Shambhala First Review: శంబాల మూవీ ఫస్ట్ రివ్యూ
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన చిత్రం శంబాల: ఏ మిస్టికల్ వరల్డ్. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్, శైలజ ప్రియా, ఇంద్రనీల్, ప్రవీణ్, మీసాల లక్ష్మణ్, సిజ్జు మీనన్, హర్షవర్దన్ తదితరులు నటించారు.
ఈ సినిమాకు శ్రీచరణ్ పకాల మ్యూజిక్, ప్రవీణ్ కే బంగారి సినిమాటోగ్రఫి, శ్రవణ్ కటికనేని ఎడిటర్‌గా, జేకే మూర్తి ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. జేవీ రామారావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాల ద్వారా మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ కానుకగా రిలీజ అవుతున్నది. ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమా ఎలాంటి సర్టఫికెట్ ఇచ్చారు. వారి నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే..

శంబాల కథ విషయానికి వస్తే.. కొన్ని వేల సంవత్సరాల క్రితం పరమశివుడికి, అసురుడికి మధ్య జరిగిన ఓ భీకర యుద్దం.. ఈ కథకి మూలం. చావులో సైతం సైన్స్ ఉంటుంది. మీకు తెలిసిన శాస్త్రం మితం.. మీరు తెలుసుకోవాల్సిన మా శాస్త్రం అనంతం అనే కాన్సెప్ట్‌తో రూపొందించారు. ఓ గ్రామంపై ఆకాశం నుంచి ఉల్క పడిన తర్వాత గ్రామస్థుల ఏర్పడిన మూఢ నమ్మకం ఏమిటి? హీరో వారిని మార్చడానికి చేసిన ప్రయత్నం ఏమిటనే ప్రశ్నకు సమాధానమే ఈ సినిమా కథ.
శంబాల కథ డిమాండ్ చేయడంతో రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి రాజీ లేకుండా ఈ సినిమాను అద్బుతమైన విజువల్స్, బీజీఎం, యాక్షన్ సీక్వెన్స్‌తో పాన్ ఇండియా ఆడియెన్స్ అభిరుచికి ఏ మాత్రం తీసిపోని విధంగా కంటెంట్ ఉందనే అభిప్రాయాన్ని ట్రైలర్, ప్రమోషనల్ వీడియోలు స్పష్టం చేశాయి. ఈ సినిమాను వీక్షించిన తర్వాత సెన్సార్ బోర్డు అధికారులు స్వల్ప మార్పులు సూచించారు. కొన్ని మార్పులు చిత్ర యూనిట్ చేసింది. కానీ కథ డిస్ట్రబ్ చేసే సన్నివేశాలను మార్చకూడదనే నిర్ణయం కారణంగా చిత్ర యూనిట్ కొంత బోల్డ్ డిసిషన్స్ తీసుకొన్నట్టు సమాచారం.
అయితే మిస్టిక్ థ్రిల్లర్‌ను వీక్షించిన తర్వాత పెద్దగా అభ్యంతరాలు తెలియజేయకుండానే ఈ సినిమాకు క్లీన్ సర్టిఫికెట్ జారీ చేశారు. కొన్ని సన్నివేశాల కారణంగా ఈ సినిమాకు A సర్టిఫికెట్ జారీ చేశారు. అడల్డ్ కంటెంట్ కాకుండా యాక్షన్, కొన్ని బోల్డ్ సీన్ల కారణంగా ఈ సినిమాకు అలాంటి సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాను 16 ఏళ్ల దాటిన వారు ఎలాంటి అభ్యంతరం లేకుండా చూడొచ్చు అని సర్టిఫికెట్‌లో సెన్సార్ అధికారులు పేర్కొన్నారు.
శంబాల సినిమాలోని సన్నివేశాలు ఆద్యంతం థ్రిల్లింగ్‌గా ఉన్నాయనే విషయం సెన్సార్ రివ్యూ తర్వాత టాక్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఆలోచింపచేస్తాయి. ఆది సాయికుమార్ మెచ్యురిటీ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకొనేలా ఉంది. కథ, కథనాలు కట్టిపడేస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ హై స్టాండర్డ్‌లో ఉన్నాయి అనే విషయం సినీ వర్గాల్లో ప్రచారంలో ఉన్నాయి. ఈ సినిమా కంటెంట్ ఆడియెన్స్‌కు చక్కగా చెప్పేలా ఈ సినిమా నిడివిని 2 గంటల 24 నిమిషాలు అంటే.. 144 నిమిషాలకు ఫిక్స్ చేశారు అని సెన్సార్ పర్టిఫికెట్ తెలియజేసింది.


Click it and Unblock the Notifications











