Shaakuntalam Review సమంత ఎలా చేసింది? గుణశేఖర్ సక్సెస్ కొట్టాడా?
నటీనటులు: సమంత రుత్ ప్రభు, దేవ్ మోహన్, సచిన్ ఖేడ్కర్, మోహన్ బాబు, అనన్య నాగళ్ల, ప్రకాశ్ రాజ్, జిషుసేన్ గుప్తా, అల్లు అర్హ, వర్షిణి సౌందర్ రాజన్ తదితరులు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గుణశేఖర్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
నిర్మాతలు: నీలిమ గుణ
సమర్పణ: దిల్ రాజు
సినిమాటోగ్రఫి: శేఖర్ వీ జోసెఫ్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
బ్యానర్స్: గుణ టీమ్ వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
రిలీజ్ డేట్: 2023-04-14
శాకుంతలం కథ..
విశ్వామిత్రుడి తపస్సు భంగం కలిగించడానికి భూమిపైకి వచ్చిన మేనక (మధుబాల) ఇంద్రుడు (జిషుసేన్ గుప్తా) ప్లాన్‌లో భాగంగా అతడితో ప్రేమలో పడి ఓ బిడ్డను కంటుంది. దేవలోకానికి మానవుల ప్రవేశం లేకపోవడం వల్ల బిడ్డను అడివిలోనే వదిలేసి వెళ్తుంది. అనాధగా మారిన బిడ్డను కణ్వ మహర్షి (సచిన్ ఖేడ్కర్) చేరదీసి శాకుంతల అని పేరు పెడుతాడు. ఆ ప్రాంతానికి వచ్చిన దుష్యంత మహారాజు (దేవ్ మోహన్) శాకుంతల తొలి చూపులోనే ఒకర్నికొకరు ప్రేమించుకొని గాంధర్వ వివాహం చేసుకొంటారు. ఆ తర్వాత తన రాజ్యానికి వెళ్లి అధికారికంగా పట్టపు రాణి చేసుకొంటానని మాటిచ్చి గర్బవతిగా ఉన్న శాకుంతలను కన్వ మహర్షి ఆశ్రమంలో వదిలేసి వెళ్తాడు. అయితే కన్వ మహర్షి ఇంటికి దుర్వాస మహాముని (మోహన్ బాబు) తనను ఓ కారణంగా అవమానించిందని శాకుంతలను శపిస్తాడు.

శాకుంతలం మూవీలో ట్విస్టులు
శకుంతలను దుర్వాస ముని ఎందుకు శపించాడు? దుర్వాస ముని శపించిన తర్వాత శకుంతల జీవితంలో ఎలాంటి పరిస్థితులు సంభవించాయి. తనను భర్తగా స్వీకరించమని దుష్యంత మహారాజు వద్దకు వెళ్లిన శకుంతలకు ఏం జరిగింది? శకుంతలను భార్యగా స్వీకరించడానికి దుష్యంతుడు ఎందుకు నిరాకరించాడు? శకుంతలకు శాప విమోచనం ఏమిటి? దుష్యంతుడికి రాక్షస సేనకు శతృతం వెనుక కారణం ఏమిటి? చివరకు శకుంతలను దుష్యంతుడు స్వీకరించాడా? శకుంతలకు పుట్టిన కొడుకు సర్వదమన్ (అల్లు అర్హ)ను వారసుడిగా స్వీకరించాడా? అనే ప్రశ్నలకు సమాధానమే శాకుంతలం సినిమా కథ.
ఫస్టాఫ్ ఎలా ఉందంటే?
ఇంద్రుడి ప్లాన్‌లో భాగంగా మేనక భూమిపైకి వచ్చి విశ్వామిత్రుడి తపస్పు భంగం కలిగించడంతో కథ మొదలవుతుంది. ఆ తర్వాత విశ్వామిత్రుడు, మేనక ప్రేమించుకోవడం, శారీరకంగా కలవడంతో శకుంతల జన్మకు కారణమవుతుంది. ఇలా మేనక ఎపిసోడ్‌ను ఎక్కువగా సాగదీయకుండా శకుంతల, దుష్యంతుడిని కథలోకి దర్శకుడు వెళ్లడంతో కొంత ఆసక్తి కనిపిస్తుంది. అయితే ఫస్టాఫ్‌లో పెద్దగా ఎమోషన్స్ పండకపోవడం, సాదాసీదాగా కథ సాగడం కొంత రొటీన్‌గా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో కథలో వేగం కనిపించకపోవడంతో ప్రేక్షకుడు సెకండాఫ్‌లో ఏం జరుగుందనే ఆసక్తిని పెంచేలా చేస్తుంది. ఫస్టాఫ్‌లో విజువల్స్, వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అద్బుతంగా ఉన్నాయి. కానీ 3డీలోకి మార్చే ప్రక్రియలో విజువల్స్ సరిగా కన్వర్షన్ కాలేదనిపిస్తుంది.
సెకండాఫ్‌లో అసలు కథతో..
ఇక సెకండాఫ్‌లో శకుంతల అసలు కధ మొదలవుతుంది. ప్రకాశ్ రాజ్ ఎంట్రీతో సముద్ర ప్రయాణం కథకు కీలకంగా మారుతుంది. దుష్కంతుడి సభలోకి వెళ్లి శకుంతల భంగపాటుకు గురికావడంతో కథలో కొంత చలనం వస్తుంది. అయితే చాలా ఆర్టిఫిషియల్‌గా సన్నివేశాలు కనిపిస్తాయి. 3డీ కన్వర్షన్‌లో చాలా లోపాలు తెరపైన కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ముఖాలు సాగదీసినట్టు.. కొన్ని చోట్ల తలపై కిరీటం పక్కకు వెళ్లినట్టు ఉండే సీన్లు కథకు కనెక్ట్ కాకుండా ఇబ్బందిని కలిగిస్తాయి. ఇక అల్లు అర్హ ఎంట్రీ తర్వాత పది నిమిషాలు కొంత వినోదంగా మారుతుంది. చాలా రొటీన్‌గా దుష్యంత్, శకుంతల కలవడంతో ఎలాంటి ఎమోషన్స్ లేకుండా కథ ముగుస్తుంది.

