శైలజారెడ్డి అల్లుడు రివ్యూ, రేటింగ్

Rating:
3.0/5
Star Cast: అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్, రమ్యకృష్ణ, వెన్నెల కిషోర్, మురళీ శర్మ
Director: మారుతి దాసరి

లవర్ బాయ్ ఇమేజ్‌‌తోపాటు మాస్ ఎలిమెంట్స్‌ ఉన్న పాత్రతో యువ సామ్రాట్ నాగచైతన్య శైలజారెడ్డి అల్లుడిగా వస్తున్నాడు. ఈ చిత్రంలో ఇగో ఉన్న వ్యక్తుల మధ్య నలిగిపోయే ప్రేమికుడిగా, అల్లుడిగా, కుమారుడిగా నటించాడు. ఈ చిత్రం వినాయక చవితి పండుగ పురస్కరించుకొని సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో అని తెలుసుకోవడానికి కథ గురించి సమీక్షిద్దాం.

శైలజారెడ్డి అల్లుడు స్టోరి

శైలజారెడ్డి అల్లుడు స్టోరి

తండ్రి (మురళీశర్మ) ఇగోను భరిస్తూ సొంత కంపెనీకి ఎండీగా చైతన్య (నాగచైతన్య) బాధ్యతలు వహిస్తుంటారు. తండ్రి ప్రవర్తన వల్ల చెల్లెలు పెళ్లి ఎత్తిపోతుంది. ఈ క్రమంలో అను (అను ఇమ్మాన్యుయేల్)‌తో ప్రేమలో పడుతాడు. కానీ ఆమెకు ఒంటి నిండా పొగరు (ఇగో), తలబిరుసు వ్యక్తిని తెలుసుకొంటాడు. అలాంటి అను చేత నేను ప్రేమిస్తున్నాను అని చెప్పించడంలో చైతూ సక్సెస్ అవుతాడు. కానీ వారి పెళ్లికి తన తల్లి శైలజారెడ్డి (రమ్యకృష్ణ) సమస్యగా మారుతుంది. ఐదేళ్లుగా తల్లి, కూతురు మధ్య మాటల్లేవని చైతూ తెలుసుకొంటాడు. కూతురి కంటే ఎక్కువ ఇగో ఉన్న శైలజారెడ్డిని పెళ్లికి ఒప్పించడం కష్టంగా మారుతుంది.

శైలజారెడ్డి అల్లుడు ట్విస్టులు

శైలజారెడ్డి అల్లుడు ట్విస్టులు

కూతురు పెళ్లి ఎత్తిపోవడానికి తండ్రిగా మురళీశర్మ ఏం చేశాడు? చెల్లెలి పెళ్లి చేయడానికి చైతూ ఎలాంటి బాధ్యతను ఎత్తుకొన్నాడు? అను ప్రేమను గెలుచుకోవడానికి చైతూ వేసిన ఎత్తులేంటి? శైలజారెడ్డికి, అనుకు ఎందుకు మాటల్లేవు? శైలజారెడ్డిని చైతూ ఎలా బుట్టలో వేసుకొన్నాడు? తన తండ్రి ప్రవర్తనను మార్చడానికి చైతు ఏం చేశాడు. చెల్లెలి పెళ్లిని చైతూ ఎలా చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే శైలజారెడ్డి అల్లుడు.

శైలజారెడ్డి అల్లుడు ఫస్టాఫ్

శైలజారెడ్డి అల్లుడు ఫస్టాఫ్

శైలజారెడ్డి చిత్రం తండ్రి ఇగో వల్ల బాధపడే అంశంతో సినిమా ముందుకెళ్తుంది. అనును చూసి చైతూ ప్రేమలో పడటం, ఆమె ఇగోను భరిస్తూ చైతూ ముందుకెళ్లడం, ప్రాణిక్ హీలింగ్ డాక్టర్‌గా చారి (వెన్నెల కిషోర్) కామెడీతో సన్నివేశాలు చకచకా ముందుకెళ్తాయి. చైతూ, అను లవ్ ట్రాక్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. వారి మధ్య రొమాన్స్ ఫీల్‌గుడ్‌గా ఉంటుంది. తండ్రి ప్రవర్తన కారణంగా తమ ప్రేమ ఇబ్బందుల్లో పడే అంశంతో ఇంటర్వెల్ కార్డు పడుతుంది.

