Shashtipoorthi First Review: షష్టిపూర్తి తెలుగు సినిమా ఫస్ట్ రివ్యూ

నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'షష్టిపూర్తి'. ఈ మూవీని మా ఆయి (MAA AAIE) ప్రొడక్షన్స్ పతాకంపై రూపేశ్ నిర్మించిన ఈ చిత్రానికి పవన్ ప్రభ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అర్చన, రూపేశ్, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రలను పోషించారు. ఈ చిత్రాన్ని మే 30న విడుదల చేయబోతోన్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్, కుటుంబ కథా చిత్రాలు, విలువలను చాటి చెప్పే కథల్ని నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి ఓ సందేశాత్మక చిత్రంగా 'షష్టిపూర్తి' సినిమాను రూపేశ్ నిర్మించారు.

షష్టిపూర్తి కథను రాజేంద్ర ప్రసాద్ కోసమే రాశారా అనిపిస్తుంది. పవన్ ప్రభ ఈ సినిమా కథను బాగా రాశాడు. ఈ సినిమాలోని భావోద్వేగాలు అందర్నీ కట్టిపడేస్తాయి. అర్చన మరోసారి పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. రూపేశ్, ఆకాంక్ష బాగా నటించారు. ఇళయ రాజా సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. తోట తరణి ఆర్ట్ వర్క్ ఈ సినిమాను సజీవంగా మార్చేసింది. పాటలు చాలా బాగున్నాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

Shashtipoorthi Censor Board Review

షష్టిపూర్తి చిత్రం పక్కా ఫ్యామిలీ స్టోరి. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అంశాలను ఆధారంగా చేసుకొని పవన్ ప్రభ ఈ సినిమాను రూపొందించారు. రాజేంద్ర ప్రసాద్, అర్చన తమ పాత్రల్లో జీవించారు. అందమైన ప్రేమ కథ కూడా ఉంటుంది. ఈ మధ్య కాలంలో అలాంటి ఓ సింపుల్, సెన్సిబుల్ లవ్ స్టోరీ రాలేదు. రూపేశ్ ఆకాంక్ష చక్కగా నటించారు. కమర్షియల్ కోసం ఎలాంటి అనవసరపు అంశాల్ని జోడించలేదు. కథకు తగ్గట్టుగా ఇళయరాజా గారు అద్భుతమైన సంగీతం, పాటలు అందించారు. యువన్ శంకర్ రాజా గారు పాడిన ఎరోటిక్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటుంది అని ఓ నెటిజన్ తన రివ్యూను అందించారు.

ఇక ఈ సినిమాను ఇటీవల సెన్సార్ సభ్యులు, అధికారులు వీక్షించారు. ఈ సినిమాకు ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చారు. కుటుంబ సమేతంగా చక్కగా చూడాల్సిన సినిమా ఇది అనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇలాంటి కథను అందించిన సినిమా యూనిట్‌ను సెన్సార్ అధికారులు ప్రశంసలు అందించారు. రాజేంద్ర ప్రసాద్, అర్చన పెర్ఫార్మెన్స్‌ పట్ల వారు పూర్తిగా సంతృప్తిని వ్యక్తం చేసినట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఈ సినిమాలోని బంధాలు, అనుబంధాలు అందర్నీ ఆకట్టుకొంటాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇళయరాజా సంగీతం, తోట తరణి ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ డిజైన్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లే అంశాలు అని ఫీలయ్యారు. చక్కటి కుటుంబ విలువల కలిగిన షష్టిపూర్తి సినిమాకు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ అందించారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X