Shanmukha Movie Review: షణ్ముఖ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.5/5

నటీనటులు: ఆది సాయికుమార్, అవికా గోర్, ఆదిత్య ఓం, చిరాగ్ జానీ, షణ్ముగం సాప్పని, వీరశంకర్, కృష్ణుడు, అరియానా గ్లోరి, సీవీఎల్ నరసింహారావు, ముఖ్తార్ ఖాన్, చిత్రం శ్రీను, జబర్దస్త్ దొరబాబు తదితరులు
రచన, దర్శకత్వం: షణ్ముగం సాప్పని
నిర్మాత: తులసీరామ్ సాప్పని, రమేష్ యాదవ్, షణ్ముగం సాప్పని
బ్యానర్: సాప్‌బ్రో ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్
మ్యూజిక్: రవి బస్రూర్
కథ: సతీష్ ఆకేటి
ఎడిటర్: ఎంఏ మాలిక్
సినిమాటోగ్రఫి: ఆర్ఆర్ విష్ణు
రిలీజ్ డేట్: 2025-03-21

ఎలాంటి వైద్య వసతులు లేని మారుమూల గ్రామంలో నిత్యం పూజలు చేసే ఉపాసకుడు విగాండ (చిరాగ్ జానీ) దంపతులకు ఆరు ముఖాలతో కురూపిగా ఉన్న కుమారుడు జన్మిస్తాడు. ఆ బాలుడి ముఖం చూసిన వారాంత షాక్ గురవుతుంటారు. తన కుమారుడికి విగాండ షణ్ముఖ అని నామకరణం చేస్తాడు. తన కుమారుడు కూరుపి అవతారం నుంచి అందగాడుగా కావడానికి మాంత్రికుడు సలహాతో ఓ ప్రయత్నం చేస్తుంటాడు. ఇదిలా ఉండగా, కార్తీ (ఆది సాయికుమార్) పోలీస్ ఆఫీసర్. డ్రగ్స్ మాఫియాను పట్టుకొనేందుకు వెళ్లిన సమయంలో జరిగిన దాడిలో తన పిస్టల్ కోల్పోతాడు. ఇక కాలేజీలో లవర్ సారా (అవికా గోర్) క్రిమినాలజీపై రీసెర్చ్ చేసి.. అదృశ్యం అవుతున్న అమ్మాయిల ఆచూకీ కోసం ఆరా తీస్తుంటుంది.

Shanmukha Movie Review

తన కుమారుడిని అందగాడిగా చేయడానికి విగాండ ఎలాంటి నేరాలకు పాల్పడ్డాడు? అమ్మాయిల అదృశ్యానికి విగాండకు ఎదైనా సంబంధం ఉందా? కార్తీ, సారా ఎందుకు విడిపోయారు? కార్తీ, సారా మధ్య మళ్లీ ప్రేమ చిగురించిందా? పొగొట్టుకొన్న తుపాకిని కార్తీ సంపాదించుకొన్నాడా? సారాను విగాండ మనుషులు కిడ్నాప్ చేసి ఏం చేశారు? ఈ కథలో శ్రీకాంత్, కౌశిక్ (కౌశిక్), వర్షిత (అరియానా గ్లోరి), కమల్ (ఆదిత్య ఓం) పాత్రలు ఏంటి? షణ్ముఖ చివరికి అందగాడుగా మారాడా? అనే ప్రశ్నలకు సమాధానమే షణ్ముఖ సినిమా కథ.

ఆరు ముఖాలు ఉన్న కురూపి షణ్ముఖ జననంతో సినిమా కథ ఆసక్తిగా మొదలవుతుంది. అయితే షణ్ముఖను అందగాడుగా చేయాలనే తండ్రి విగాండ ప్రయత్నాలు ఏం విధంగా ఉంటాయనే క్యూరియాసిటీని దర్శకుడు క్రియేట్ చేశారు. కానీ కథను సామాజిక అంశాలు, డ్రగ్స్ యాక్టివిటీస్ వైపు మళ్లించడం వల్ల కథ ట్రాక్ తప్పిందా? అనే అనుమానం కలుగుతుంది. షణ్ముఖ ఎపిసోడ్ వరకు రకరకాల పాత్రలు, వారి మధ్య సన్నివేశాలు ప్రేక్షకుడిని గందరగోళానికి గురి చేస్తాయి. దర్శకుడు ఎంచుకొన్న స్క్రీన్ ప్లే కూడా కాంప్లికేటెడ్‌గా ఉండటంతో ఏం జరుగుతుందనే విషయం అర్ధం కాదు. కానీ చివరి 20 నిమిషాలు కథను నడిపించిన విధానం దర్శకుడికి కథపై ఉన్న పట్టు ఏమిటో తెలుస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే.. ఆది సాయికుమార్ పోలీస్ ఆఫీసర్‌గా తన పాత్రలో ఒదిగిపోయాడు. ఆ క్యారెక్టర్ తగినట్టుగా యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్‌ను చక్కగా చూపించాడు. కథలో వేరియేషన్స్ ఎక్కువగా ఉండటం.. అలాగే పాత్రలు కూడా ఎక్కువగా ఉండటం వల్ల సోలోగా ఆది చేయడానికి స్కోప్ లేకపోయింది. అవిక గోర్ గ్లామర్‌తోపాటు ఫెర్ఫార్మెన్స్‌తో మెప్పించే ప్రయత్నం చేసింది. చిరాగ్ జానీ, ఆదిత్య ఓం తదితరులు ఫర్వాలేదనిపించారు. ఆరియానా గ్లోరి ఇతరులు అతిథి పాత్రలకే పరిమితమయ్యారు.

Shanmukha Movie Review

టెక్నికల్ విషయానికి వస్తే..ఈ సినిమాకు అసలు సిసలైన హీరో రవి బస్రూర్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో పలు సన్నివేశాలను బాగా ఎలివేట్ చేశాడు. చివరి 20 నిమిషాలు సినిమాలో రవి బస్రూర్ మార్క్ కనిపించింది. మిగితా సాంకేతిక అంశాలు ఫర్వాలేదనిపిస్తాయి. తులసీరామ్ సాప్పని, రమేష్ యాదవ్, షణ్ముగం సాప్పని అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. చివర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో క్రియేట్ చేసిన సాంగ్ ఆకట్టుకొనేలా ఉంది.

కమర్షియల్ వాల్యూస్‌ కలిపి చేసిన డివోషనల్ థ్రిల్లర్ షణ్ముఖ. కథాపరంగా మంచి పాయింట్‌తో దర్శకుడు షణ్ముగం చేసిన ప్రయత్నం బాగానే ఉంది. కథను బలమైన సన్నివేశాలుగా విడగొట్టడంలో, రాసుకోవడంలో సరిగా దృష్టిపెట్టాలేదా? అనిపిస్తుంది. సినిమా ఓపెనింగ్, క్లోజింగ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మధ్యలో వచ్చే సన్నివేశాలు, కథ, కథనాలు కొంత వీక్‌గా అనిపిస్తాయి. క్రైమాక్స్‌లో కంటెంట్ పరంగా, రవి బస్రూర్ మ్యూజిక్ పరంగా ఓ మ్యాజిక్ చేసే ప్రయత్నం అభినందనీయం. డివోషనల్ థ్రిల్లర్స్ చూడాలనే ఆసక్తి ఉన్నవారు షణ్ముఖ సినిమాను చూడొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X