twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టైలిష్ 2(షారూఖ్ ఖాన్ 'డాన్ 2'రివ్యూ)

    By Srikanya
    |

    ఐదేళ్ల తర్వాత ఫర్హాన్ అక్తర్ మళ్లీ అదిరిపోయే రేంజిలో డాన్ 2 ని రంగంలోకి దింపాడు. స్టైలిష్ సినిమా అంటే ఏమిటో ఇండియన్ సినిమాకు అర్దం నేర్పాడు. అస్సలు అమితాబ్ డాన్ ని షారూఖ్ చేస్తున్నప్పుడే అంతా నవ్వారు..అయితే ఫర్హాన్ అక్తర్ ప్రతిభతో గట్టెక్కించారు. అయితే ఈ సారి సీక్వెల్స్ అస్సలు ఇండియన్ స్క్రీన్స్ కి పడవు...అన్న వారికి సమాధానంగా ఈ స్టైలిష్ ఎంటర్టైనర్ ని వదిలి షాక్ ఇచ్చాడు. అయితే ఎక్కడో క్లైమాక్స్ లో చిన్న ట్విస్ట్ పెట్టుకుని, కేవలం సీన్స్ స్టైలిష్ గా తీయటమే పనిగా పెట్టుకున్నట్లు కనపడుతున్న ఈ చిత్రం ఏ మేరకు భారతీయ ప్రేక్షకుడుని ఆకట్టుకుంటుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాలి.

    ఈ సారి డాన్(షారూఖ్)మలేషేయాలో డ్రగ్ బిజినెస్ ని నడుపుతూ...కేవలం ఆసియానే కాక యూరప్ మార్కెట్ ని సైతం తన బిజినెస్ ని పెంచాలనుకుంటాడు. అందుకు ఓ మాస్టర్ ప్లాన్ వేస్తాడు. అందులో భాగంగా..కావాలనే పట్టుబడ్డ డాన్ జైల్లో ఉన్న తన శత్రువు వర్దన్ (బొమన్ ఇరాని)ని కలుస్తాడు. అతన్ని తనతో చేతులు కలిపేలా ఒప్పించి అక్కడనుంచి ఇద్దరూ తప్పించుకుంటారు. అక్కడనుంచి ఓ పెద్ద దొంగతనానికి ప్లాన్ చేస్తాడు డాన్. దాని మూలంగా అతనికి కోట్లు కొద్ది సొమ్ము దక్కుతుంది. ఈలోగా డాన్ వెనకాల రోమో పడుతూంటుంది. అంతేకాకుండా కొన్ని అడ్డంకులు కూడా ఉంటాయి. వాటిన్నటినీ అధిగమించి డాన్ ఎలా దొంగతనం చెయ్యగలిగాడు..తన బిజినెస్ ని ఎలా పెంచుకున్నాడు అనేది మిగతా కథ. మొదటి డాన్‌లో హీరోని పోలీసులకు పట్టివ్వాలనే లక్ష్యంతో అతనితో ప్రేమలో పడ్డట్లు నటించిన ప్రియాంక చోప్రా.. రెండో డాన్‌లోనూ అదే లక్ష్యాన్ని కొనసాగిస్తుంది. ఏదోవిధంగా డాన్‌పై పగతీర్చుకోవటానికి అవకాశం కోసం ఎదురుచూస్తుంది. అయితే డాన్‌లో కొన్ని విషయాలు నచ్చి అతనితో మళ్లీ ప్రేమలోనూ పడుతుంది. అంతలోనే లక్ష్యం గుర్తొచ్చి మళ్లీ పగపడుతుంది. కాగా ఇలా తమ ఇద్దరి మధ్య కొనసాగే ప్రేమ-పగ బంధం తో ఈ చిత్రం నడుస్తుంది.

    కథ మీద కన్నా స్టైల్ మీద ఎక్కువ దృష్టి పెట్టి తీసిన ఈ చిత్రం చాలా స్లోగా నడుస్తుంది. గతం చిత్రంలోలాగే క్లైమాక్స్ వరకూ ట్విస్ట్ కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. అయితే ఎత్తులు,పై ఎత్తులు,పంచ్ డైలాగులతో తెలియని స్పీడు క్యారెక్టర్ లో కనపుడుతుంది. అలాగే యాక్షన్ సీక్వెన్స్ మాత్రం అదిరిపోతూ ఓ హాలీవుడ్ చిత్రం చూసిన ఫీలింగ్ ని కలగచేస్తాయి. బెర్లిన్ వీధుల్లో పరుగెత్తే కార్ ఛేజ్ సీక్వెన్స్ లో కనురెప్ప వేయాలంటే కష్టం అనిపించేలా చిత్రీకరించారు. అలాగే ఫైట్స్ కూడా చాలా రియలిస్టిగ్ ఉన్నట్లు అనిపిస్తాయి. కెమెరా వర్క్ కూడా చాలా న్యాచురల్ కలర్స్ తో ఓ విధమైన ఫీల్ కలుగచేస్తూ నడుస్తుంది. అయితే రెగ్యులర్ బాలీవుడ్ చిత్రాలకు అలవాటు పడిన ప్రేక్షకుడు మాత్రం కాస్సేపు కంగారుపడేలా ఈ చిత్రం ఉంటుంది. ఇక ఈ చిత్రం పూర్తిగా షారూఖ్ దే అని చెప్పాలి. విలన్ గా నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో చెలరేగిపోయాడు. ప్రియాంక చోప్రా,బొమన్ ఇరాని,ఓం పురి వంటి వారు తమ పాత్రల్లో ఇమిడిపోయారే కానీ సినిమాకు పెద్దగా ప్లస్ కాలేక పోయారు.

    ఇక ఈ చిత్రం స్టైలిష్ సినిమాలుపై ఆసక్తి ఉన్నావారుకి బాగా నచ్చే అవకాసం ఉంది. పాటలు,ఫైట్స్ వంటి రెగ్యులర్ మశాలాలు కోరుకునే వారికి ఈ చిత్రం పెద్దగా కిక్ ఇవ్వదు. షారూఖ్ అభిమానులుకు మాత్రం ఇది విందు భోజనం లాంటిది.

    English summary
    Don 2 is a perfect entertainment package for this Christmas. After Ra.One, this movie holds a mirror to changing trends in Indian cinema. Don't miss to watch SRK's dazzling stunts
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X