Shambhala Twitter Review: శంబాల ట్విట్టర్ రివ్యూ

షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం శంబాల: ఏ మిస్టికల్ వరల్డ్. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో ఆది సాయికుమార్ హీరోగా నటించగా.. యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్, శైలజ ప్రియా, ఇంద్రనీల్, ప్రవీణ్, మీసాల లక్ష్మణ్, సిజ్జు మీనన్, హర్షవర్దన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

శంబాలకు శ్రీచరణ్ పకాల మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించగా, ప్రవీణ్ కే బంగారి సినిమాటోగ్రఫి, శ్రవణ్ కటికనేని ఎడిటర్‌గా, జేకే మూర్తి ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. జేవీ రామారావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తించారు. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో శంబాల సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25వ తేదీన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. అయితే డిసెంబర్ 24వ తేదీ రాత్రి పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఈ క్రమంలో నెటిజన్లు, క్రిటిక్స్, సినీ ప్రమఖుల అభిప్రాయాల్లోకి వెళితే...

Shambhala  a Mystical World Twitter Review in Telugu  will Aadi Saikumar hits the bulls eye

శంబాల గురించి గొప్ప విషయాలు వింటున్నాను. సమీక్షలు, సినీ ప్రేమికులు ఈ సినిమాలోని ఉత్కఠభరితంగా సాగిన హిమాలయన్ విజువల్స్, ప్రశాంతత, కథ, కథనం, ప్రధాన నటీనటుల నటనను ప్రశంసిస్తున్నారు అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.

శంబాల వెరీగుడ్ మూవీ.. ఆది సాయికుమార్‌కి పర్ఫెక్ట్‌ కమ్ బ్యాక్ ఫిల్మ్. రవివర్మ, స్వాసిక పాత్రలు బాగున్నాయి. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ సీన్ వరకు సినిమా వేగంగా సాగుతుంది. ఈ సినిమా థ్రిల్లర్ ప్రేక్షకులను అలరిస్తుంది అని ఓ యూజర్ రాసుకొచ్చాడు.

శంబాల ఒక డివైన్ సైంటిఫిక్ థ్రిల్లర్. ఆది సాయికుమార్ పర్ఫార్మెన్స్ బాగుంది. తన పాత్రలో ఆయన జీవించాడు. శ్రీచరణ్ పాకాల బీజీఎం అదిరిపోయింది. ఈ సినిమాకు నా రేటింగ్ 3/5 అని ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.

శంబాల చిత్రం ఆది సాయికుమార్‌కి స్ట్రాంగ్ కమ్ బ్యాక్‌ మూవీ. మిస్టరీ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఆది సాయికుమార్ పర్ఫార్మెన్స్, క్యారెక్టరైజేషన్, రవివర్మ పాత్ర, సాయికుమార్ వాయిస్ ఓవర్, కొన్ని సీన్లు, బీజీఎం, స్క్రీన్ ప్లే, ఇంటర్వెల్ సీక్వెన్స్‌‌లు శంబాల చిత్రంలో హైలైట్స్‌గా నిలిచాయి అని ఓ యూజర్ కామెంట్ పెట్టాడు.

చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. సూపర్బ్.. వెంటనే టికెట్ బుక్ చేసుకోండి. ఆది సాయికుమార్ అన్నా ఏం యాక్టింగ్ చేశావన్నా.. సూపర్ అంతే అని ఓ ట్విట్టర్ యూజర్ కామెంట్ పెట్టాడు.

ఫస్టాఫ్‌లో గ్రామంలోని దృశ్యాలు ఆకట్టుకున్నాయి. హార్రర్ ఎలిమెంట్స్ ఎఫెక్టివ్‌గా ఉన్నాయి. ఊహించలేని ఇంటర్వెల్ ట్విస్ట్ ఆసక్తికరంగా ఉంది. శంబాలలో ఎన్నో ఊహించని మలుపులు ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్‌లకు తగ్గ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, క్లైమాక్స్ అద్భుతంగా ఉంది. ఆది సాయికుమార్ నటన, సహాయ నటీనటులు కీలక సన్నివేశాలలో రాణించారు అని ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.

శంబాల అనవసరమైన డైవర్షన్స్ లేకుండా, తన కోర్ ఐడియాకి కట్టుబడి ఉండే ఒక ప్రయత్నం. ఈ నేపథ్య కథ ఆసక్తికరంగా, నమ్మశక్యంగా ఉంది. దీనికి సాయి కుమార్ గారి ప్రభావవంతమైన గాత్రం మరింత వన్నె తెచ్చింది. ఫస్టాఫ్ సినిమాపై ఆసక్తిని నిలబెడుతూ, క్యూరియాసిటీని కొనసాగించింది. ఆది సాయికుమార్ నటన బాగుంది, అర్చన అయ్యర్ గ్రామీణ వాతావరణానికి తగ్గట్లుగా సరిపోయింది. అయితే హార్రర్ ఎలిమెంట్స్‌ను మరింత బలంగా ఎగ్జిక్యూట్ చేయాల్సింది.

