twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాదీ ముబారక్ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating: 2.5/5
    నటీనటులు: సాగర్ ఆర్కే నాయుడు, దృశ్య రఘునాథ్, రాహుల్ రామకృష్ణ, బెనర్జీ, హేమ, రాజశ్రీ నాయర్, అదితి మ్యాకాల్ తదితరులు
    డైరెక్టర్: పద్మశ్రీ
    ప్రొడ్యూసర్: దిల్ రాజు, శిరీష్
    మ్యూజిక్ డైరెక్టర్ం సునీల్ కశ్యప్
    సినిమాటోగ్రఫి: శ్రీకాంత్ నరోజ్
    ఎడిటర్: మధు చింతల
    బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
    రిలీజ్ డేట్: 2021-03-05

     షాదీ ముబారక్ కథ

    షాదీ ముబారక్ కథ

    మాధవ్ (సాగర్ ఆర్కే నాయుడు) ఎన్నారై. ఆస్ట్రేలియాకు చెందిన మాధవ్ పెళ్లి చూపుల కోసం హైదరాబాద్ వస్తాడు. మ్యారేజ్ బ్యూరో ఓనర్ కూతురు తుపాకుల సత్యభామ (దృశ్య రఘునాథ్). తన తల్లికి యాక్సిడెంట్ కావడంతో మ్యారేజ్ బ్యూరో తరఫున మాధవ్‌తో కలిసి సత్యభామ పెళ్లి చూపులకు హాజరవుతుంది. అయితే తాను చూసిన అమ్మాయిలెవరూ మాధవ్‌కు నచ్చరు. ఈ క్రమంలో సత్యభామ, మాధవ్ ఒకరికొకరు ప్రేమలో పడుతారు.

    షాదీ ముబారక్ ట్విస్టులు

    షాదీ ముబారక్ ట్విస్టులు

    సత్యభామతో ప్రేమలో పడిన మాధవ్ ఏ విధంగా ఆమెను ఒప్పించాడు. ప్రేమలో ఉండగా రొమాంటిక్ లైఫ్ ఎలా సాగింది. వారి మధ్య ఎలాంటి గిల్లికజ్జాలు చోటుచేసుకొన్నాయి. చివరకు సత్యభామను మాధవ్ పెళ్లి చేసుకొన్నారా అనే ప్రశ్నలక సమాధానమే షాదీ ముబారక్.

    సాగర్ ఆర్కే నాయుడు పెర్ఫార్మెన్స్

    సాగర్ ఆర్కే నాయుడు పెర్ఫార్మెన్స్

    బుల్లితెర మీద మొగలిరేకులు సీరియల్‌తో లక్షలాది మంది ప్రేక్షకులను ఆకట్టుకొన్న సాగర్ ఆర్కే నాయుడు మాధవ్‌‌గా నటించాడు. సాగర్ లుక్స్ కాకుండా తెర మీద రొమాంటిక్ లవర్‌గా మంచి ఫెర్ఫార్మెన్స్‌ను ప్రదర్శించాడు. కామెడీ సీన్లలో కూడా ఆకట్టుకొన్నాడు.

     ఇతర నటీనటుల పెర్ఫార్మెన్స్

    ఇతర నటీనటుల పెర్ఫార్మెన్స్

    ఇక సత్యభామగా దృశ్య రఘునాథ్ తనదైన శైలిలో ఆకట్టుకొన్నది. అందం, అభినయంతో మెప్పించింది. చిరు కోపాన్ని ప్రదర్శించడంలో అలరించింది. రాహుల్ రామకృష్ణ యాక్టింగ్ బాగుంది. మిగితా పాత్రల్లో కమెడియన్ భద్రం, అజయ్ ఘోష్, శత్రు తదితరులు ఆకట్టుకొన్నారు.

    తొలి చిత్ర దర్శకుడిగా

    తొలి చిత్ర దర్శకుడిగా

    ఇక దర్శకుడు పద్మశ్రీ తొలి చిత్రంతోనే మంచి ఫలితాన్ని రాబట్టారని చెప్పవచ్చు. రచయితగా, డైరెక్టర్‌గా మెప్పించాడు. రొమాన్స్, కామెడీ అంశాలతో ఫర్‌ఫెక్ట్ ఫీల్‌గుడ్ చిత్రంగా రూపొందించడంలో సక్సెస్ అయ్యారు.

    టెక్నికల్‌ టీమ్ గురించి

    టెక్నికల్‌ టీమ్ గురించి

    ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సునీల్ కశ్యప్ అందించిన మ్యూజిక్ బాగుంది. రొమాంటిక్ కామెడీ చిత్రానికి, సన్నివేశాలకు తన మ్యూజిక్‌తో మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. శ్రీకాంత్ నరోజ్ సినిమాటోగ్రఫి, మధు చింతల ఎడిటింగ్ బాగుంది.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా


    షాదీ ముబారక్‌ సినిమా గురించి చెప్పాలంటే క్లీన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. యూత్‌కు నచ్చే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇటీవల కాలంలో తెలుగులో వచ్చిన మంచి లవ్ అండ్ కామెడీ చిత్రం. అన్ని వర్గాలు ఆదరించే విధంగా ఈ చిత్రాన్ని పద్మశ్రీ రూపొందించారు.

    English summary
    Shaadi Mubarak movie released on March 5 of 2021. Sagar RK Naidu, Drushya Raghunath are lead pair, Padmsri is the debutant director. Dil Raju, Sirish are producer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X