twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శంభో శంకర మూవీ రివ్యూ: ‘పవర్’ఫుల్‌గా షకలక శంకర్

    By Rajababu
    |

    Recommended Video

    Shambo Shankara Movie Review శంభో శంకర మూవీ రివ్యూ

    Rating:
    2.5/5
    Star Cast: శంకర్, కారుణ్య చౌదరీ, నాగినీడు, అజయ్ ఘోష్, రవిప్రకాశ్
    Director: ఎన్ శ్రీధర్

    గీతాంజలి, రాజుగారి గది, ఆనందోబ్రహ్మ లాంటి చిత్రాల్లో కమెడియన్‌గా మంచి పేరు సంపాదించుకొన్న షకలక శంకర్ మరో అడుగు ముందుకు వేసి శంభో శంకర చిత్రంతో హీరోగా మారారు. డైరెక్టర్ శ్రీధర్ రూపొందించిన ఈ చిత్రానికి నిర్మాతలుగా రమణారెడ్డి, సురేష్ కొండేటి వ్యవహరించారు. శంకర్ సరసన కారుణ్య చౌదరి నటించారు. రైతులు, ఇతర సమస్యలను ఆధారంగా చేసుకొని రూపొందించిన ఈ చిత్రం జూన్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కమెడియన్ ప్రేక్షకులను ఇప్పటికే మెప్పించిన శకలక శంకర్ హీరోగా ఏ విధమైన రెస్పాన్స్‌ను సంపాదించుకొన్నారో తెలుసుకోవాలంటే శంభో శంకర్ చిత్ర కథలోకి వెళ్లాల్సిందే.

    శంభో శంకర్ స్టోరి

    శంభో శంకర్ స్టోరి

    శంకర్ (షకలక శంకర్) నిజాయితీ కల యువకుడు. ఎస్సై ఉద్యోగం చేసి సమాజాన్ని ఉద్దరించాలనే తలంపుతో ఉంటాడు. అంతేకాకుండా ఊరి జమీందార్ ఆగడాలను ఎదురిస్తుంటాడు. ఎస్సై ఉద్యోగం కోసం వెళితే చేదు అనుభవం ఎదురవుతుంది. ఈ క్రమంలో తన చెల్లెలు దారుణ హత్యకు గురి అవుతుంది. తన చెల్లెలి మరణానికి కారణమైన జమీందార్‌ అంతు చూస్తానని హెచ్చరిస్తాడు. శంకర్‌లోని తెగువను చూసి జిల్లా ఎస్పీ స్వయంగా ప్రత్యేక అధికారాలు ఇస్తాడు.

    కథలో ట్విస్టులు ఇలా

    కథలో ట్విస్టులు ఇలా

    ఎస్పీ ఇచ్చిన ప్రత్యేక అధికారాలతో శంకర్ ఏం చేశాడు? శంకర్ చెల్లి మరణానికి కారణం ఏమిటి? జమీందార్ ఆగడాలకు అంతం ఎలా పలికాడు? ఊరి కోసం సొంత అన్న చేసే అక్రమాలను ఎలా ఎదుర్కొన్నాడు. తనను ఇష్టంగా ప్రేమించే ప్రియురాలితో కలిసి ఆటపాటలతో ఎలా అలరించాడు. ఊరిలోని సమస్యలకు ఎలాంటి పరిష్కారం చూపారన్న ప్రశ్నలకు తెర మీద శంకర్ చేసిన మ్యాజిక్ ఈ చిత్ర కథ.

    ఫస్టాఫ్ అనాలిసిస్

    ఫస్టాఫ్ అనాలిసిస్

    కథ విషయానికి వస్తే శంకర్ బాడీ లాంగ్వేజికి అనుగుణంగానే పక్కా రొటిన్ స్టోరీని దర్శకుడు శ్రీధర్ అల్లుకొన్నాడు. మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకొనేందుకు రెగ్యులర్ ఫార్మాలనే అనుసరించాడు. తొలిభాగంలో శంకర్‌తో ఫైట్లు, పాటలు, మోతాదు మించిన డైలాగ్స్‌తోనే ముందుకెళ్లాడు. చెల్లెలు మరణం తర్వాత రెండు భావోద్వేగమైన సన్నివేశాలతో ఇంటర్వెల్ కార్డు వేశాడు. అప్పటివరకు పరమ రొటీన్‌గా ఉందనుకునే ఆడియెన్స్‌కు ఓ కిక్కెంచే ప్రయత్నం చేశారు.

