twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Shakeela Movie రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating:
    2.5/5
    Star Cast: రిచా చద్దా, పంకజ్ త్రిపాఠి, రాజీవ్ రవీంద్రనాథన్
    Director: ఇంద్రజిత్ లంకేష్

    పేదరికంలో పుట్టిన షకీలా (రిచా చద్దా) కుటుంబం కోసం బలవంతంగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాల్సి వస్తుంది. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి తల్లి అవసరాలు, తన నలుగురు చెల్లెల భవిష్యత్ కోసం శృంగార నటిగా మారుతుంది. మలయాళ చిత్ర పరిశ్రమలో పాపులర్ పోర్న్‌ స్టార్‌గా మారుతుంది.

    షకీలా మూవీ కథ

    షకీలా మూవీ కథ

    పేదరికంలో పుట్టిన షకీలా (రిచా చద్దా) కుటుంబం కోసం బలవంతంగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాల్సి వస్తుంది. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి తల్లి అవసరాలు, తన నలుగురు చెల్లెల భవిష్యత్ కోసం శృంగార నటిగా మారుతుంది. మలయాళ చిత్ర పరిశ్రమలో పాపులర్ పోర్న్‌ స్టార్‌గా మారుతుంది. దాంతో మాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోల పరిస్థితి ప్రశ్నార్థకం అవుతుంది. షకీలా సినిమా రిలీజైన సమయంలో టాప్ హీరోల సినిమాలు వెలవెలబోతాయి. దాంతో షకీలాపై మలయాళ సూపర్ స్టార్ సలీమ్ (పంకజ్ త్రిపాఠి) అణగదొక్కేందుకు కుట్రలు పన్నుతాడు.

    షకీలా మూవీ ట్విస్టులు

    షకీలా మూవీ ట్విస్టులు

    బాల్యంలో షకీలా ఎలాంటి కష్టాలను అనుభవించింది? చిన్నతనంలోనే కుటుంబ భారాన్ని తన భుజాలపై ఎందుకు మోయాల్సి వచ్చింది. ఇష్టం లేకున్నా శృంగార తారగా షకీలా ఎందుకు మారాల్సి వచ్చింది. సూపర్ స్టార్ సలీంతో ఎందుకు విభేదాలు వచ్చాయి. షకీలా కెరీర్‌ను నాశనం చేయాలని హీరో సలీం ఎందుకు కంకణం కట్టుకొన్నాడు. షకీలా సినిమాలను బ్యాన్ చేయాలని మలయాళంలో ఎందుకు నిరసనలు, ఆందోళనలు కొనసాగాయి లాంటి ప్రశ్నలకు సమాధానమే షకీలా సినిమా కథ.

    షకీలా మూవీ ఎలా ఉందంటే..

    షకీలా మూవీ ఎలా ఉందంటే..


    ఒక దశలో స్టార్ హీరోలకు ధీటుగా ఎదిగిన షకీలాకు చేతిలో సినిమాలు లేని గడ్డు పరిస్థితి ఏర్పడుతుంది. వెండితెర దేవతగా కొలిచిన ప్రేక్షకులు ఆమె సినిమాలు బ్యాన్ చేయాలని నిరసనలు చేపడుతారు. ఇలాంటి క్రమంలో తాను శృంగార తారగా ఎందుకు మారాల్సి వచ్చిందనే విషయాన్ని ఓ నిర్మాతకు చెప్పాలని ప్రయత్నిస్తుంది. కానీ నమ్మకపోవడంతో నార్కో అనాలిసిస్ టెస్ట్‌కు సిద్దమవుతుంది. నార్కో అనాలిసిస్ టెస్ట్‌తో తన జీవితం గురించి నిజాయితీగా చెప్పే ప్రాసెస్‌లో షకీలా సినిమా అసలు కథ మొదలవుతుంది.

    శృంగార తారగా షకీలా ఎందుకు మారిందంటే..

    శృంగార తారగా షకీలా ఎందుకు మారిందంటే..


    బాల్యంలో కటిక దరిద్రం, తండి చావు, జూనియర్ ఆర్టిస్టు అయిన తల్లి బలహీనతలు, నలుగురు చెల్లెల భవిష్యత్ లాంటి సమస్యలు షకీలాను శృంగారతారగా మారేందుకు పరిస్థితులు పురిగొల్పుతాయి. సిల్క్ స్మిత ఆకస్మిక మరణంతో షకీలా జీవితమే మారిపోతుంది. ఈ క్రమంలో తాను అభిమానించే సూపర్ స్టార్ సలీంకు చేరువైనప్పటికీ అతడి లైంగిక కోరికలు తీర్చలేకపోవడంతో వారి శతృత్వం చోటుచేసుకొంటుంది. తన సినిమాలకు ప్రేక్షకాదరణ తగ్గడాన్ని జీర్ణించుకోలేకపోయిన సలీం కుట్రలకు తెర లేపుతాడు. ఆ క్రమంలో సలీంను, సినిమా పరిశ్రమలోనే పెద్దలను ఎదురించిన తీరు సినిమా కథగా సాగుతుంది.