సినిమాలోని ప్రధానమైన సంఘర్షణ ఏంటో తెలిసిపోయాక.. సెకండాఫ్‌లో సినిమాలోని తదుపరి సన్నివేశం ప్రేక్షకులు ఊహించేలా ఉంది. ఇక్కడ ఎమోషనల్ ఇంపాక్ట్ తక్కువగా ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)ని ఎక్కువగా వినియోగించడంతో వీఎఫ్ఎక్స్ ప్రొడక్షన్ క్వాలిటీ తగ్గినట్లుగా అనిపించింది. మొత్తంగా ఆది సాయికుమార్‌ ఇటీవల నటించిన చిత్రాలలో శంబాలని ది బెస్ట్‌గా చెప్పొచ్చు అని ఓ యూజర్ రివ్యూ ఇచ్చాడు.

శంబాల నిన్న ప్రీమియర్ షో చూసాను. ఈరోజు పెయిడ్ ప్రివ్యూస్ ఉన్నాయి. రేపు సినిమా రిలీజ్ అవుతుంది.

కథ విషయంలోకి వస్తే శంబాలా అనే గ్రామంలో ఒక ఉల్క పడుతుంది. ఇక అక్కడి నుండి ఆ ఊరిలో జనాలు పిచ్చివాళ్లలా తయారవుతూ హత్యలు చేస్తూ ఉంటారు. ఈ ఉల్కను పరిశీలించడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చిన ఆది సాయికుమార్ ఎలా ఈ హత్యల మిస్టరీ ఛేదించాడు అనేది మిగతా కథ.

ఈ కథకి హర్రర్‌తో పాటూ డివోషనల్ ఎలెమెంట్స్ కలిపాడు దర్శకుడు యుగంధర్ ముని. కానీ ఈ సినిమాకు సరిపడా బడ్జెట్‌ని మాత్రం రాబట్టుకోలేకపోయాడు. ఈ విషయంలో తప్పు పట్టాల్సింది నిర్మాత రాజశేఖర్ అన్నభిమోజునే. కనీసం ఆది మేకప్ మీద కూడా సరైన శ్రద్ద తీసుకోలేదు. ఏదో 80లలో జరిగిన కథ అని చెప్పారు కనుక ఆలా చూపించొచ్చు అనుకున్నారేమో.

స్టోరీ వరకు సినిమా బాగానే ఉంది. స్క్రీన్ ప్లే లోనే సమస్యలు ఉన్నాయి. బాగానే వెళుతున్న దానిలో అక్కడక్కడా సీన్లు సాగదీసుకుంటూ పోయారు. ఈ మధ్య ప్రతి సినిమా 2.30 గంటలు ఉండాలి కనుక ఇది కూడా అలా ఉండాలనేమో. అందువలన ఫస్ట్ హాఫ్ పెద్దదిగా అనిపిస్తుంది.

సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి కథ రివీల్ అయ్యింది కనుక ఫాస్ట్ గానే నడిచింది. ముందే చెప్పినట్లు బడ్జెట్ లేనట్లు ఉంది కనుక సినిమాలో వీఎఫ్ఎక్స్ కూడా బాలేదు. క్వాలిటీ పెంచి ఉంటే వేరే లెవెల్‌లో సినిమా ఉండి ఉండేది. ఫస్టాఫ్‌లో సాగదీయడం తప్పిస్తే సినిమా బోర్ అయితే కొట్టదు. ఈ మధ్య వచ్చిన ఆది సాయికుమార్ సినిమాలతో పోలిస్తే ఇది డీసెంట్ గానే అనిపిస్తుంది.

ఫస్టాఫ్‌ మంచి కథతో మొదలవుతుంది. రవి వర్మ ఎంట్రీతో పాటు ఇంటర్వెల్ తర్వాత అసలు కథ మాస్‌గా మొదలవుతుంది. సెకండాఫ్‌లో బలమైన కథనం ఉంది. మనం మన ఎముకలను కూడా కదల్చలేం. ఆకట్టుకునే ఎమోషనల్ క్లైమాక్స్‌తో ఇది చూడదగ్గ చిత్రం అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.

More from Filmibeat

Read more about: aadi saikumar Shambhala
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X