Shambhala Movie Review: శంబాల మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: ఆది సాయికుమార్, అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక్, ఇంద్రనీల్, ప్రియ, నిర్మలమ్మ, హర్షవర్ధన్, మీసాల లక్ష్మణ్ తదితరులు
దర్శకుడు: యుగంధర్ ముని
నిర్మాత: రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి
ప్రొడ్యూసర్: శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫి: ప్రవీణ్ కె బంగార్రి
ఎడిటర్:శ్రవణ్ కటికనేని
ఆర్ట్ డైరెక్టర్: JK మూర్తి
ఫైట్స్: రాజ్‌కుమార్
కాస్ట్యూమ్ డిజైనర్:అయేషా మరియం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జెవి రామారావు
బ్యానర్: షైనింగ్ పిక్చర్స్
రిలీజ్ డేట్: 2025-12-25

శంబాల అనే గ్రామంలో ఉల్క పడటంతో ఊరిలోని వాతావరణ పరిస్థితులు, ప్రజల జీవితాల్లో దిగ్రాంతికరమైన సంఘటనలు చోటు చేసుకొంటాయి. ఉల్క పడటంతో జియాలజీ డిపార్ట్‌మెంట్‌ అధికారులు విక్రమ్ అనే జియాలజిస్ట్‌ను ఆ గ్రామానికి పంపుతారు. విక్రమ్ సైన్స్‌ను నమ్మితే.. గ్రామస్థులు మూడ నమ్మకాలను బలంగా నమ్ముతారు. దాంతో విక్రమ్‌పై శంబాల గ్రామ ప్రజలు ఆగ్రహంతో ఉంటారు. ఈ క్రమంలో గ్రామంలో హత్యలు, ఊహించని విధంగా మరణాలు సంభవిస్తుంటాయి.

Shambhala Movie Review

శంబాల గ్రామంలో ఉల్క పడిన తర్వాత పరిస్థితులు ఏరకంగా దిగజారాయి? ఊరిలో ప్రతికూల పరిస్థితులను ప్రజలు ఎలా స్పందించారు? శంబాలలో జరుగుతున్న సంఘటనలను చూసి విక్రమ్ రియాక్షన్ ఏమిటి? గ్రామంలో అసహజ మరణాలకు కారణం ఏమిటి? మిస్టీరియస్ డెత్‌ను విక్రమ్ ఎలా ఆపాలని అనుకొన్నాడు? గ్రామస్థులు విక్రమ్‌కు సహకరించారా? చివరకు గ్రామస్థుల మనోభావాలు, భక్తి అంశాలు విక్రమ్‌ను ఏమైనా మార్చాయా? భయానక పరిస్థితుల నుంచి ఆ గ్రామాన్ని విక్రమ్ ఎలా రక్షించాడు? అనే ప్రశ్నలకు సమాధానమే శంబాల సినిమా కథ.

దైవానికి, దుష్ట శక్తికి మధ్య జరిగే యుద్ధం నేపథ్యంగా శంబాల అనే గ్రామాన్ని సృష్టించి దాని చుట్టు దర్శకుడు యుగంధర్ ముని అల్లుకొన్న కథనే ఈ సినిమాను అన్ని వర్గాలను కనెక్ట్ చేసేలా చేస్తుందనే ఫీలింగ్ కలిగింది. తాను నమ్ముకొన్న కథ నుంచి ఏ మాత్రం డీవియేట్ కాకుండా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో కథను నడిపించిన విధానం దర్శకుడి విజన్, టాలెంట్ ఏమిటో తెలియజెప్పింది. ఫస్టాఫ్‌లో ఒకే రకమైన సంఘటనలు రిపీట్ కావడం కొంత రొటీన్ అనిపించినా.. వాటిని నేరేట్ చేసిన తీరు కొత్తగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్‌తో వావ్ అనిపించేలా ఫస్టాఫ్‌ను పాజిటివ్‌గా ముగించాడు.

