For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Shakuntala Devi మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating:
  3.0/5
  Star Cast: విద్యా బాలన్, జిషూ సేన్ గుప్తా, సన్యా మల్హోత్రా, అమిత్ సద్, ప్రకాశ్ బెలవాదీ
  Director: అను మీనన్

  గణితశాస్త్ర పండితురాలు, హ్యూమన్ కంప్యూటర్ శకుంతలా దేవి జీవితం గురించి అందరికి తెలిసిందే. తన గణితశాస్త్రంలో మేధస్సు, ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం, తద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సులో పేరు నమోదు చేసుకోవడం లాంటి ఆమె ఘనతలు అందరికి తెలిసిందే. అయితే ఎంతో కీర్తిని సంపాదించిన ఆమె జీవితంలో ఎన్నో తెలియని విషయాలకు తెర రూపం కల్పిస్తూ విద్యాబాలన్‌ను ఆ పాత్ర ద్వారా పరిచయం చేశారు. ఎందరికో స్ఫూర్తిదాయకమైన గణితశాస్త్ర పండితురాలి జీవితం ఆధారంగా తెరకెక్కిన తాజా చిత్రం శకుంతలా దేవి. జూలై 31న ఓటీటీ ఫ్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శకుంతలా దేవి జీవితం ఎలాంటి అనుభూతులను, భావోద్వేగాలను పంచిందో తెలుసుకోనేందుకు సినిమా గురించి చర్చించుకొందాం..

  శకుంతలా దేవి మూవీ కథ

  శకుంతలా దేవి మూవీ కథ

  బాల్యం నుంచే అతి తక్కువ సమయంలో ఎలాంటి సపోర్ట్ లేకుండా గణితశాస్త్రంలో పండితులు కూడా చెప్పలేని సమాధానాలను శకుంతలా చెప్పడంతో ఆమె అసాధారణమైన ప్రతిభను స్థానికంగా గుర్తిస్తారు. పేదరికంలో పుట్టడం ద్వారా అనేక కష్టాలను కళ్ల ముందు చూస్తూ పెరుగుతుంది. తన మేధస్సుతో చిన్నతనంలో కీర్తిని సంపాదిస్తుంది. ఓ కారణంగా తల్లిదండ్రులపై అసహనం పెంచుకొంటారు. యుక్త వయసులో ప్రేమ పేరుతో ఓ వ్యక్తి మోసం చేయడంతో అతడిని తుపాకితో కాల్చుతుంది. అక్కడి నుంచి పారిపోయి ఇంగ్లాండ్‌కు చేరుకొంటుంది. ఇంగ్లాండ్‌కు చేరుకొన్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో గుర్తింపు పొందుతుంది.

  శకుంతలా దేవి మూవీలో ట్విస్టులు

  శకుంతలా దేవి మూవీలో ట్విస్టులు

  శకుంతలా దేవి చిన్నతనం నుంచే తల్లిదండ్రులపై ఏహ్యభావం ఎందుకు పెంచుకొంటుంది? తన మోసగించిన వ్యక్తిని తుపాకితో కాల్చితే శకుంతలాకు ఏం జరిగింది? ఇంగ్లాండ్‌కు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? పలు దేశాల్లో ఎలాంటి ఖ్యాతిని సంపాదించుకొంది? తన భర్త (జిషూ సేన్ గుప్తా)కు ఎందుకు దూరంగా బతుకుతుంది? కూతురు అనుపమ (సాన్యా మల్హోత్రా)తో విభేదాలు ఎందుకు వస్తాయి? తల్లి శకుంతలా దేవిని కూతురు అనుపమ ఎందుకు ద్వేషిస్తుంది అనే పలు ప్రశ్నలకు సమాధానమే శకుంతాల దేవి మూవీ కథ.

   ఫస్టాఫ్ అనాలిసిస్

  ఫస్టాఫ్ అనాలిసిస్

  చిన్నతనంలో శకుంతల దేవి మేధస్సును లోకం గుర్తించడం, ఆమె కుటుంబాన్ని ఆర్థిక, ఆరోగ్యపరమైన సమస్యల వెంటాడే అంశాలతో కథ ప్రారంభమవుతుంది. కుటుంబ పరిస్థితుల ప్రభావం ఆమె బాల్యంపై చెరగని ముద్ర వేయడం. డబ్బు సంపాదించాలనే కోరిక బలంగా నాటుకుపోవడం లాంటి భావోద్వేగ అంశాలతో కథ ముందుకు వెళ్తుంటుంది. అలాగే ఓ కారణంగా తల్లిదండ్రులంటే ద్వేషం ఏర్పడటం, ఊహించని కీర్తి, డబ్బు రావడంతో నేను అనే అహంభావం ఆమెలో పేరుకుపోవడం లాంటి అంశాలు కథకు బలమైన పాయింట్లుగా మారుతాయి. జీవిత ఆరంభంలోనే ప్రేమ పేరుతో మోసానికి గురికావడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఇంగ్లాండ్‌కు చేరి ఎనలేని ప్రతిష్టను, సంపదను సంపాదించుకోవడం లాంటి అంశాలు మొదటి భాగంలో ఎమోషనల్‌గా సాగుతాయి.

