్ గా సిటీ మార్ విషయానికి వస్తే విషయానికి వస్తే

    ఫైనల్ గా సిటీ మార్ విషయానికి వస్తే విషయానికి వస్తే

    ఈ సినిమా మా రొటీన్ కథే అయినా పేరుకు తగ్గట్టే సీటీమార్ కొట్టించే విధంగా రూపొందించారు. అసలు ఈ సీటీమార్ టైటిల్ ఎందుకు పెట్టారు అని జస్టిఫికేషన్ కూడా ప్రీ క్లైమాక్స్ లో ప్రేక్షకులకు అందించేశారు. ప్రయోగాల జోలికి పోకుండా కమర్షియల్ ఫార్మాట్లో సంపత్ నంది రూపొందించిన ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చి తీరుతుంది. ఒకపక్క గ్రామీణ వాతావరణాన్ని చూపిస్తూనే ఆడపిల్లల ధైర్యం విషయంలో ఆడ పిల్లలను ఎలా పెంచాలి అనే విషయంలో గోపీచంద్ డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్కి వెళ్లిన ప్రేక్షకుడు మిక్స్డ్ ఎమోషన్స్ తో బయటికి వస్తాడు, ఈ పండుగకు సరదాగా ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమా సీటీమార్.

    Recommended Video

    Gem Movie Team Special Interview With Racha Ravi
    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు: గోపీచంద్, తమన్నా, దిగంగనా, భూమిక, రెహమాన్, ప్రగతి, పోసాని కృష్ణ మురళి, దివంగత టి ఎన్ ఆర్, నాగ మహేష్, ప్రీతి అస్రానీ, అప్సరా రాణి, రావు రమేష్ , తదితరులు
    కథ, దర్శకత్వం: సంపత్ నంది
    నిర్మాతలు: శ్రీనివాస చిట్టూరి
    సినిమాటోగ్రఫి: సౌందరరాజన్
    మ్యూజిక్: మణి శర్మ

    English summary
    Seetimaarr is a 2021 Telugu sports action film directed by Sampath Nandi and produced by Srinivasaa Chitturi under the banner of Srinivasaa Silver Screen, starring Gopichand and Tamannaah. here is the review
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X