ఇక సెకండాఫ్‌లో కూడా అదే దూకుడుతో పాత్రలను పరుగులు పెట్టించాడు. ముఖ్యంగా ఇంటెన్స్ యాక్టింగ్‌ను ఆర్టిస్టుల నుంచి రాబట్టుకొన్న విధానం బాగుంది. అంతా సవ్యంగా సాగినప్పటికీ.. క్లైమాక్స్ ఇంకాస్త కొత్తగా ఉండటం, లేదా డిఫరెంట్‌గా క్లోజ్ చేస్తే ఈ సినిమా రేంజ్ మరింత పెరిగి ఉండేదనే ఫీలింగ్ కలుగుతుంది. దర్శకుడు తాను ఏదైతే కథగా చెప్పాలనుకొన్నాడో.. అంతే కన్విక్షన్‌తో చెప్పిన తీరు ఈ సినిమాను సక్సెస్‌కు చేరువ చేసింది.

పాజిటివ్ పాయింట్స్:
ఆది సాయికుమార్ పెర్ఫార్మెన్స్
బలమైన కథ, గ్రిప్పింగ్ కథనాలు
శ్రీ చరణ్ పాకాల బీజీఎం
ప్రొడక్షన్ వాల్యూస్

నెగిటివ్ పాయింట్స్:
ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు సాగదీసినట్టు ఉండటం
క్లైమాక్స్ ఊహించినట్టే ముగియడం

ఇక నటీనటులు పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఆది సాయికుమార్ తన కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్‌ను చూపించాడు. విక్రమ్ పాత్రలో పూర్తిగా ఒదిగిపోవడమే కాకుండా మెచ్యురిటీతో కూడిన యాక్టింగ్‌తో ఆకట్టుకొన్నాడు. అన్ని రకాలుగా ఈ సినిమాలో వన్ మ్యాన్ షోగా నిలిచాడు. ఇక ఈ చిత్రంలో మీసాల లక్ష్మణ్ మరోసారి బెస్ట్ పెర్ఫార్మెన్స్‌తో మెప్పించాడు. అలాగే ఇంద్రనీల్, ఇతర నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

శంబాల చిత్రానికి శ్రీ చరణ్ పాకాల అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కారణంగా సన్నివేశాలు బాగా ఎలివేట్ అయ్యాయి. ఇక ప్రవీణ్ కే బంగార్రి చిత్రీకరించిన సన్నివేశాల వల్ల ఈ మూవీలో మంచి డివోషనల్ ఫ్లేవర్ కనిపించింది. ఆర్ట్ విభాగం పనితీరు.. లొకేషన్ల ఎంపిక చాలా బాగున్నాయి. శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ చేసిన విధానం సినిమాను పరుగులు పెట్టించింది. ఫైట్స్, ఇతర విభాగాలు చాలా బాగా పనిచేశాయి.

దైవ భక్తికి దుష్ట శక్తికి మధ్య జరిగే సంఘర్షణ, భక్తి, నమ్మకాలు, సైన్స్‌కు మధ్య నిలిచే సవాళ్లను కథగా మార్చుకొని రూపొందిన మిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ శంబాల. ఆది సాయికుమార్ ది బెస్ట్ ఫెర్ఫార్మెన్స్, డైరెక్టర్ యుగంధర్ టేకింగ్ ఈ సినిమాకు అత్యంత బలం. కథ, కథనాలు, ఎమోషనల్ కంటెంట్ ఈ సినిమాలో బెస్ట్ ఎలిమెంట్స్‌గా మారాయి. ఎలాంటి అంచనాలు పెట్టుకొన్నా ఈ సినిమా జస్టిఫికేషన్ ఇస్తుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన బెస్ట్ డివోషనల్, మిస్టిక్ థ్రిల్లర్. ఈ వారం థియేటర్‌లో తప్పకుండా చూడాల్సిన సినిమా. ఈ సినిమా వినోదాన్ని కాకుండా మంచి అనుభూతిని పంచుతుంది.

More from Filmibeat

Read more about: Shambhala aadi saikumar telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X