శైలజారెడ్డి అల్లుడు సెకండాఫ్

శైలజారెడ్డి అల్లుడు సెకండాఫ్

సెకండాఫ్‌లో వరంగల్‌లో ఉండే శైలజారెడ్డి గ్రామానికి షిఫ్ట్ అవుతుంది. అక్కడ శైలజారెడ్డి, అను మధ్య ఇగో సమస్యలు, అల్లరి నరేష్, పృథ్వీ నడుమ కామెడీతో చకచకా ప్రీక్లైమాక్స్‌కు చేరుకొంటుంది. సెకండాఫ్‌లో అల్లరి నరేష్, పృథ్వీ కామెడీ హైలెట్‌గా నిలుస్తుంది. పృథ్వీ బాత్రూం సీన్‌ తెర మీద హాస్యం జల్లులను కురిపించింది. చివర్లో ఓ ట్విస్ట్‌తోపాటు తమ ప్రవర్తన తెలుసుకొని రెండు పెళ్లిల్లు జరిపించడంతో సినిమా హ్యాపీగా ముగస్తుంది.

 డైరెక్టర్ మారుతి మేకింగ్

డైరెక్టర్ మారుతి మేకింగ్

హ్యూమన్ ఎమోషన్స్‌కు కామెడీని అద్ది సినిమాను సక్సెస్ చేయడంలో దర్శకుడు మారుతి డిఫరెంట్ స్టయిల్. వినోదం పంచడమే లక్ష్యంగా అదే పంథాను శైలజారెడ్డి అల్లుడు కోసం ఫాలో అయిపోయాడు. నాగచైత్యన, అను మధ్య క్యూట్ రొమాన్స్, తలపొగరు తండ్రి, అహంకారంతో నిలువెల్లా ఊగిపోయే అత్త క్యారెక్టర్లను చక్కగా అల్లుకొన్నాడు. ఓ భావోద్వేగమైన పాయింట్‌ను కామెడీ ట్రాక్ ఎక్కించి పరుగులు పెట్టించాడు. కాకపోతే రెగ్యులర్ కథనే ఎంచుకోవడం కొంత అసంతృప్తి అనిపిస్తుంది. కాకపోతే మారుతి మార్కు మేకింగ్‌తో దానిని కూడా సరిదిద్దే ప్రయత్నం జరిగింది.

ఫ్రెష్‌గా, ఎనర్జిటిక్‌గా నాగచైతన్య

ఫ్రెష్‌గా, ఎనర్జిటిక్‌గా నాగచైతన్య

నాగచైతన్య చాలా ఫ్రెష్‌గా ఉన్నాడు. క్రితం చిత్రాల కంటే హుషారు, జోరు ఎక్కువగా కనిపించింది. తండ్రి, కొడుకులు మధ్య రిలేషన్, అన్నా, చెలెల్ల మధ్య బంధం, ప్రియురాలితో అనుబంధం, గడసరి అత్తను మెప్పించే అంశాలున్న పాత్రలో చైతూ చక్కగా ఒదిగిపోయాడు. ఇన్ని వేరియేషన్స్ ఉన్న పాత్రను చైతూ చేయడం ఇదే మొదటిసారి. అయితే ఈ పాత్రలోని భావోద్వేగాలను చక్కగా పండించడంలో చైతూ సఫలమయ్యాడు. ఈ చిత్రం చైతూలో ఉండే ఫెర్ఫార్మన్‌ను బయటపెట్టింది.

 అను ఇమ్మాన్యుయేల్ గ్లామర్

అను ఇమ్మాన్యుయేల్ గ్లామర్

తన బాడీ లాగ్వేంజ్‌కు తగినట్టు ఉండే పాత్రలో అను ఇమ్మాన్యుయేల్ ఒదిగిపోయింది. మరోసారి ఎమోషన్స్ పండించే పాత్ర దొరికింది. దీంతో ఆమె తనకు తాను ప్రూవ్ చేసుకొనేందుకు ప్రయత్నించిన తీరు బాగుంది. గ్లామర్‌గానూ, ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో మెరిసిందని చెప్పవచ్చు.

పవర్‌ఫుల్ రోల్‌లో రమ్యకృష్ణ

పవర్‌ఫుల్ రోల్‌లో రమ్యకృష్ణ

శైలజారెడ్డి అల్లుడు చిత్రానికి రమ్యకృష్ణ రోల్ ప్రధాన ఆకర్షణ. ఆమె నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మరోసారి సెంటిమెంట్‌కు ప్రాధాన్యత ఉన్న పాత్రలో మెరిసింది. సెకండాఫ్‌లో సినిమాకు వెన్నముకగా నిలచింది. కొన్ని సీన్లలో ఆమె నటన సినిమాను మరోస్థాయికి చేర్చేలా ఉంది. సీరియస్ పాత్రతో మరోసారి ప్రేక్షకులకు దగ్గరయయ్యే ఫెర్ఫార్మెన్స్‌ను ప్రదర్శించింది.

