Bloody Daddy Review: కొడుకు కోసం తండ్రి యాక్షన్ పోరాటం.. షాహిద్ కపూర్ 'బ్లడీ డాడీ' రివ్యూ

రేటింగ్: 2.5/5

టైటిల్: బ్లడీ డాడీ (హిందీ)
నటీనటులు: షాహిద్ కపూర్, సర్తాజ్ కక్కర్, రోనిత్ రాయ్, సంజయ్ కపూర్, రాజీవ్ ఖండేల్వాల్, డయనా పెంటీ, వివాన్ భటేనా తదితరులు
సినిమాటోగ్రఫీ: మార్కిన్
నేపథ్య సంగీతం: జులియస్ పేకియం
స్వరాలు: బాద్ షా, ఆదిత్య దేవ్, అనుజ్ పాటలు
నిర్మాణ సంస్థలు: జియో స్టూడియోస్, ఆఫ్ సైడ్ ఎంటర్టైన్ మెంట్స్, ఆజ్ ఫిల్మ్స్
దర్శకత్వం: అలీ అబ్బాస్ జాఫర్
ఓటీటీ విడుదల తేది: జూన్ 9, 2023
ఓటీటీ వేదిక: జియో సినిమా

'కబీర్ సింగ్' మూవీతో మంచి హిట్ కొట్టిన షాహిద్ కపూర్ 'ఫర్జీ' వెబ్ సిరీస్ తర్వాత నటించిన సినిమా 'బ్లడీ డాడీ' (Bloody Daddy). 2011లో రిలీజైన 'స్లీప్‌లెస్ నైట్' అనే ఫ్రెంచ్ మూవీ ఆధారంగా 'బ్లడీ డాడీ'ని తెరకెక్కించారు. ఇదే మూవీ ఆధారంగా కమల్ హాసన్ 'చీకటి రాజ్యం' సినిమా చేశారు.

Shahid Kapoor Starrer Bloody Daddy Movie Review And Rating In Telugu

'సుల్తాన్', 'టైగర్ జిందాహై' వంటి హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన అలీ అబ్బాస్ జాఫర్ 'బ్లడీ డాడీ'కి దర్శకత్వం వహించారు. ఈ సినిమా నేరుగా జూన్ 9న జియో సినిమాలో విడుదలైంది. మరి 'బ్లడీ డాడీ' మూవీ ఎలా ఉందో నేటి రివ్యూలో (Bloody Daddy Telugu Review) తెలుసుకుందాం.

కథ: సుమేర్ ఆజాద్ (షాహిద్ కపూర్) నార్కోటిక్స్ డిపార్ట్ మెంట్ లో అండర్ కరవర్ ఆఫీసర్ గా పనిచేస్తుంటాడు. కరోనా లాక్ డౌన్ తర్వాత డ్రగ్స్ అమ్మే ముఠాపై అటాక్ చేసి రూ. 50 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం చేసుకుంటాడు. తనదైన ఆ డ్రగ్స్ కోసం సుమేర్ కొడుకు అథర్వ్ (సర్తాజ్ కక్కర్)ను కిడ్నాప్ చేస్తాడు మాఫియా లీడర్ సికిందర్ (రోనిత్ రాయ్). కొడుకు కావాలంటే డ్రగ్స్ బ్యాగ్ తో రావాలని సుమేర్ కు చెబుతాడు సికిందర్.

Shahid Kapoor Starrer Bloody Daddy Movie Review And Rating In Telugu

ట్విస్టులు: డ్రగ్స్ బ్యాగ్ తో సికిందర్ కు చెందిన సెవెన్ స్టార్ హోటల్ లో సుమేర్ అడుగు పెట్టిన తర్వాత ఏమైంది? సుమైర్ తన కొడుకును కాపాడుకున్నాడా? సుమేర్ వెంట నార్కోటిక్స్ ఇతర అధికారులు అదితి రావత్ (డయానా పెంటీ), సమీర్ సింగ్ (రాజీవ్ ఖండేల్వాల్) ఎందుకు పడ్డారు? అనేది తెలియాలంటే ఈ 'బ్లడీ డాడీ'ని చూడాల్సిందే.