    సెకండాఫ్ అనాలిసిస్

    సెకండాఫ్ అనాలిసిస్

    ఇక సెకండాఫ్‌లో రైతులు, గ్రామ సమస్యలు పరిష్కరించే అంశాలతో, జమీందార్ ఆగడాలకు అంతం పలికే సన్నివేశాలతో కథ సాగుతుంది. సినిమా రెండో భాగంలో సమకాలీన పరిస్థితులపై దృష్టిసారించారనే ఫీల్ కలుగుతుంది. కాకపోతే కథను బలంగా చెప్పలేకపోవడం కొంత నిరాశకు గురిచేస్తుంది. అయితే బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు మెప్పించేందుకు క్లైమాక్స్‌లో వచ్చే సీన్లు ప్రేక్షకుల్లో నెలకొన్న కొంత అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం చేస్తుంది.

    డైరెక్టర్ శ్రీధర్ పనితనం

    డైరెక్టర్ శ్రీధర్ పనితనం

    తన స్నేహితుడు షకలక శంకర్‌ను హీరోగా నిలబెట్టాలని దర్శకుడు శ్రీధర్ చేసిన ప్రయత్నమే శంభో శంకర. షకలక శంకర్ స్టామినాకు తగినట్టు కాకుండా కాస్త ఎక్కువగానే మసాలా దట్టించాడు. హీరోగా మొదటి చిత్రంతోనే శంకర్‌పై మరింత భారం వేసే ప్రయత్నం జరిగిందనిపిస్తుంది. కాకపోతే తొలి చిత్ర దర్శకుడని ఎక్కడా అనిపించదు. కొన్ని సందర్బాల్లో కథను వదిలేసి దూరంగా వెళ్తున్నాడా అనే ఫీలింగ్ కలగడం సహజం. కొన్ని చోట్ల తడబాటుకు గురయ్యాడని చెప్పవచ్చు. కథపై మరింత దృష్టిపెడితే బాగుండేదేమో అభిప్రాయం కలుగుతుంది. కథలో పవన్ కల్యాణ్‌ను కొన్ని చోట్ల చూపించి అభిమానులను ఆకట్టుకొన్నాడు.

    శకలక శంకర్ ఫెర్ఫార్మెన్స్

    శకలక శంకర్ ఫెర్ఫార్మెన్స్

    ఇప్పటి వరకు కామెడీతో షకలక శంకర్ తెర మీద మెరిసాడు. హీరోగా అంటే కొంత ఆశ్చర్యం కలిగినప్పటికీ ట్రైలర్ల తీరు చూసి ఆయనపై కొన్ని సందేహాలు తీరిపోయాయి. ఒక వెండితెరపైన ఎలా రాణిస్తాడు అనే విమర్శకుల ప్రశ్నలకు గట్టిగానే సమాధానం చెప్పారనే అభిప్రాయం కలుగుతుంది. ఫైట్స్, డాన్యులతో అదరగొట్టాడు. ఎమోషనల్ సీన్లలో చక్కగా ఆకట్టుకొన్నాడు. మంచి కథ, రోల్ లభిస్తే ప్రేక్షకులను మెప్పించడం కష్టమేమి కాదని చెప్పకనే చెప్పాడు. చాలా సన్నివేశాల్లో పవర్ స్టార్‌‌ను స్ఫూర్తిగా తీసుకొన్నట్టు కనిపిస్తుంది.

    హీరోయిన్‌గా కారుణ్య చౌదరీ

    హీరోయిన్‌గా కారుణ్య చౌదరీ

    ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా పార్వతి పాత్రలో కారుణ్య చౌదరీ నటించింది. కథలో పెద్దగా ఆమెకు ప్రాధాన్యం లేకపోవడంతో ఆమె కొన్ని సీన్లకే పరిమితం అయ్యారు. కాకపోతే కనిపించిన సీన్లలో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ చిత్రంలో ఆటపాటలకే పరిమితం కావడంతో తన ప్రతిభను చాటుకోలేకపోయారా అనే సందేహం కలుగుతుంది.