  సెకండాఫ్ అనాలిసిస్

  సెకండాఫ్ అనాలిసిస్

  ఆదిలోనే ప్రేమపేరుతో వంచనకు గురికావడంతో శకుంతలా దేవి పెళ్లి విషయంలో ఆచితూచి అడుగులేయడం, తనకు గుర్తింపు లభించడానికి కారణమైన ఓ విదేశీయుడు లవ్ ప్రపోజల్‌ను మొహమాటం లేకుండా నిరాకరించడం లాంటి అంశాలు కథను మరింత భావోద్వేగతను పెంచుతాయి. తన జీవన ప్రయాణంలో తారసపడిన బెంగాలీ యువకుడు పరితోష్ బెనర్జీకి దగ్గరవ్వడం.. ఆయన ద్వారా అనుపమ అనే కూతురు పుడుతుంది. వైవాహిక జీవితం తన కెరీర్‌కు అడ్డమనే భావనతో తన భర్తకు దూరంగా బతకడం లాంటి అంశాలు కథను సెంటిమెంట్‌గా మార్చేస్తాయి. శకుంతలా దేవికి తన కూతురు అనుపమకు మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకోవడం, శకుంతాల దేవి కూతురు ఫిర్యాదుతో ఓ దశలో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడటం లాంటి సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేసేలా ఉంటాయి.

  దర్శకురాలు అను మీనన్ టాలెంట్

  దర్శకురాలు అను మీనన్ టాలెంట్

  గణిత శాస్త్రంలో శకుంతలా దేవి ప్రతిభా పాటవాల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అందువలన శకుంతలా దేవి జీవితంలోని ఎవరూ చూడని మరో కోణాన్ని దర్శకురాలు అను మీనన్‌ కథకు ముడిసరుకుగా ఎంచుకోవడమే ఆమె సక్సెస్‌కు బీజం పడిందని చెప్పవచ్చు. అద్భుతమైన సన్నివేశాలు, వాటికి తగినట్టుగా కథనం, డైలాగ్స్ దట్టించడంలో అను మీనన్ నూటికి నూరుశాతం సఫలమయ్యారు. అత్యున్నత సాంకేతిక విలువలు, సాహిత్యం విషయంలో అనుసరించిన ప్రమాణాలు సినిమాను ఓ డాక్యుమెంటరీగా మార్చకుండా చేశాయని చెప్పవచ్చు. శకుంతలా దేవి పాత్రకు విద్యాబాలన్‌ను ఎంపిక చేసుకోవడం, ఆ పాత్రకు తగిన ఆహార్యం, బాడీలాంగ్వేజ్‌ లాంటి అంశాలు దర్శకురాలిగా అను ప్రతిభకు అద్దంపట్టాయని చెప్పవచ్చు.

  విద్యాబాలన్ ఫెర్ఫార్మెన్స్

  విద్యాబాలన్ ఫెర్ఫార్మెన్స్

  శకుంతలా దేవి చిత్రం విద్యాబాలన్ వన్ ఉమెన్ షో అని చెప్పడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. ప్రభావవంతమైన పాత్రలో విద్యా బాలన్ ఒదిగిపోయిన తీరు మాటలకు అందదు. శకుంతలా దేవి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారా అనే ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా అహంభావం ప్రదర్శించడం, పురుషాధిక్యత ప్రపంచాన్ని తన కొంగుకు కట్టేసుకొన్నారా అనేంతగా తెరపైన రాణించారు. విద్యా బాలన్ డైలాగ్ డెలివరీ, చురుకుదనం, బాడీ లాంగ్వేజ్, కట్టుబొట్టు, బట్ట లాంటి అంశాలు తెర మీద చూస్తే పాత్రతో ప్రేమలో పడేలా చేస్తాయి. ఈ పాత్రకు విద్యాబాలన్‌ను తప్ప మరోకరిని ఊహించుకోలేనంతగా ఆమె నటించారని చెప్పవచ్చు. డర్టీ పిక్చర్, మిషన్ మంగళ్, తుమ్హారీ సులూ తర్వాత విద్యాబాలన్ తన కెరీర్‌లో ఉత్తమ ప్రదర్శనను కనబరిచిన చెప్పవచ్చు.