విశ్లేషణ: బ్లడీ డాడీ మూవీ ఒక యాక్షన్ థ్రిల్లర్. ఇలాంటి సినిమాల్లో సాధారణంగా కథలో కొత్తదనం ఏం ఉండదు. ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలపైనే ఫోకస్ పెడతారు. వాటికి ఎమోషనల్ టచ్ కనెక్ట్ అయితే సినిమా అదిరిపోతుంది. మూవీలో యాక్షన్ సీన్స్ సూపర్బ్ గా ఉన్నాయి. హాలీవుడ్ స్టైల్ టచ్ ఇచ్చారు. టైగర్ జిందా హై వంటి యాక్షన్ సినిమాలు చేసిన అలీకి ఆ అనుభవం ఇక్కడ బాగా ఉపయోగపడింది. తండ్రీ కొడుకుల ఎమోషనల్ బాండింగ్ కనెక్ట్ అయ్యేలా ఉంది. సినిమా స్టార్టింగ్ నుంచే రేసీగా సాగుతుంది. కానీ కొన్ని రిపీటెడ్ సీన్స్ బోర్ కొట్టిస్తాయి.

Shahid Kapoor Starrer Bloody Daddy Movie Review And Rating In Telugu

బీజీఎం-క్లైమాక్స్: కొడుకును కాపాడుకునేందుకు సుమేర్ చేసే ప్రయత్నాలు బాగున్నాయి. కరోనా లాక్ డౌన్ తర్వాత డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ ఎంత ముఖ్యమో చూపించారు. నిజానికి సినిమాలో హైలెట్ విషయం అంటే యాక్షన్ సీన్సే. సో అంతకు మించి చెప్పడానికి ఏం లేదు. నెగెటివ్స్ చెప్పడానికి కూడా అంతగా ఏం లేవు. అక్కడక్కడ వచ్చే కామెడీ నవ్విస్తుంది. క్లైమాక్స్ ఓకే. జులియస్ బీజీఎం చాలా బాగుంది. సన్నివేశాల్లో మూడ్, ఫీల్ వచ్చేలా ఎలివేట్ చేశారు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు అంతా బాగున్నాయి.

ఎవరెలా చేశారంటే?: షాహిద్ కపూర్ తన నటనతో మరోసారి అదరగొట్టాడు. యాక్షన్ సీన్లలో తన స్టైల్ మార్క్ కనిపిస్తుంది. హైపర్ యాక్టివ్ ఆఫీసర్ గా వన్ మ్యాన్ షో చేశాడు. ఎమోషనల్ సీన్స్ లో కూడా ఆకట్టుకుంటాడు. కొడుకు పాత్రలో చేసిన సర్తాజ్ కక్కర్ మెప్పిస్తాడు. అతని స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. రోనిత్ రాయ్ సెటిల్డ్ విలనిజం ఆకట్టుకుంది. సంజయ్ కపూర్ నటన ఓకే. రాజీవ్ ఖండెల్వాల్ కూడా యాక్షన్ సీన్స్ లో బాగా చేశాడు. డయానా పెంటీ పరిధి మేర చేసింది.

Shahid Kapoor Starrer Bloody Daddy Movie Review And Rating In Telugu

ఫైనల్ గా చెప్పాలంటే?: రెండు గంటల నిడివితో షాహిద్ కపూర్ వన్ మ్యాన్ షో చేసిన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమానే 'బ్లడీ డాడీ'. కథ, కథనాల పరంగా కొత్తదనం లేకున్నా.. యాక్షన్ ప్రియులు మెచ్చే ఈ చిత్రాన్ని వీకెండ్ లో ఓసారి చూడొచ్చు. జియో సినిమాలో ప్రస్తుతం ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X