వెన్నెల కిషోర్, ఫృథ్వీ కామెడీ

వెన్నెల కిషోర్, ఫృథ్వీ కామెడీ

వెన్నెల కిషోర్, పృథ్వీ కామెడీ ఈ సినిమాకు ప్రధాన బలం అని చెప్పవచ్చు. ప్రాణిక్ హీలింగ్ డాక్టర్‌గా డిఫెరెంట్ మేనరిజంతో వెన్నెల కిషోర్ ఆకట్టుకొన్నాడు. తనదైన పంచ్ డైలాగ్స్‌తో హ్యాస్యాన్ని పండించాడు. నాగచైతన్య పాత్రతో ట్రావెల్ అవుతూ సినిమాకు ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌గా నిలిచాడు. ఇక పృథ్వీ కామెడీ మరో హైలెట్. ఎప్పటిలానే తన స్టయిల్ ఆఫ్ కామెడీతో దూసుకెళ్లాడు.

మురళీశర్మ, నరేష్ మరోసారి

మురళీశర్మ, నరేష్ మరోసారి

టాలీవుడ్‌లో ప్రస్తుతం బరువైన పాత్రలతో ఆకట్టుకొంటున్న నటుల్లో మురళీశర్మ, నరేష్ ఒకరు. ఈ చిత్రంలో ఇగోయిస్టిక్ క్యారెక్టర్‌‌లో మురళీశర్మ నటించాడనేకంటే జీవించాడని చెప్పవచ్చు. కొంచెం నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్‌లో బ్రహ్మండమైన హావభావాలు పలికించాడు. భార్యకు దాసుడైన భర్త పాత్రలో నరేష్ కనిపించాడు. కీలక సన్నివేశాల్లో ఆయన నటన బాగుంది.

సినిమాటోగ్రఫి, మ్యూజిక్

సినిమాటోగ్రఫి, మ్యూజిక్

శైలజారెడ్డి చిత్రానికి నిజర్ షఫీ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. తొలిభాగంలో అర్బన్ లుక్‌ను, సెకండాఫ్‌లో రూరల్ లుక్‌ను బ్యాలెన్స్‌ చేయడంలో సక్సెస్ అయ్యాడు. సన్నివేశాలను అందంగా మలుచుకోవడానికి వినియోగించుకొన్న కలర్ ప్యాటర్న్ బాగుంది. ప్రతీ ఫ్రేమ్‌లో రిచ్‌నెస్ కనిపించింది. ఈ మధ్యకాలంలో గీతాగోవిందం లాంటి భారీ సక్సెస్‌కు సంగీతం అందించిన గోపిసుందర్ మూజిక్ చేశాడు. రీరికార్డింగ్ బాగుంది. పాటలు ఆకట్టుకొనేలా ఉన్నాయి. ఎడిటింగ్ విషయానికి వస్తే సినిమా ఆరంభంలో కొన్ని సీన్లు, సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలపై కత్తెర వేసే అవకాశం కనిపించింది.

 నిర్మాణ విలువలు

నిర్మాణ విలువలు

సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ, పీడీపీ ప్రసాద్ తదితరులు ఈ చిత్రాన్ని నిర్మించారు. నటీనటులు ఎంపిక బాగుంది. సినిమాకు బలంగా మారిన లొకేషన్ల ఎంపిక చక్కగా ఉంది. సినిమాను రిచ్‌గా అందించడంలో వారి నిర్మాణ విలువలు భేష్‌గా ఉన్నాయి.

ఫైనల్‌గా

ఫైనల్‌గా

శైలజారెడ్డి అల్లుడు చిత్రం పక్కా కమర్షియల్ హంగులు, మంచి కామెడీతో రూపొందిన సినిమా. పండుగపూట, వీకెండ్‌లో ఫ్యామిలీ మొత్తం చక్కగా ఎంజాయ్ చేయడానికి వీలున్న చిత్రం. నాగచైతన్య ఫెర్ఫార్మెన్స్, రమ్యకృష్ణ పవర్ ఫుల్ రోల్, అను ఇమ్మాన్యుయేల్ గ్లామర్, మురళిశర్మ నటన వెన్నెల కిషోర్, పృథ్వీ కామెడీ సినిమాకు హైలెట్. ఇగోలు పక్కన పెట్టి చూస్తూ సినిమాను హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు.

బలం, బలహీనతలు:

బలం, బలహీనతలు:

ప్లస్ పాయింట్స్
నాగచైతన్య, రమ్యకృష్ణ, అను ఇమ్మాన్యుయేల్ యాక్టింగ్
మారుతి డైరెక్షన్
వెన్నెల కిషోర్, ఫృథ్వీ కామెడీ
సితార ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ వ్యాల్యూస్

మైనస్ పాయింట్స్
రెగ్యులర్ స్టోరి
ప్రీ క్లైమాక్స్‌లో కొంత స్లో నేరేషన్

తెర వెనుక, తెర ముందు

తెర వెనుక, తెర ముందు

నటీనటులు: అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్, రమ్యకృష్ణ, వెన్నెల కిషోర్, మురళీ శర్మ
రచన, దర్శకత్వం: దాసరి మారుతి
నిర్మాతలు: ఎస్ రాధాకృష్ణ, పీడీపీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: నిజర్ షఫీ
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
రిలీజ్ డేట్: 2018-09-13

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X