    మిగితా పాత్రల్లో

    మిగితా పాత్రల్లో

    ఈ చిత్రంలో నాగినీడు, అజ‌య్ ఘోష్, ర‌వి ప్రకాష్, ప్రభు, ఏడిద శ్రీరామ్ కీలక పాత్రలు పోషించారు. విలన్‌గా అజయ్ ఘోష్ తనదైన నటనను ప్రదర్శించాడు. తండ్రి పాత్రలో ఏడిద శ్రీరాం నటన ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తుంది. రవిప్రకాశ్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఫర్వాలేదనిపించారు.

    సాయి కార్తీక్ మ్యూజిక్

    సాయి కార్తీక్ మ్యూజిక్

    శంభో శంకర చిత్రానికి సంగీత దర్శకుడు సాయి కార్తీక్ స్వరాలు సమకూర్చారు. గుచ్చుకొన్నదే, ఓ నీల కళ్ల పాప, పసిడి పాటలు మెలోడిగా సాగాయి. అమ్మో అమ్మోరు పాట మాస్‌గా సాగింది. ఈ సినిమాకు సాయి కార్తీక్ అందించిన రీరికార్డింగ్ అదనపు ఆకర్షణ.

    ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ

    ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ

    శంభో శంకర చిత్రానికి చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలను చక్కగా నిర్వర్తించారు. కాకపోతే ఫస్టాఫ్‌లో తన కత్తెరకు మరికొంత పదను పెట్టాల్సింది. ఎస్ రాజశేఖర్ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. శంకర్‌ను ఓ రేంజ్‌లో చూపించడం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ఈ చిత్రానికి వై రమణారెడ్డి, సురేష్ కొండేటి నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని ఆర్ ఆర్ పిక్చర్స్, ఎస్కే బ్యానర్‌పై రూపొందించారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఈ చిత్రంపై పెట్టిన ప్రతీపైసా తెర మీద కనిపించింది.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    షకలక శంకర్‌ను హీరోగా పరిచయం చేయడానికి ఎలాంటి ప్రయోగాలకు వెళ్లకుండా కొత్త సీసాలోనే పాత సారాను పోసి రూపొందించిన చిత్రం శంభో శంకర. విభిన్న చిత్రాలను కోరుకునే వారికి కొంత అసంతృప్తి ఉంటుంది. తన కామెడీని ఆనందించే వారికి షకలక శంకర్ డ్యాన్సులు, ఫైట్లు, ఎమోషనల్ టాలెంట్‌తో అదనంగా బోనస్ ఇచ్చారని చెప్పవచ్చు. బీ, సీ సెంటర్లలో ఈ చిత్రానికి ఆదరణ లభిస్తే రెవెన్యూపరంగా మంచి ఫలితం రాబట్టే అవకాశం ఉంది.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్
    షకలక శంకర్ యాక్టింగ్
    సాయికార్తీక్ మ్యూజిక్
    టేకింగ్

    మైనస్ పాయింట్స్
    కథ
    రొటీన్ సన్నివేశాలు

    తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    నటీనటులు: శంకర్, కారుణ్య చౌదరీ, నాగినీడు,అజయ్ ఘోష్, రవిప్రకాశ్, ఏడిద శ్రీరాం తదితరులు
    కథ, దర్వకత్వం: ఎన్ శ్రీధర్
    నిర్మాత: వై రమణారెడ్డి, సురేష్ కొండేటి
    సంగీతం: సాయికార్తీక్
    సినిమాటోగ్రఫీ: ఎస్ రాజశేఖర్
    ఎడిటింగ్: చోటా కే ప్రసాద్
    బ్యానర్: ఆర్ ఆర్ పిక్చర్స్, ఎస్కే బ్యానర్‌
    రిలీజ్ డేట్: జూన్ 29, 2018

    English summary
    Comedian Shakalaka Shankar decided to try out his luck as the male lead in films. He is reportedly making his lead debut in the film ‘Shambho Shankara’ to be directed by newcomer N Sreedhar. Ramana Reddy and Suresh Kondeti are producing the film under SK Pictures banner. This movie lyrical song released by VV Vinayak. Recently director Harish Shankar releases Shambo Shankara teaser and made sensational comments on Shakalaka Shankar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X