శాకుంతలం టెక్నికల్‌గా ఎలా ఉందంటే?
మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం నాటకం నుంచి శాకుంతలం సినిమాగా తెరకెక్కించాలనే దర్శకుడు గుణశేఖర్ ప్రయత్నం బాగుంది. పక్కాగా స్క్రీన్‌ను రాసుకోవడంలో తన ప్రతిభను చాటుకొన్నారు. కానీ కథలో ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎక్కడా కనిపించవు. సాయిమాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్ బాగున్నాయి. కానీ కొన్నిసార్లు గ్రాంధికం, కొన్నిసార్లు రెగ్యులర్ భాష పాత్రలో పలికించడం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక సెట్స్, వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అద్భుతంగా, గ్రాండ్‌గా ఉన్నాయి. సీన్ బ్యాక్ గ్రౌండ్ వర్క్ బాగుంది. అయితే పాత్రలను బ్యాక్ గ్రౌండ్‌పై త్రీడీ కన్షర్షన్ చేయడంలో సాంకేతికంగా లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. సినిమాటోగ్రఫి, మ్యూజిక్ బాగుంది. మణిశర్మ అందించిన రీరికార్డింగ్ కారణంగా కొన్ని పేలవమైన సీన్లు కూడా ఎలివేట్ అయ్యాయి. నీలిమా గుణ అనుసరించిన ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. ప్రతీ ఫ్రేమ్‌ను చక్కగా తీర్చిదిద్దడంలో నిర్మాతలో ఓ తపన, అంకితభావం కనిపించాయి.
సమంత ఫెర్పార్మెన్స్ అదుర్స్
శకుంతల పాత్రలో సమంత నటన, హావభావాలు బాగున్నాయి. 3డీ కన్వర్షన్ కారణంగా కొన్ని చోట్ల సమంత లుక్ పాలిపోయినట్టు కనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌లో సమంత తన ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. ఇంకా యుద్ధం సీన్లు కొంత తగ్గించి సమంత క్యారెక్టర్ నిడివి పెంచి ఉండే బాగుండేదనిపిస్తుంది. దుష్యంతుడిగా దేవ్ మోహన్ చాలా కష్టపడ్డాడు. కానీ తెలుగు హీరో ఎవరైనా ఉంటే మరింత కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండేదనిపిస్తుంది. దుష్యంతుడి క్యారెక్టర్‌లో డెప్త్, ఇంటెన్సిటీకి కొన్ని సందర్బాల్లో దేవ్ మోహన్ సూట్ కాలేదనిపిస్తుంది. దుర్వాసుడిగా మోహన్ బాబు తాను తప్ప మరోకరు చేయలేరనే ఫీలింగ్ తెప్పించడంలో సక్సెస్ అయ్యారు కణ్వ మహర్షిగా సచిన్ ఖేడ్కర్ నటన బాగుంది. మిగితా పాత్రధారులందరూ ఒకే అనిపించేలా తన పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.
ఫైనల్‌గా శాకుంతలం ఎలా ఉందంటే?
శాకుంతలం కథ అద్బుతమైన అమర ప్రేమకావ్యం. కానీ ఎమోషన్స్ లేకుండా చాలా ఫ్లాట్‌గా సాగుతుంది. నేటి తరానికి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన అజరామరమైన ప్రేమకథను చెప్పే ప్రయత్నాన్ని గుణశేఖర్ మెచ్చు కోవాల్సిందే. అయితే గొప్ప ఫీలింగ్ అందించడంలో విఫలమయ్యారనే చెప్పాలి. గ్రాఫిక్ వర్క్ సరిగా లేని కారణంగా సినిమాకు కనెక్ట్ కావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుుంది. సమంత ఫెర్ఫార్మెన్స్, గ్రాండియర్‌గా తెర మీద కనిపించే విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు పాజిటివ్‌గా నిలిచాయి. కథ పరంగా, సాంకేతిక అంశాల పరంగా ఉన్న చాలా లోపాలను పక్కన పెడితే.. ముఖ్యంగా నేటితరం, చిన్న పిల్లలకు చూపించాల్సిన సినిమా. ఓసారి చూడదగిన సినిమా శాకుంతలం.


Click it and Unblock the Notifications