    రిచా చద్దా, పెర్ఫార్మెన్స్

    రిచా చద్దా, పెర్ఫార్మెన్స్

    యువ షకీలాగా కాజోల్ చుగ్, హీరోయిన్‌గా షకీలాగా రిచా చద్దా నటించారు. కథలో బలమైన సన్నివేశాలు, ఎమోషనల్ కంటెంట్ లేకపోవడంతో రిచా చద్దా షకీలాగా వెండితెరపైన తన మెరుపులు మెరిపించలేకపోయింది. షకీలా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, అవమానాలు, చేదు అనుభవాలు ఉన్నాయనేది అందరికి తెలిసిందే. అలాంటి అంశాలు సినిమాలో కనిపించకపోవడంతో షకీలా పాత్ర తేలిపోయినట్టు కనిపిస్తుంది. తన పరిధి మేరకు రిచా చద్దా షకీలా పాత్రను నిలబెట్టాలని తన శాయశక్తుల ప్రయత్నించింది.

    పంకజ్ త్రిపాఠి నటన

    పంకజ్ త్రిపాఠి నటన

    మలయాళ సూపర్ స్టార్ సలీంలో పాత్రలో పంకజ్ త్రిపాఠి ఒదిగిపోయాడు. తనదైన శైలిలో సాఫ్ట్ విలన్ పాత్రను పోషించాడు. పాతతరం స్టార్ హీరోల హావభావాలు, డ్రస్పింగ్ స్టైల్ ఒడిసిపట్టుకోవడంలో దాదాపు సఫలమయ్యారు. ఇక యువ షకీలాగా కాజోల్ చుగ్ ఫర్వాలేదనిపించింది. షకీలా స్నేహితుడిగా రాజీవ్ పిళ్లే ఒకే అనిపించాడు. షకీలా స్నేహితురాలిగా ఈస్టర్ నోరాహ ఆకట్టుకొన్నది.

    దర్శకుడి పనితీరు

    దర్శకుడి పనితీరు

    షకీలాను ఓ ఎమోషనల్ సినిమాగా, భావితరం యువ హీరోయిన్లకు కనువిప్పు, స్పూర్తిగా తీయాల్సిన మూవీగా తెరకెక్కించడంలో దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ పూర్తిగా విఫలమయ్యాడు. సరైన కథను, పక్కా కథనాన్ని ప్లాన్ చేసుకొంటే డర్టీ పిక్చర్‌ను మంచిని బయోపిక్ అయ్యుండే బంగారు అవకాశాన్ని వదులుకొన్నాడనే చెప్పవచ్చు. కథలో కీలక అంశాలను ఎంచుకోవడంలో ఊగిసలాట దర్శకుడిలో కనిపిస్తుంది. ఓవరాల్‌గా అద్భుతంగా ఆవిష్కరించాల్సిన గొల్డెన్ ఛాన్స్‌ను మిస్ చేసుకొన్నాడనే చెప్పవచ్చు. సాంకేతిక విభాగాల పనితీరు, ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని చెప్పవచ్చు.

    Recommended Video

    Mahesh Babu At Kondareddy Buruju Pic Goes Viral || 16 ఏళ్ల తర్వాత అంటూ డైరెక్టర్ కామెంట్
    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    సినీ పరిశ్రమలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగి పాతాళంలోకి కూరుకుపోయిన శృంగారతార జీవిత కథే షకీలా. దక్షిణాది సినిమా ప్రేక్షకులను ఉర్రూతలూగించిన షకీలా సినీ జీవితానికి అర్ధాంతరంగా తెరపడిందనే కోణంలో వాస్తవాలను దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ చెప్పడానికి ప్రయత్నించాడు. అయితే ఉడికి ఉడకని వంటకం మాదిరిగా షకీలా మూవీ తెర మీద కనిపిస్తుంది. నాసిరకమైన ఆర్టిస్టులు, పంకజ్ త్రిపాఠి లాంటి నటులను సరిగా ఉపయోగించుకోలేకపోయారనేది స్పష్టంగా కనిపిస్తుంది. పాత్రలను బలంగా రాసుకోవడంలో రచయితల వైఫల్యం కనిపిస్తుంది. ఓవరాల్‌గా షకీలా తెర మీద బోసిపోయిన బొమ్మలా కనిపిస్తుంది. సమాజంలో జరిగే రేప్‌లకు తాను, తన సినిమాలు కారణమనే ఆరోపణలు తిప్పి కొట్టే క్లైమాక్స్ సీన్లు మంచి ముగింపుగా ఉండటమే కాకుండా ప్రేక్షకులకు మంచి ఫీల్‌ను కలుగజేయడం కాస్త ఉపశమనంగా మారిందని చెప్పుకోవచ్చు.

    English summary
    Shakeela Movie Review and Rating: Shakeela a biopic based on the life of adult star Shakeela, who ruled the South Indian film industry for over two decades. The film features Richa Chadha, Pankaj Tripahi in the lead roles. This movie released on 25th December 2020.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X