   మిగితా పాత్రల్లో

  మిగితా పాత్రల్లో

  ఇక మిగితా పాత్రల్లో జిషూ సేన్ గుప్తా, సాన్యా మల్హోత్రా, అమిత్ సద్, ప్రకాశ్ బెలావదీ, షాబా చద్దా నటించారు. పరితోష్ బెనర్జీగా శకుంతల భర్త పాత్రలో జిషూ సేనగుప్తా మరోసారి ఆకట్టుకొన్నారు. ఇక అనుపమ బెనర్జీగా యువ హీరోయిన్ సాన్యా మల్హోత్రా ఓ దశలో విద్యాబాలన్‌తో పోటీ పడి నటించిందని చెప్పవచ్చు. బ్రీత్ ఫేమ్ అమిత్ సద్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడంతో నటించడానికి స్కోప్ దక్కలేదు. శకుంతల ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పే పాత్రలో బిష్వాగా ప్రకాశ్ బెలవాదీ పెర్ఫార్మెన్స్‌ను విస్మరించలేం. ఇంగ్లాండ్‌లో శకుంతలాకు అండగా నిలిచిన తారాభాయ్ పాత్రలో షీబా చద్దా నటన బాగుంది.

  సాంకేతిక విభాగాల పనితీరు

  సాంకేతిక విభాగాల పనితీరు

  సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాను అందంగా, ఓ పెయింటింగ్‌లా తీర్చి దిద్దడంలో కీకో నకహరా పనితీరు అమోఘం. ఇంగ్లాండ్‌లో సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారు. ఇక సచిన్, జిగర్ మ్యూజిక్ ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. సునిధి చౌహాన్ పాడిన పాస్ నాహీ తో ఫెయిల్, రాణి హిందూస్థానీ నహీ పాటలు హుషారుగా సాగుతాయి. పహేలీ, జిల్ మిల్ పియా లాంటి సాంగ్స్ ఎమోషనల్‌గా సాగుతాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయని చెప్పవచ్చు. అంతారా లహిరి ఎడిటింగ్, తదితర సాంకేతిక విభాగాల పనితీరు బాగుంది.

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  స్ఫూర్తి, భావోద్వేగత, నాటకీయత, వినోదం లాంటి అంశాలు కలబోసిన చిత్రం శకుంతలా దేవి. ఓటమి ఎరుగని మహిళగా శకుంతలా జీవితం భావి తరాలకు ఆదర్శంగా నిలిచేలా సినిమాను తెరకెక్కించడంలో నూటికి నూరుశాతం సఫలమయ్యారని చెప్పవచ్చు. గణితశాస్త్ర మేధావిగానే కాకుండా ఆమె జీవితానికి సంబంధించిన మరెన్నో కోణాలు తెరమీద ఆవిష్కరించిన చిత్రంగా భావించవచ్చు. ఇంటిల్లిపాది చూసే విధంగా అసభ్యతకు, అశ్లీలంగా, ద్వందార్థాలకు తావులేని క్లీన్ అండ్ నీట్ చిత్రం శకుంతలా దేవి. తెరపైన అరుదుగా కనిపించే ఇలాంటి చిత్రం ప్రేక్షకులకు పండగలాంటి ఫీలింగ్‌ను కల్పిస్తుంది. విద్యా బాలన్ విశ్వరూపాన్ని మళ్లీ చూడటానికి ఓ చక్కటి అవకాశం లభించిందని చెప్పవచ్చు.

  Karthika Deepam fame Nirupam AKA Karthik Got gift from Chiranjeevi's Mother Anjana Devi
  నటీనటులు

  నటీనటులు

  నటీనటులు: విద్యా బాలన్, జిషూ సేన్ గుప్తా, సన్యా మల్హోత్రా, అమిత్ సద్, ప్రకాశ్ బెలవాదీ, షీబా చద్దా తదితరులు
  స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అను మీనన్
  నిర్మాత: సోని పిక్చర్స్
  మ్యూజిక్: సచిన్ జిగన్, కరణ్ కులకర్ణి (బ్యాక్‌గ్రౌండ్ స్కోర్)
  సినిమాటోగ్రఫి: కీకో నకహర
  ఎడిటింగ్: అంతరా లహిరి
  ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
  ఓటీటీ రిలీజ్: 2020-07-31

  English summary
  Shakuntala Devi is biographical comedy drama film released on July 31st on Amazon Prime video. This movie written and directed by Anu Menon. produced by Sony Pictures Networks India and Vikram Malhotra under his banner Abundantia Entertainment. The film stars Vidya Balan as human computer Shakuntala Devi, along with Jisshu Sengupta, Sanya Malhotra and Amit Sadh.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X